Monday, 5 June 2017

7.అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలి.జెండాలను ఏజెండాలను పక్కనపెట్టి ఒక ఐక్య కార్యాచరణ రూపొందించి అసలు దోషులను పట్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకి అందరికీ ఉంది. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి సంపాదించుకోవాల్సిన బాధ్యత అందరిదీ.


All the songs from the divine trance 


1.15000 కోట్ల విలువైన 700 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిన విషయంలో #72 సబ్ రిజిష్ట్రార్లను బదిలీ చేయడం అనేది ఈ భూకుంభకోణం సెగ తగలకుండ జాగ్రత్తపడడమే అవుతుంది! అందుచేత దోషులను పట్టుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.
2.కేవలం పాత్రధారులైన కొద్దీ మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం అసలు సూత్రధారులను వదిలివేయటమే! అసలు దొంగలను బయటకు తీసుకురావాలి.
3.అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడి భార్య ఐన ఐఏఎస్ అధికారినణిని సమీక్షలో భాగం చేయడంలో..ఆంతర్యం ఏంటి? సమీక్షయొక్క నిబద్ధత ఎంత?
4. ఏ అధికారిక హోదా లేని నమస్తే తెలంగాణ దామోదర్ రావు గారిని సమీక్షలో ఎందుకు భాగం చేశారో తెలవాలి!?
5.ట్రినిటీ ఇన్ఫ్రా సంస్థ పేరు మీద రిజిస్టర్ అయిన S క్లాస్ బెంజ్ AP 10 EH 6666 కార్ సీసీ footages బయటపెట్టాలి .ఈ కుంభకోణంలో అత్యంత
కీలకమైన ఆధారం ఈ కార్ !
5.ఏ ఆధారాలు లేకుండా ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని నాడు బర్త్ రఫ్ చేసినపుడు; నేడు మియాపూర్ ల్యాండ్ స్కాంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రికి సంబంధాలు
ఉన్నాయని పత్రికలు పుంఖానుపుంఖాలుగా ఆధారాలతో వాస్తవాలు రాస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
6.ఈ రాష్ట్రము లో అన్ని రాజకీయ పార్టీలు ఈ కుంభకోణానికి సంబంధించి నిర్దిష్టంగా వారి వారి కార్యాచరణను, అభిప్రాయాలను చెప్పాలి.
7.అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలి.జెండాలను ఏజెండాలను పక్కనపెట్టి ఒక ఐక్య కార్యాచరణ రూపొందించి అసలు దోషులను పట్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకి అందరికీ ఉంది. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి సంపాదించుకోవాల్సిన బాధ్యత అందరిదీ.
ఈ భూమి, ఈ ప్రభుత్వం అన్నీ మన కోసం. మన రాష్ట్రం కోసం, అన్నింటా, ప్రజల జాగారుకత మరియు భాగస్వామ్యం ఎంతో అవసరం!


All the songs from the divine trance 

మన మనస్సు సంసారంలో కూర్చుంది. ఈ మనస్సు ఇక్కడి నుండి మకాం మార్చి భగవంతుని సమీపంలో కూర్చోబెట్టాలి.
శిశువు గర్భంలో వున్నప్పుడు వాని చుట్టు తల్లి శరీరమే వుంటుంది. బయటకు వచ్చిన తరువాత ఆమె పాలు త్రాగి పెరుగుతుంది. ఆ తల్లి పాలను వేడి చేయనక్కరలేదు, పంచదార కలపనక్కరలేదు.
ఆ తరువాత ఆట బొమ్మలకు మరిగి తల్లికి దూరమవుతాడు. ఆకలి కాగానే ఆట బొమ్మలను ఆవలికి నెట్టి తల్లి చంకనెక్కుతాడు. ఇప్పుడు ఆ తల్లి పాలే కావాలి. ఆట బొమ్మలతో ఆకలి తీరదు.
అలాగే మన స్థితికి, గతికి ఆధారమైన పరమాత్మను మరిచి, మనం ప్రాపంచిక వస్తువులపై మోహం పెంచుకుంటాం. భార్య అని, భర్త అని, బిడ్డలని, ఇల్లూ వాకిళ్ళని, ధనమని, సొమ్ములని,
ఈ ఆట బొమ్మలని చూసి మురిసిపోతాం. కాని ఇవన్ని తోలు బొమ్మలు. ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేవి, దుఃఖాన్నిచ్చేవి. వీటితో నిత్య సుఖం లేదు. నిరతి శయానందం లేదు. కష్టం వచ్చినప్పుడు గాని
" నీవే తప్ప నితః పరంబెరుగ " నని భగవంతున్ని ఆశ్రయించం. కనుక ఇలా కష్టం వచ్చినప్పుడు గాక నిత్యము భగవంతుడిని ఉపాసించాలి. ఈ బంధాలున్నా నిరంతరం భగవంతుని యందే మనస్సును ఉంచాలి. నిత్య స్మరణ చేయాలి.
విషయాధీనమైన మనస్సు భగవదాధీనం కావటమే ఉపాసన.
అట్టి భక్తుడే శ్రేష్టుడని తీర్మానం.
💡
💐ఆదివారం చేయకుడని పనులు💐

 *ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు*..సృష్టికి ఆద్యం ఆదివారం. దీనికి తోడు సూర్యుణ్ణి ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తుతం మనం ఏవిషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రారంభమవుతుంది చివరకు సూర్యునితోనే అంతమవుతుంది.
 *సైన్స్ ప్రకారం చూసినా*కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి. అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతీ ప్రాణీ ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది సుస్పష్టం. వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా ఇంత తప్పులేదు కానీ...ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం తినకండి.
 ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తి హీనులవుతారని...మన వేదాల్లో ఉంది. ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి. ఆరోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి. అందుకే *ఆదివారం* రోజున మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలు అవడం ఖాయం. దానికి తోడు ఆ సూర్యభగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు.
 మన దేశానికి బ్రిటీష్ వారు వచ్చినపుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తికి...సంపూర్ణ ఆరోగ్యానికి అబ్బురపడ్డారు. ఎందుకు భారతీయులు ఉత్తేజంగా...ఉల్లాసంగా..సిరిసంపదలతో తులతూగుతున్నారో అన్వేషించారు. చివరకు *ఆదివారం* నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు కారణమని తెలుసుకున్నారు.
 భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరని అనుమానం ఇంగ్లీషువాళ్లల్లో కలిగింది. ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు. దీంతో *ఆదివారం* రోజుని సెలవుదినంగా ప్రకటించడంతో పాటు ఆరోజున మద్యం మాంసంతో పాటు నియమాలు పాటించకుండా మానేసేలా చేశారు.
 ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషువారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా వారు ప్రకటించారు. కానీ తాము మాత్రం *ఆదివారం* నాడు ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆరాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోజున కచ్చితంగా తమ ప్రార్ధనాస్ధలాలకి రావాలనే నియమాన్ని పెట్టు కున్నారు.
 ఇలా మన ఆచారానికి మత రంగు అద్దుకుని *ఆదివారం*నాటి శక్తిని క్రిష్టియన్స్ పొందుతున్నారు. కానీ నాటి నుంచి మనం మాత్రం ఆదివారం 'మందు ముక్క' అంటూ తమ తరతరాల ఆచారాన్ని పక్కదోవ పట్టించుకున్నాము.
 కాబట్టి ఇప్పటికన్నా *ఆదివారం*నాటి శక్తిని మనం గుర్తించాలి. ఆదివారం రోజున మన చేతనైన నియమాలు పాటించాలి,