రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Sunday, 31 December 2017
జ్ఞానయోగః 5 (అథ చతుర్థోధ్యాయః, శ్రీ భగవద్గీత)
యథైధాంసి సమిద్ధోగ్ని
ర్భస్మసాత్కురుతేర్జున,
జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి
భస్మసాత్కురుతే తథా.
అర్జునా! బాగుగ ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెల నేప్రకారము బూడిదగాజేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్తకర్మములను భస్మ మొనర్చివైచుచున్నది.
న హి జ్ఞానేన సదృశం
పవిత్ర మిహ విద్యతే,
తత్స్వయం యోగసంసిద్ధః
కాలేనాత్మని విందతి.
ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదియును లేదు. అట్టి జ్ఞానమును (కర్మ) యోగస్థితిని బొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగ పొందుచున్నాడు .
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః,
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి
మచిరేణాధిగచ్చతి.
(గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మిక సాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగా జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.
అజ్ఞ శ్చాశ్రద్దధానశ్చ
సంశయాత్మా వినశ్యతి,
నాయం లోకోస్తి న పరో
న సుఖం సంశయాత్మనః.
జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.
యోగసన్మ్యస్త కర్మాణం
జ్ఞాన సంఛిన్న సంశయమ్,
ఆత్మవంతం న కర్మాణి
నిబధ్నంతి ధనంజయ.
ఓ అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మ ఫలములను త్యజించినవాడును, (లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును), జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని (బ్రహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు.
తస్మాదజ్ఞాన సంభూతం
హృత్థ్సం జ్ఞానాసినాత్మనః,
ఛిత్వైనం సంశయం యోగ
మాతిష్ఠోత్తిష్ఠ భారత.
ఓ అర్జునా! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు, అజ్ఞానము వలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమను ఖడ్గముచే చేదించివైచి నిష్కామకర్మయోగము నాచరించుము. లెమ్ము.
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః
శ్రీ మద్భగవద్గీత గురించి
భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||
శ్లోకం అర్ధం :
భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని).
|| వసుదేవసుత౦ దేవ౦ క౦సఛాణూర మర్ధన౦
దేవకీపరమాన౦ద౦ కృష్ణ౦ వ౦దే జగద్గురు౦ ||
భగవద్గీత సారం:
నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు? నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది. గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. నీకు ఇవ్వబడినదేదో అది ఇక్కడే ఇవ్వబడింది. నీవు తీసుకున్నది ఈ ప్రపంచంనుండే తీసుకోబడింది. నీవు యిచ్చింది, ఈ ప్రపంచం నుండీ తీసుకున్నదే. నీవు వట్టి చేతులతో వచ్చావు. వట్టి చేతులతో పోతావు. ఈరోజు నీదైనది. గతంలో అది మరొకడిది. అదే ఆ తరువాత మరొకడిది అవుతుంది. నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు. దానిలో లీనమైపోతున్నావు. ఈ అనుబంధమే అన్ని దుఖాలకు మూలకారణం.
మార్పు అన్నది జీవితపు నియమం. ఒక్క క్షణంలో నీవు లక్షాధిపతివి ఆ తరువాత క్షణంలో నీవు బికారివి. ఈ శరీరం నీది కాదు. అంతేకాదు నీవి ఈ శరీరం కానే కావు. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఇవి పంచభూతాలు. వీటితో నీ శరీరం ఏర్పడింది. చనిపోయిన తరువాత ఈ పంచభూతాలు అవి వచ్చిన చోటుకు వెనుతిరిగిపోతాయి. కానీ ఆత్మ అన్నది మరణం లేనిది. అది నిరంతరమైనది. అటువంటప్పుడు నీవు ఎవరివి? భగవంతుని శరణుజొచ్చు. అతడే అంతిమ ఆధారం. ఈ అనుభవాన్ని పొందిన వ్యక్తి భయం, దిగులు, నిరాశల నుండీ పూర్తిగా ముక్తుడై ఉంటాడు. నీవు చేసే ప్రతి ఒక్క పని అతడికి అర్పించు. ఈవిధంగా చేయడం వల్ల, కలకాలం నిలిచిపోయే సచ్చితానందాన్ని నీవు పొందుతావు.
గీతా మాహాత్మ్యము -3 వ భాగం
గీతాయాః పఠనం కృత్వా
మహాత్మ్యం నైవ యః పఠేత్,
వృథా పాఠో భవేత్తస్య
శ్రమ ఏవ హ్యుదాహృతః.
గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యము నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫల మునివ్వక) వ్యర్థమే యగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమమాత్రమే యని చెప్పబడినది.
ఏతన్మాహాత్మ్యసంయుక్తం
గీతాభ్యాసం కరోతి యః,
స తత్ఫల మవాప్నోతి
దుర్లభాం గతిమాప్నుయాత్.
ఈ మాహాత్మ్యముతో బాటు గీతాపారాయణము చేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు.
మాహాత్మ్య మేతద్గీతాయా
మయా ప్రోక్తం సనాతనం,
గీతాంతే చ పఠేద్యస్తు
యదుక్తం తత్ఫలం లభేతే
సూతుడు చెప్పెను. ఓ శౌనకాదిమహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును నేను మీకు తెలిపితిని. ఇద్దానిని గీతాపారాయణానంతర మెవడు పఠించునో అతడు పైన దెల్పిన ఫలమును బొందును.
ఇతి శ్రీవరాహపురాణే శ్రీ గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.
గీతా మాహాత్మ్యము -2 వ భాగం
పాఠేసమర్థస్సంపూర్ణే
తదర్ధం పాఠ మాచరేత్,
తదా గోదానజం పుణ్యం
లభతే నాత్ర సంశయః
గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు.
త్రిభాగం పఠమానస్తు
గంగాస్నానఫలం లభేత్,
షడంశం జపమానస్తు
సోమయాగఫలం లభేత్.
గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) పఠించువారికి సోమయాగఫలము లభించును .
ఏకాధ్యాయం తు యోనిత్యం
పఠతే భక్తి సంయుతః,
రుద్రలోక మవాప్నోతి
గణోభూత్వా వసేచ్చిరమ్
ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో, అతడు రుద్ర లోకమునుపొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును.
అధ్యాయ శ్లోకపాదం వా
నిత్యం యః పఠతే నరః,
స యాతి నరతాం యావ
న్మనుకాలం వసుంధరే.
ఓ భూదేవీ! ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో, అతడు ఒక మన్వంతర కాలము (ఉత్కృష్టమగు) మానవ జన్మను బొందును.
గీతాయాః శ్లోక దశకం
సప్త పంచ చతుష్టయమ్,
ద్వౌత్రీనేకం తదర్ధం వా
శ్లోకానాం యః పఠేన్నరః.
చంద్రలోక మవాప్నోతి
వర్షాణా మయుతం ధ్రువమ్,
గీతాపాఠసమాయుక్తో
మృతో మానుషతాం వ్రజేత్.
గీతయందలి పది స్లోకములుకాని, లేక ఏడుకాని, ఐదుకాని, నాలుగుకాని, మూడుకాని, రెండుకాని, ఒకటికాని లేక కనీసము అర్ధశ్లోకమును గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమునుబొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో, అతడు ఉత్తమమగు మానవజన్మమును బడయగల్గును.
గీతాభ్యాసం పునఃకృత్వా
లభతే ముక్తి ముత్తమామ్,
గీతేత్యుచ్చారసంయుక్తో
మ్రియమాణో గతిం లభేత్.
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. 'గీతా - గీతా' అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును.
గీతార్థ శ్రవణాసక్తో
మహాపాపయుతోపి వా,
వైకుంఠం సమవాప్నోతి
విష్ణునా సహ మోదతే.
మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో సహా ఆనంద మనుభవించుచుండును.
గీతార్థం ధ్యాయతే నిత్యం
కృత్వా కర్మాణి భూరిశః,
జీవన్ముక్తస్స విజ్ఞేయో
దేహాంతే పరమం పదమ్.
ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను.
గీతామాశ్రిత్య బహవో
భూభుజో జనకాదయః,
నిర్ధూతకల్మషా లోకే
గీతాయాతాః పరమం పదమ్.
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి.
NASA's 2018 To-Do List Includes Mission To 'Touch' Sun
NASA's Parker Solar Probe is scheduled for launch in 2018 to explore the Sun's outer atmosphere.
NASA's Parker Solar Probe is scheduled for launch in 2018 to explore the Sun's outer atmosphere.
The spacecraft will fly through the Sun's atmosphere as close as 6.2 million kilometres to the star's surface, well within the orbit of Mercury and closer than any spacecraft has gone before.
The Parker Solar Probe will perform its scientific investigations in a hazardous region of intense heat and solar radiation.
In 2018, NASA will also add to its existing robotic fleet at the Red Planet with the InSight Mars lander designed to study the interior and subsurface of the planet.
The US space agency's first asteroid sample return mission, OSIRIS-REx, is scheduled to arrive at the near-Earth asteroid Bennu in August 2018, and will return a sample for study in 2023.
Launching no later than June 2018, the Transiting Exoplanet Survey Satellite (TESS) will search for planets outside our solar system by monitoring 200,000 bright, nearby stars.
To continue the long-term record of how Earth's ice sheets, sea level, and underground water reserves are changing, NASA will also launch the next generation of two missions - ICESat-2 and GRACE Follow-On - in 2018.