Dakshina Kali
జ్యోతిషం పనిచేస్తుందా!.......By Dakshina Kali
‘సాధారణంగా జ్యోతిషం చెప్పేవారు, మన గ్రహాల స్థితిగతుల ఆధారంగా కాకుండా, ఏళ్ల తరబడి ఏర్పడిన అంతర్‌దృష్టితో (ఇన్‌ట్యూషన్) చెప్పేస్తూ ఉంటారు. నేను కావాలనుకుంటే పదేళ్ల తరువాత ఒకరి జీవితంలో ఏం జరగబోతోందో చెప్పేయగలను. నా దగ్గర యోగసాధన చేసేవారు కూడా ఇలాంటి పనులు చాలా చేయగలరు. కానీ వాళ్లని మేం ఏమాత్రం ప్రోత్సహించం. ఎందుకంటే ఒకరి భవిష్యత్తును గురించి చెప్పడం వల్ల, వారి జీవితాన్ని మనం ఏ మాత్రమూ మార్చలేము. వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి అది ఏమాత్రం తోడ్పడదు. పైగా అది ఒక రకంగా వారిని మరింత అజ్ఞానంలోకి నెట్టడమే అవుతుంది. నిజంగా రేపటి గురించి మీకు తెలిసిపోయిందనుకోండీ... మీరు మరింత అజ్ఞానిగా, అహంకారిగా, దుర్మార్గుడిగా మారిపోతారు. నిజంగా రేపన్నది మీకు తెలిసిపోతే, ఇవాల్టి క్షణాన్ని మీరు అనుభవించలేరు. ఉదాహరణకు మీరు ఏం చేసినా చావు రాదని చెప్పాననుకోండి, ప్రపంచంలోని ప్రతి మూర్ఖమైన పనినీ మీరు చేస్తారు. లేదా మీరు ఏం చేసినాగానీ రేపు ఉదయానికి చనిపోతారని చెబితే.... ఇవాల్టి క్షణం మీదే విరక్తి కలుగుతుంది. ఇంతకీ అవతలివారి భవిష్యత్తు గురించి ఎవరన్నా చెప్పగలరా అంటే తప్పకుండా చెప్పగలరు! కానీ అది ఎప్పుడూ నూటికి నూరు శాతం నిజమవ్వాలని లేదు.

No comments:
Post a Comment