Saturday, 9 September 2017

ప్రతివ్యక్తి రాముని వలె బ్రతకాలి అందరికీ రాముడే ఆదర్శం
చెరువును కాపాడిన రాముడు
చెన్నై నగరం నుండి దక్షిణం వైపు ప్రయణం చేస్తున్నప్పుడు నగర పొలిమేరలు దాటగానే మధురాంతకం అనే గ్రామం వస్తుంది. కాంచీపురం జిల్లాలోని మధురాంతకం ఇప్పుడు మునిసిపాలిటీ స్థాయికి చేరుకొన్నది. తమిళనాడులో రెండవ అతిపేద్ద మానవనిర్మిత చెరువుకు మధురాంతకం స్థావరంగా పేరుపొందింది. గ్రామానికి అంటుకొని ఈ పెద్ద చెరువు ఉన్నది.
ఈ చెరువు కట్ట బీటలువారు పగిలే సమయంలో శ్రీరాముడు అడ్డుకొన్నట్లు ఐతిహ్యం.. చెరువు, ఏరు, కొలను గా పిలువబడుతున్న ఈ తటాకం ప్రక్కన 1600 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన రామాలయం ఉన్నది. చోళరాజు ఉత్తమచోళుడు ఈ చెరువును నిర్మించాడు.
అతనిని మధురాంతకుడని పిలిచేవారు. దీనితో ఆ ఊరికి మధురాంతకం అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి దేవుడు ఏరి కాత్త రామన్ (ఏటిని / చెరువును కాపాడిన రాముడు) పేరుతో వెలిశాడు
1798 లో బ్రిటిష్ పాలనలో చెంగల్పట్టు కలెక్టర్ గా ఉన్న కల్నల్ లయొనెల్ బ్లేజ్ చెరువుకు రెండు పెద్ద గండ్లు పడటం చూశాడు. అప్పుడు రామాలయంలో భారీ మోతాదులో గ్రానైట్ తదితర రకాల రాళ్లు గుట్టలుగా వేసి ఉండటాన్ని అతడు చూశాడు.
ఈ రాళ్లతో గ్ండ్లను పూడ్చివేయాలని కలెక్టర్ క్రింది ఉద్యోగులను ఆదేశించాడు. అయితే ఆలయ అర్చకులు దానికి అడ్డుచెప్పి అవి జానకీమాత ఆలయ నిర్మాణానికి ప్రోగుచేసిన రాళ్లని విన్నవించారు. నిధుల కొరత కారణంగా ఆలయ నిర్మాణం ప్రారంభం కాలేదను తెలియజేశారు.
చెరువు గండి మరమ్మతు కంటే ఆలయ నిర్మాణం ప్రాధాన్యత పొందదని, రాముడు ఈ చెరువును ఎందుకు మరమ్మతు చేయించలేదని కలెక్టర్ అర్చకులను ప్రశ్నించాడు. చిత్తశుద్దితో ప్రార్థిస్తే రాముడు అనుగ్రహిస్తడని వారు దొరకు తెలియజేశారు.
మరుసటి రోజున పరిస్థితి విషమించింది. భారీ వర్షాలతో చెరువు నిండి కట్ట తెగిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ సందర్భంలో ఆంగ్లదొర రాత్రి చెరువు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని పరిస్థితిని సమీక్షించసాగాడు. అతనికి ఇద్దరు యోధులు విల్లు అంబులతో చెరువును పరిరక్షిస్తున్న దృశ్యాన్ని చూశాడు. వారు ఆలయంలోని విగ్రహాలను పోలి ఉండటాన్ని గమనించాడు. అతడు వినమ్రతతో సాగిలపడ్డాడు. అయితే సిబ్బంది ఎవరూ ఈ దృశ్యాన్ని చూడలేదు. తరువాత కొద్దిసేపటికి వర్షం తగ్గిపోయింది. కలెక్టర్ జానకీమాత ఆలయనిర్మాణం దగ్గర ఉండి చేయించినట్లు ప్రతీతి. ఆలయ శాసనాలలొ కలెక్టర్ వింత అనుభవం నేటికీ పొందుపరచబడి ఉన్నది. ఏరి కాత్త రామన్ ఆలయంలో రామానుజాచార్యుల, లక్ష్మీనరసింహ, ఆంజనేయ విగ్రహాలు కూడా ఉన్నాయి.
LikeShow more reactions
Comment
Comments

నేనున్నాను పూర్తి సినిమా | నాగార్జున, ఆర్తి అగర్వాల్, శ్రియ | శ్రీ బాలాజ...

Gangotri Telugu Full Movie || Allu Arjun, Aaditi Agrawal || K Raghavendr...

Jayam ( జయం సినిమా ) Telugu Full length Movie || Nitin, Sada

Nuvvostanante Nenoddantana Full Movie | Latest Telugu Full Movies | Sidd...

అరుంధతి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా - అనుష్క | సోనుసూద్ | కోడి రామకృష్ణ

Sampoorna Ramayanam Full Length Telugu Moive || DVD Rip

Sri Anjaneya Charitra | Full Length Telugu Movie | Arja Janardhana rao

Sri Madvirat Veerabrahmendra Swamy Charitra Telugu Full Length Movie || ...

Sri Madvirat Veerabrahmendra Swamy Charitra Telugu Full Length Movie || ...

Sri Satyanarayana Swamy Full Movie | Suman, Krishna, Ravali, Pinky Sarka...

Shiridi Sai Telugu Full Movie | Nagarjuna | K Raghavendra Rao | HD World...

Sri Ramadasu Telugu Full Movie | Akkineni Nagarjuna, Sneha | Aditya Movies

Bhakta Ramadasu Telugu Full Movie | Nagaiah | NTR | ANR | Sivaji Ganesan...

Bhakta Potana Telugu Full Movie || Chittor V Nagaiah, Hemalatha || Kadri...

Image may contain: 1 person, standing and text
No automatic alt text available.

Song from the divine intervention

Image may contain: text
No automatic alt text available.

ప్రథమోఽధ్యాయః – అర్జునవిషాదయోగః

ధృతరాష్ట్ర ఉవాచ – ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ || ౧ || సంజయ ఉవాచ – దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ || ౨ || పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా || ౩ || అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః || ౪ || ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ | పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః || ౫ || యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || ౬ || అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ | నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే || ౭ || భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః | అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ || ౮ || అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః | నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః || ౯ || అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ | పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ || ౧౦ || అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః | భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి || ౧౧ || తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః | సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ || ౧౨ || తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ || ౧౩ || తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ | మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః || ౧౪ || పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః | పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || ౧౫ || అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః | నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ || ౧౬ || కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః | ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః || ౧౭ || ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్దధ్ముః పృథక్పృథక్ || ౧౮ || స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ | నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ || ౧౯ || అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః | ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాండవః | హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే || ౨౦ || అర్జున ఉవాచ – సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత | యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ || ౨౧ || కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే || ౨౨ || యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః | ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః || ౨౩ || సంజయ ఉవాచ – ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత | సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ || ౨౪ || భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ | ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి || ౨౫ || తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ | ఆచార్యాన్మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా | శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి || ౨౬ || తాన్సమీక్ష్య స కౌంతేయః సర్వాన్బంధూనవస్థితాన్ | కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ || ౨౭ || అర్జున ఉవాచ – దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ | సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి || ౨౮ || వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే | గాండీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే || ౨౯ || న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః | నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ || ౩౦ || న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే | న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ || ౩౧ || కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా | యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ || ౩౨ || త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ | ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః || ౩౩ || మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా | ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన || ౩౪ || అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే | నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన || ౩౫ || పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః | తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ | స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ || ౩౬ || యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః | కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ || ౩౭ || కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ | కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన || ౩౮ || కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః | ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత || ౩౯ || అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః | స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః || ౪౦ || సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ | పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః || ౪౧ || దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః | ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః || ౪౨ || ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన | నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ || ౪౩ || అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ | యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః || ౪౪ || యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః | ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ || ౪౫ || సంజయ ఉవాచ – ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ | విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః || ౪౭ || ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అర్జునవిషాదయోగో నామ ప్రథమోఽధ్యాయః || ౧ ||