Sunday, 31 December 2017

కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మీకోసం
ఆయన మొదట ఆకాశవాణి డిల్లీ కేంద్రములో వార్తలు చదివారు.
ఉన్నత విద్యావంతుడు, ఆదర్శాలతో చివరి వరకూ రాజీ లేని జీవితం గడిపారు.
మంచి పాఠకుడు, స్వయంగా రచయిత కూడా..వారు రవీంద్రుని రచనలను తెనిగీకరించారు.ఇక వారు తెనిగించిన రవీంద్రుని విఖ్యాత రచన గీతాంజలి మంచి పేరు పొందినది.
ఇక నటనలో అతి సహజంగా గంభీర కంచు కంఠం తో ప్రేక్షకుల మన్ననలు పొందారు.నాయకునిగా, ప్రతినాయకుని గా, కుటుంబ పెద్దగా, హాస్యం, గుణచిత్ర నటునిగా అనేకమైన వైవిధ్యమైన పాత్రలు పోషించారు.ముందడుగు, ఎమ్మెల్వే, పదండి ముందుకు విమర్శకుల ప్రశంసలు పొందిన అద్భుత చిత్రాలు. ఆత్మబలం 1964 చిత్రములో ఆయన తన అద్భుత నటనంతో అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసారు. తమిళ నటుడు శివాజీ చిత్రాలకు తెనిగీకరిస్తే వాటికి జగ్గయ్య కంఠం తోడైతే అవి జనరంజితాలే. దిగ్ దర్శకుడు బి ఎన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం కొరకు తీసిన శ్రీ వెంకటేశ్వర వైభవం డాక్యుమెంటరీ చిత్రం మీద సాలూరి రాజేశ్వర రావు సంగీతం, ఇక జగ్గయ్య గారి వాయిస్ దానిని అజరామరం చేసి ఇప్పటికీ టీవీలో వస్తే మనలను మంత్ర ముగ్ధులను చేస్తుంది.
రచయిత ఆత్రేయ గారు , దర్శకుడు తిలక్ అంటే మరింత అభిమానం వీరికి.
మొట్టమొదట ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన చలన చిత్ర నటుడు కూడా.

No comments: