Saturday, 8 April 2017

Happy Birth Day #AnanthaSriram
చదువు మానేసి గేయ రచయితగా తన ప్రయాణం కొనసాగించిన అనంత శ్రీరామ్ ప్రస్తుతం తెలుగులో ప్రముఖ రచయితలలో ఒకరుగా కొనసాగుతున్నారు.
* సినీ గేయ రచయితగా తాను ఈ స్థాయికి 42 ఏళ్లకు చేరుకుంటాన్ని అనుకున్నానని కానీ 32 ఏళ్లకే పేరుప్రఖ్యాతలు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని అనంత శ్రీరామ్ అన్నారు.
* తాను ఇంజంనీరింగ్ విద్యని మధ్య లోనే ఆపేసానని, తనకు ఇంజనీరింగ్ చదవడం ఇష్టంలేదని అన్నారు, మరో ఏడాది చదివుంటే ఇంజనీరింగ్ పట్టా వచ్చి ఉండేదని, కానీ పట్టా అవసరం లేకుండానే జీవితాన్ని పట్టాలెక్కించవచ్చు అని నిరూపించేందుకు మానేసానని అన్నారు.
* తన తాత వ్యవసాయం చేసేవారని, తన తండ్రి ప్రిన్సిపాల్ గా పనిచేశారని, తన కుటుంబంలో మొదటి గేయ రచయిత తానేనని శ్రీరామ్ అన్నారు.
* తన చిన్నతనం లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలంటే ఇష్టపడేవాడినని, అనంతరం వేటూరి, చంద్రబోస్ పాటల పై మక్కువ ఏర్పడిందని శ్రీరామ్ అన్నారు.
* మాకు ఇలాంటి పాట కావలి అని స్ఫష్టంగా చెబితే ఎలాంటి పాటలనైనా రాయగలనని అనంత శ్రీరామ్ అన్నారు. ఆ విషయం లో వారికి క్లారిటీ లేకపోతె మాత్రం తానూ ఏమి చేయలేనని శ్రీరామ్ అన్నారు.
* తనని అవమాన పరిచే సంఘటనలను చిత్ర పరిశ్రమలో ఎవరూ చేయలేదని అయితే చిన్న చిన్న సంఘటనలు జరిగాయని అన్నారు.ఠాగూర్ చిత్ర ఆడియో వేడుకలో తానూ మణిశర్మ వెనుకాలే ఉన్నా పోలీస్ లు మాత్రం మణిశర్మను లోపలకు పంపి తనని వెనక్కు నెట్టేశారని శ్రీరామ్ అన్నారు.
* ఒక గేయ రచయితగా తనకి అసూయ లేదు అని చెప్పడం అబద్దమని, అయితే ఈ రోజుల్లో గేయ రచయిత అసూయ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం చిన్న రచయితలకు కూడా ఆదాయాలు బాగా ఉన్నాయని అన్నారు.
* తనని రాజమౌళి బాగా ప్రోత్సాహించారని అన్నారు. యమ దొంగ చిత్రం లో యంగ్ యమ అన్న ఒక్క పదం వల్ల చిత్రం లో ఐదు పాటలు రాసె అవకాశాన్ని తనకే ఇచ్చారని అన్నాడు.
* బాహుబలి లోని ‘పచ్చ బొట్టేసిన’ పాటకు దాదాపు 70 రోజుల సమయం తీసుకున్నానని అనంత శ్రీరామ్ అన్నారు.
* ఓ విద్యార్థి ఆత్మహత్యకు సిద్ధమై ఎఫ్ ఎం లో తన పాట విని ఉత్తేజం తెచ్చుకుని ఆత్మహత్యని విరమించుకున్నాడని, అలాంటి మనసుని మార్చే పాటలను రాయాలన్నది తన కోరిక అని శ్రీరామ్ అన్నారు.
- Music World Admins Rajesh Sri Aruna Ramesh Surekha Das

No comments: