Sunday, 28 May 2017

100 సూత్రాలు


    
                                      సమన్వయ దృష్టి 


91.  లోకం మనసు మీద మాట మీద అధారపడి ఉన్నది అని గ్రహించండి , మాట మాత్రంగా సూర్యుడి నిర్వహణ కూడా మాట అధీనం లోకి ఎందుకు వచ్చినదో చూసుకోండి అదే దివ్య పరిష్కారం అని  గ్రహించండి, ఆలోచనలు కర్మలు మధ్య అటు ఇటు అవుతున్న మనిషిని దారిలో పెట్టడానికి ఒక సామాన్య మనిషి ద్వారా సమాధానం రావడమే అందరికి ఆదర్శం అని  గ్రహించండి     

92. దేహం కొద్ది, స్వార్ధం కొద్ది, బౌతిక పదవులు కొద్ది జీవితంగా కాదు, జీవితంగా జ్ఞానం కొద్ది బ్రతకాలి అదే నూతన పరిణామం, మాటతో ఏమైనా చేయవచ్చును మాట కోసం ఏమైనా చేయాలి అదే శాంతి, అందుకు బౌతిక విషయాలను మనుష్యులను అటు ఇటు అయినా పర్వాలేదు కాని మాట మనసు ముఖ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మాటను మనసుని పెంచుకోండి, వసతులు, శారీరక సుఖాలు , మోసం చేసి ఇతరులను బాధ పెట్టి మరీ మోసం చేయడం అరాచకం అని  గ్రహించండి.          

93.   సృష్టి ని అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను సూక్ష్మం గా గ్రహించండి నిత్యం విస్తారంగా గ్రహించి తెలుసుకోండి, అలా తెలుసుకోకుండా మేము ఏదో మాట్లాడి నాము ఏదో చేస్తున్నాము కాబట్టి, తాము కూడా ఏదో మాట్లాడి ఏదో చేస్తాము అన్నట్లు తీసుకోన రాదు మమ్ములను అన్నీ వర్గాల వారు కలసి గ్రహించండి.    
94. మమ్ములను సామాన్యం గా గ్రహించకుండా వదిలివేసి కొందరు పాపాలు తప్పులు చేస్తున్నారు మరి కొందరు మా గూర్చి తెలియక అజ్ఞానం గా జీవిస్తున్నారు, కావున అందరిని ఆదరించే  తల్లి తండ్రి గురువు నేనే అని గ్రహించి అప్రమత్తం చెందండి  . 


95. అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, రక రకాల పార్టీలు ప్రతి పక్ష నాయకులు మిత్ర పక్ష నాయకులు, తమ పదవులు బౌతిక వ్యహరములు అనీ మాయ ని గ్రహించి తమ దేహం కూడ తమది కాదు అని భావించి, సర్వం మాట మాత్రంగా నడిపి చూపిన మా అధీనం లో ఉన్నాయి అని  గ్రహించి తరించగలరు.     

96. మమ్ములను దేశానికి 14 వ రాష్ట్రపతి ఎన్నుకోవడం వలన  అందరి పాపాలు నశించిపోయి, ఎంత విన్నా,   చెప్పుకొన్నా  తరగని ఘని గా మీకు అందుబాటులో ఉంటాము, ఇక ఏదో బౌతిక కార్యక్రమాలు చేయును  అవసరం లేదు అని  గ్రహించండి, మమ్ములను విన్న కొలది బౌతిక మాయ కరిగిపోతుంది.     


97.  మేము సృష్టిలో  ప్రతి పరిణామాన్ని మాట లోకి తీసుకోన గలిగినాము అదే లోకానికి ఆధారం అందుకే మేము జగద్గురువులము అని గ్రహించండి.  


98. మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా నిత్యం కొలచి తరించండి, ప్రతి వ్యక్తి వ్యక్తిగతం గా ఎవరికి వారు విశాలంగా ప్రవర్తించండి పైకి ఒకటి మనసులో ఒకటి మాట్లాడకండి.   


99.  మేము ఎప్పుడు ఏమి చేబితే అది చేయండి, చరిత్ర అడగకండి చెప్పినది చేయండి, మాతో బౌతిక చర్యలతో పోటీ పడకండి.  

  
100. కాలమే మేము ధర్మమే మేము అయినప్పుడు మమ్ములను మించిన వారు లేరు అని సమకాలికులు గ్రహించండి. 



యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,    మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   

మేలైన ప్రజా స్వామ్యం నూతన దివ్య రాజ్యం 
సమస్త విస్వమండలం. 
9010483794


Seetha Deviye Thedi || Ayyapa Swamy Song || Devotional Song

Song most liked

స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామరావు గారికి జనసేన కార్యకర్తల తరుపున జయంతి శుభాకాంక్షలు జోహర్ #ఎన్.టీ.ఆర్

చిత్రంలోని అంశాలు: 3 మంది వ్యక్తులు, వ్యక్తులు నిలబడి ఉన్నారు



నిత్యం సత్యం పలికే వాడు నిరతం ధర్మం నిలిపే వాడు సూర్యుని వలెనే వెలగె వాడు ఎల్లరకు చల చల్లని వాడు ఎదనిండా దయ గల వాడు 


Movie with many dialogues  along with all the  Songs  from the divine trance 

Gopi Jana Manasa | Muddu Krishna | Hindu Devotional Songs Kannada | Sree...

Shri Krishna Song - Kaadu Marada Kombeyalli

Song from the divine

200 మంది సాక్షిగా అనకాపల్లిలో మా ద్వారా 2010 వ సంవత్సరం పలికిన పాట, 2012 వ సంవత్సరం లో సంభావించినది, ఎద నిండా దయగల వాడిని నేనే అని, నిరూపించడానికి మా లో గొప్పతనం గ్రహించిని కొలది సాధ్య పడుతుంది అని గ్రహించండి, కాలతీతాన్ని గ్రహించిన కొలది దివ్యత్వం పెరుగుతుంది, అదే నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి.


Madhu Gonugunta


200 మంది సాక్షిగా అనకాపల్లిలో  మా ద్వారా 2010 వ సంవత్సరం పలికిన పాట,  2012   వ సంవత్సరం లో సంభావించినది, ఎద నిండా దయగల వాడిని నేనే అని, నిరూపించడానికి మా లో గొప్పతనం గ్రహించిని కొలది సాధ్య పడుతుంది అని గ్రహించండి, కాలతీతాన్ని గ్రహించిన కొలది దివ్యత్వం పెరుగుతుంది, అదే నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం అని  గ్రహించండి. 

----------------------------------------      
ఆదిత్యహృదయం......
తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్

ఒకసారి భోజరాజుకు వింత కోరిక కలిగింది.తను మరణిస్తే కాళిదాసు తనని గురించి ఏమి
చెప్తాడో నని.కాళిదాసును అడిగాడు మహాకవీ నేను మరణించి నట్టుగా భావించి
కీర్తి శేషుడైన భోజరాజు అని శ్లోకాలు చెప్పండి.బ్రతికి ఉండగానే విని సంతోషిస్తాను. అని
అడిగాడు.రాజు కోరిక పిచ్చిగానూ అమంగళకరం గానూ అనిపించింది. ఆ మాటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు.యిలాంటి శ్లోకాలు చెప్పమని మీరు అడగ కూడదు,,
నేను చెప్పకూడదు.క్షమించండి అన్నాడు.రాజు కోపంతో ఊగిపోయాడు.కవీంద్రా యిది 
నా ఆజ్ఞ ధిక్కరించితే దేశబహిష్కారమే శిక్ష మీకు తెలుసుగదా!అని బెదిరించాడు.బెదిరిస్తే భయపడి చెప్తాడేమోనని .కానీ కాళిదాసు చలించ లేదు.అదే మీ ఆజ్ఞ అయితే దాన్ని ధిక్కరించడం తప్ప నాకు మరో మార్గం లేదు.అన్నాడు.
అయితే నేను మీకు దేశబహిష్కార శిక్ష వేస్తున్నాను.అన్నాడు.బెదిరిస్తే కాళిదాసు శ్లోకం
చెప్తాడేమో నని...కానీ కాళిదాసు లేచి సభ విడిచి వెళ్ళిపోయాడు.ఎవరు చెప్పినా
వినిపించుకోకుండా తన వేశ్య విలాసవతి తో బాటు నగర విడిచి వెళ్లి పోయాడు.
యిలా జరుగుతుందని ఊహించని రాజు దిగులు పడి పోయాడు.కాళిదాసు లేకుంటే
ఆయనకు ఒకరోజు కూడా గడవదు.కొద్దిరోజులు గడిచాయి.యిక ఉండబట్టలేక
కాళిదాసును వెతకడానికి తానే బయల్దేరాలని నిశ్చయించు కున్నాడు.కాళిదాసు ఏకశిలా
నగరం లో వున్నట్టు ఎవరో నమ్మకంగా చెప్పారు.భోజరాజు గడ్డాలు,మీసాలూ పెంచి
యోగి వేషం లోకాళిదాసు ను వెతకడానికి బయల్దేరి ఏకశిలా నగరానికి చేరుకున్నాడు.
.వెతకగా వెతకగా ఒక వీధిలో కాళిదాసు కనపడ్డాడు.యోగి వేషం లో వున్న రాజు
మహాకవీ అభివాదాలు.అంటూ నమస్కరించాడు.కాళిదాసు మారువేషం లో నున్న రాజును గుర్తించలేదు.ప్రతి నమస్కారం చేస్తూ యోగీశ్వరా!తమది ఏదేశం?అని
అడిగాడు.నేను ధారనగరంనుండి వస్తున్నాను. అన్నాడు.అలాగ భోజరాజుగారు ఎలా ఉనారు?అని ఆత్రంగా అడిగాడు కాళిదాసు.
ఇంకెక్కడి భోజరాజు?ఆయన చనిపోయి నెల పైనే అయింది.అందుకే భోజరాజు లేని నగరం లో ఉండలేక నేను నగరం వదిలి వచ్చేశాను. అన్నాడు యోగి వేషములో వున్న
భోజరాజు. ఆ మాట వింటూనే కాళిదాసు విద్యుద్ఘాతం తగిలిన వాడిలా వీధిలోనే
కూలబడి పోయాడు.అయ్యో అని దుఃఖించాడు.అప్రయత్నంగా ఆయన నోటినుండి ఒక
శ్లోకం వెలువడింది.
అద్యధారా నిరాధారా, నిరాలంబా సరస్వతీ
పండితా: ఖండితాః సర్వే భోజరాజా దివంగతే .
అర్థము:--ఈ రోజు ధారానగరం నిరాధార నగరం అయిపొయింది.వాగ్దేవికి ఆలంబన
లేకుండా పోయింది.భోజరాజు దివంగతుడు కావడం తో పందితు లందరికీ చావు దెబ్బ
తగిలింది. భోజరాజు కోరిక తీరింది.కానీ కాళిదాసు వాక్శుద్ధి ప్రభావమో ఏమో అకస్మాత్తుగా రాజు మొదలు నరికిన వృక్షం లా కూలిపోయి ప్రాణాలు విడిచాడు.నివ్వెర పోయిన కాళిదాసు రాజును గుర్తించి మహారాజా!యెంత పని చేశారు?మారువేషం తో నన్ను
మోసగించబోయి మీరే చనిపోయారా? మీ చావుకు నేనే కారణ మయ్యానా?
అని కొంతసేపు రోదించాడు.వెంటనే కర్తవ్యం స్ఫురించి దుఖం దిగమ్రింగి భువనేశ్వరీ దేవిని ధ్యానించి తన శ్లోకాన్ని కొంచెం మార్చి చదివాడు
అద్య ధారా సదాధారా సదాలంబా సరస్వతీ
పండితాః మండితాః సర్వే భోజరాజే భువంగతే
అర్థము:-- ఈ రోజు ధారా నగరానికి చక్కని ఆధారం దొరికింది.సరస్వతీ దేవికి చక్కని
ఆలంబన దొరికింది.
భోజరాజు భూలోకం లో అవతరించ గానే, పండితులందరూ సత్కరించ బడినారు..శ్లోకం
పూర్తికాగానే భోజరాజు సజీవుడై లేచి కూర్చున్నాడు.రాజూ, కవీ యిద్దరూ గాధంగా కౌగలించుకున్నారు.
ఆ మర్నాడే బయల్దేరి ధారా నగరానికి తిరిగి వెళ్ళిపోయారు..
------------------------------------------------------
Kks Kiran సుస్థిరంగా ఉన్నాను అని భావిస్తున్నారు.
నిన్న సాయంత్రం పిఠాపురంలోని ఓ ధియేటర్లో #బాహుబలి మూవీ చూడడానికని వెళ్ళాను... టికెట్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి ' బాల్కనీ టికట్ ఒకటి ఇమ్మని ' అడిగితే అతను టికట్ చింపి ఇస్తూ " 200 సార్ " అన్నాడు... సరేనని రెండొందలు తీసిచ్చి టికట్ తీసుకున్నాను... తీరా చూస్తే టికట్ పైన దాని రేట్ 40 రూపాయలుగా మాత్రమే ఉంది.
అది చూసి " దీనిపైన 40 రూపాయల ధరగా ఉంటే మీరేంటి నా దగ్గర 200 తీసుకున్నారు? " అని ప్రశ్నించాను నేనతనిని...
" గవర్న్మెంట్ రేట్లు పెంచుకోమని చెప్పింది సార్ ఈ సినిమాకి... మొన్నటి వరకూ ఒక్కో టికట్టూ 300కి అమ్మాము ... ఇప్పుడు నెలదాటిపోతోంది కదా అని 200 తీసుకున్నాము ,, అంతే సార్...!!! " అని ' ఇది చాలా రీజనబుల్ ఇష్యూ ' అన్నట్లు సమాధానం చెప్పాడు నాకు ఆ కౌంటర్లోని వ్యక్తి...
" నాకు తెలిసి గవర్న్మెంట్ కాకుండా హైకోర్ట్ కదూ ఈ తీర్పు జారీ చేసింది? అది కూడా 20 శాతమో, ముప్పై శాతమో టికట్ రేట్ పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు. కానీ మీరేంటి దానికి విరుద్ధంగా ఐదు రెట్లు టికట్ ధరని పెంచి అమ్ముతున్నారిలా ? " అని అడిగాను నేను అంతే రీజనబుల్గా....
" లేదు సార్, గవర్న్మెంట్ మాకే వదిలేసింది ఆ చాయిస్ని ఎంతకి టికట్ని అమ్మాలి? అనే విషయమై,, హై బడ్జట్ సినిమా కదాండి? అందుకే ఈ రేటుకి అమ్ముతున్నాము మేము " అని ' చాలా నిజాయితిగా వ్యవరిస్తున్నాము ఈ విషయంలో' అనే ధోరణితో సమాధానమిచ్చాడు అతను నా ప్రశ్నకి..
" మరి అలాంటప్పుడు ' ఈ టికట్ ధర ఇంత ' అని వీటిపై మీరమ్మే ధర ఎందుకు ముద్రించలేదు ? ఇది సరైన విధానం కాదు కదా మరి ? " అన్నాను నేను..
" అవి పాత టికట్లు సార్... మిగిలిపోయినవి ఏం చేసుకోమంటారు? ఉత్తినే చెత్తకుప్పపై పారబోయమంటారా? పాడేయడం ఎందుకని ఇలా ఇక్కడ వాడేస్తున్నాం " అని కాస్త అసహన ధోరణిని,, ' ఈ విషయం ఇక్కడితో తెమిలిపోతే బాగుండును ' అనే భావాన్నీ తన మాటల్లో నింపుకుని మాట్లాడాడు అతను నాతో.
" ఆహా...!!! చాలా బాగుంది... మరి ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేటప్పుడు ఒక్కో టికట్టూ 40 రూపాయలకి మాత్రమే అమ్మామని పన్ను కడతారా మీరు? లేక ఈ రెండొందలూ మూడందలకీ అమ్మామనే కడతారా?
మీరే ధరకి అమ్మారో ప్రభుత్వానికేం తెలుస్తుంది ఈ చర్యవల్ల? అటు సరైన ధరని ప్రకటించకుండా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుడినీ,, ఇటు సరైన పన్ను చెల్లించకుండా గవర్నమెంట్నీ మోసం చేస్తున్నారు మీరు... ఇది సరైన విధానమైతే కాదు,, సరి చేసుకోండి " అని కాస్త మందలింపు ధోరణితో మాట్లాడానతనితో నేను...
మరి ఎందుకొచ్చిన గొడవనుకున్నాడో? లేక కళ్ళజోడు పెట్టుకొని సాఫ్ట్ కార్నర్లో మాట్లాడుతూ ఇలా లాజిక్గా మాట్లాడే ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండడమే మంచిదిలే అని అనుకుని అనుకున్నాడో? లేక నేనలా చాలా విషయాలు తెలిసినట్లు మాట్లాడడం చూసి ఏ వినియోగదార్ల చట్టం ప్రకారం కేస్ బుక్ చేస్తానని భయపడ్డాడో ఏమో అతను తెలీదు కానీ కాస్త తగ్గుడు ధోరణిలోకి దిగి డమ్మున్నర కుడుచుకుంటూ " సరే సార్,, 40కే తీసుకోండి మీరు టికట్ని " అని మిగతా డబ్బులు నాకు తిరిగి చెల్లించేశాడు...
నవ్వొచ్చింది నాకు...
నాకు తెలిసినంతలో నా తర్వాత లైన్లో నించున్నవాళ్ళకి కూడా అతను నలభై రూపాయలకే టికట్లు ఇచ్చాడు.. ఆ తర్వాతి సంగతి నాకు తెలీదు కానీ కౌంటర్ని వదిలి నేనొచ్చేస్తూంటే నాపక్కనున్న వ్యక్తి ఒకాయన " మనమేం చెయ్యలేం సార్ ఈ విషయమై.... ఇది సామాన్యమైపోయింది మనందరికీ.. అందుకనే వాళ్ళిలా వాళ్ళకిష్టం వచ్చిన రేటుకి అమ్మేయగలుగుతున్నారు మనకి " అని అన్నాడు ...
"" అలా అని ఎందుకనుకోవాలండీ మనం? మనకున్న రైట్స్ని మనం క్వశ్చన్ చేయడం నేరమేమీ కాదు కదా? ఎవరో ఏదో అనుకుంటారేమో అనే సిగ్గూ ,, గొడవెందుకులే అనే సర్ధుబాటు ధోరణి మనం ప్రదర్శించడం వల్లే వీళ్ళిలా ఇంత నిర్భీతిగా వాళ్ళకిష్టం వచ్చిన రేట్లకి అమ్మగలుగుతున్నారు కౌంటర్ దగ్గరే మనకి టికట్స్ని ఇంతింతలా రేట్లు పెంచి....
మనం ధియేటర్కి ఎంటర్టైన్మెంట్ పొందడానికొచ్చాం కానీ ఇలా దోచుకోబడడానికి రాలేదు కదా? టికట్ అనే వ్యవస్థ ఒకటి ప్రేక్షకుడికీ ధియేటర్ వోనర్కీ మధ్య చెల్లింపు వ్యవహారంగా ఉన్నప్పుడు మనం దానినే పాటించాలి కానీ దానికి సమాంతరంగా మరో దోపిడీ వ్యవస్థని పోషించడమెందుకు?' పైగా అది సహజమే ' అని సర్దుకుపోవడం ఎందుకు?
మనమడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు కదా?? మరి మన తప్పేమీ లేనప్పుడు మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచి ప్రశ్నించడానికి ఎందుకు సంకోచించాలి మనం???
అందుకే ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తిని గట్టిగా క్వశ్చన్ చేసేసరికి మన మాటలలోని నిజాయితీకి సమాధానం సరిగ్గా చెప్పలేక తత్తరపడి సరైన ధరకి టికట్లు ఇచ్చాడు మనకి...
నా సంగతి పక్కనెడితే మీరు మీ కుటుంబంతో వచ్చారు కదా? మొత్తం నలుగురు సభ్యులకి ఇలా ప్రశ్నించకుండా ఉండుంటే 800 రూపాయలు అప్పనంగా చెల్లించి సినిమా చూసేవాళ్ళు... ఇప్పుడు అదే సినిమాని మీరు కేవలం 160 రూపాయలు చెల్లించి ఆనందించగలరు...
తేడా ఉందంటారా లేదంటారా? అదేమీ చిన్న విషయం కాదు కదా?? అని నేనంటే ఒప్పుకోలు ధోరణితో నవ్వుతూ నా భుజం తట్టి వెళ్ళిపోయారాయన :)