Monday, 5 June 2017

7.అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలి.జెండాలను ఏజెండాలను పక్కనపెట్టి ఒక ఐక్య కార్యాచరణ రూపొందించి అసలు దోషులను పట్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకి అందరికీ ఉంది. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి సంపాదించుకోవాల్సిన బాధ్యత అందరిదీ.


All the songs from the divine trance 


1.15000 కోట్ల విలువైన 700 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిన విషయంలో #72 సబ్ రిజిష్ట్రార్లను బదిలీ చేయడం అనేది ఈ భూకుంభకోణం సెగ తగలకుండ జాగ్రత్తపడడమే అవుతుంది! అందుచేత దోషులను పట్టుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.
2.కేవలం పాత్రధారులైన కొద్దీ మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం అసలు సూత్రధారులను వదిలివేయటమే! అసలు దొంగలను బయటకు తీసుకురావాలి.
3.అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడి భార్య ఐన ఐఏఎస్ అధికారినణిని సమీక్షలో భాగం చేయడంలో..ఆంతర్యం ఏంటి? సమీక్షయొక్క నిబద్ధత ఎంత?
4. ఏ అధికారిక హోదా లేని నమస్తే తెలంగాణ దామోదర్ రావు గారిని సమీక్షలో ఎందుకు భాగం చేశారో తెలవాలి!?
5.ట్రినిటీ ఇన్ఫ్రా సంస్థ పేరు మీద రిజిస్టర్ అయిన S క్లాస్ బెంజ్ AP 10 EH 6666 కార్ సీసీ footages బయటపెట్టాలి .ఈ కుంభకోణంలో అత్యంత
కీలకమైన ఆధారం ఈ కార్ !
5.ఏ ఆధారాలు లేకుండా ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని నాడు బర్త్ రఫ్ చేసినపుడు; నేడు మియాపూర్ ల్యాండ్ స్కాంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రికి సంబంధాలు
ఉన్నాయని పత్రికలు పుంఖానుపుంఖాలుగా ఆధారాలతో వాస్తవాలు రాస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
6.ఈ రాష్ట్రము లో అన్ని రాజకీయ పార్టీలు ఈ కుంభకోణానికి సంబంధించి నిర్దిష్టంగా వారి వారి కార్యాచరణను, అభిప్రాయాలను చెప్పాలి.
7.అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలి.జెండాలను ఏజెండాలను పక్కనపెట్టి ఒక ఐక్య కార్యాచరణ రూపొందించి అసలు దోషులను పట్టించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ప్రజలకి అందరికీ ఉంది. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి సంపాదించుకోవాల్సిన బాధ్యత అందరిదీ.
ఈ భూమి, ఈ ప్రభుత్వం అన్నీ మన కోసం. మన రాష్ట్రం కోసం, అన్నింటా, ప్రజల జాగారుకత మరియు భాగస్వామ్యం ఎంతో అవసరం!

No comments: