Monday, 5 June 2017


All the songs from the divine trance 

మన మనస్సు సంసారంలో కూర్చుంది. ఈ మనస్సు ఇక్కడి నుండి మకాం మార్చి భగవంతుని సమీపంలో కూర్చోబెట్టాలి.
శిశువు గర్భంలో వున్నప్పుడు వాని చుట్టు తల్లి శరీరమే వుంటుంది. బయటకు వచ్చిన తరువాత ఆమె పాలు త్రాగి పెరుగుతుంది. ఆ తల్లి పాలను వేడి చేయనక్కరలేదు, పంచదార కలపనక్కరలేదు.
ఆ తరువాత ఆట బొమ్మలకు మరిగి తల్లికి దూరమవుతాడు. ఆకలి కాగానే ఆట బొమ్మలను ఆవలికి నెట్టి తల్లి చంకనెక్కుతాడు. ఇప్పుడు ఆ తల్లి పాలే కావాలి. ఆట బొమ్మలతో ఆకలి తీరదు.
అలాగే మన స్థితికి, గతికి ఆధారమైన పరమాత్మను మరిచి, మనం ప్రాపంచిక వస్తువులపై మోహం పెంచుకుంటాం. భార్య అని, భర్త అని, బిడ్డలని, ఇల్లూ వాకిళ్ళని, ధనమని, సొమ్ములని,
ఈ ఆట బొమ్మలని చూసి మురిసిపోతాం. కాని ఇవన్ని తోలు బొమ్మలు. ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేవి, దుఃఖాన్నిచ్చేవి. వీటితో నిత్య సుఖం లేదు. నిరతి శయానందం లేదు. కష్టం వచ్చినప్పుడు గాని
" నీవే తప్ప నితః పరంబెరుగ " నని భగవంతున్ని ఆశ్రయించం. కనుక ఇలా కష్టం వచ్చినప్పుడు గాక నిత్యము భగవంతుడిని ఉపాసించాలి. ఈ బంధాలున్నా నిరంతరం భగవంతుని యందే మనస్సును ఉంచాలి. నిత్య స్మరణ చేయాలి.
విషయాధీనమైన మనస్సు భగవదాధీనం కావటమే ఉపాసన.
అట్టి భక్తుడే శ్రేష్టుడని తీర్మానం.

No comments: