Saturday, 9 September 2017

ప్రతివ్యక్తి రాముని వలె బ్రతకాలి అందరికీ రాముడే ఆదర్శం
చెరువును కాపాడిన రాముడు
చెన్నై నగరం నుండి దక్షిణం వైపు ప్రయణం చేస్తున్నప్పుడు నగర పొలిమేరలు దాటగానే మధురాంతకం అనే గ్రామం వస్తుంది. కాంచీపురం జిల్లాలోని మధురాంతకం ఇప్పుడు మునిసిపాలిటీ స్థాయికి చేరుకొన్నది. తమిళనాడులో రెండవ అతిపేద్ద మానవనిర్మిత చెరువుకు మధురాంతకం స్థావరంగా పేరుపొందింది. గ్రామానికి అంటుకొని ఈ పెద్ద చెరువు ఉన్నది.
ఈ చెరువు కట్ట బీటలువారు పగిలే సమయంలో శ్రీరాముడు అడ్డుకొన్నట్లు ఐతిహ్యం.. చెరువు, ఏరు, కొలను గా పిలువబడుతున్న ఈ తటాకం ప్రక్కన 1600 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన రామాలయం ఉన్నది. చోళరాజు ఉత్తమచోళుడు ఈ చెరువును నిర్మించాడు.
అతనిని మధురాంతకుడని పిలిచేవారు. దీనితో ఆ ఊరికి మధురాంతకం అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి దేవుడు ఏరి కాత్త రామన్ (ఏటిని / చెరువును కాపాడిన రాముడు) పేరుతో వెలిశాడు
1798 లో బ్రిటిష్ పాలనలో చెంగల్పట్టు కలెక్టర్ గా ఉన్న కల్నల్ లయొనెల్ బ్లేజ్ చెరువుకు రెండు పెద్ద గండ్లు పడటం చూశాడు. అప్పుడు రామాలయంలో భారీ మోతాదులో గ్రానైట్ తదితర రకాల రాళ్లు గుట్టలుగా వేసి ఉండటాన్ని అతడు చూశాడు.
ఈ రాళ్లతో గ్ండ్లను పూడ్చివేయాలని కలెక్టర్ క్రింది ఉద్యోగులను ఆదేశించాడు. అయితే ఆలయ అర్చకులు దానికి అడ్డుచెప్పి అవి జానకీమాత ఆలయ నిర్మాణానికి ప్రోగుచేసిన రాళ్లని విన్నవించారు. నిధుల కొరత కారణంగా ఆలయ నిర్మాణం ప్రారంభం కాలేదను తెలియజేశారు.
చెరువు గండి మరమ్మతు కంటే ఆలయ నిర్మాణం ప్రాధాన్యత పొందదని, రాముడు ఈ చెరువును ఎందుకు మరమ్మతు చేయించలేదని కలెక్టర్ అర్చకులను ప్రశ్నించాడు. చిత్తశుద్దితో ప్రార్థిస్తే రాముడు అనుగ్రహిస్తడని వారు దొరకు తెలియజేశారు.
మరుసటి రోజున పరిస్థితి విషమించింది. భారీ వర్షాలతో చెరువు నిండి కట్ట తెగిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ సందర్భంలో ఆంగ్లదొర రాత్రి చెరువు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని పరిస్థితిని సమీక్షించసాగాడు. అతనికి ఇద్దరు యోధులు విల్లు అంబులతో చెరువును పరిరక్షిస్తున్న దృశ్యాన్ని చూశాడు. వారు ఆలయంలోని విగ్రహాలను పోలి ఉండటాన్ని గమనించాడు. అతడు వినమ్రతతో సాగిలపడ్డాడు. అయితే సిబ్బంది ఎవరూ ఈ దృశ్యాన్ని చూడలేదు. తరువాత కొద్దిసేపటికి వర్షం తగ్గిపోయింది. కలెక్టర్ జానకీమాత ఆలయనిర్మాణం దగ్గర ఉండి చేయించినట్లు ప్రతీతి. ఆలయ శాసనాలలొ కలెక్టర్ వింత అనుభవం నేటికీ పొందుపరచబడి ఉన్నది. ఏరి కాత్త రామన్ ఆలయంలో రామానుజాచార్యుల, లక్ష్మీనరసింహ, ఆంజనేయ విగ్రహాలు కూడా ఉన్నాయి.
LikeShow more reactions
Comment
Comments

No comments: