Thursday, 1 June 2017

" వక్రీకరించు, హీనపరచు, ఓడించు " - ఇది నేటి నవీన వలసవాదుల సూత్రం . ఇపుడు మన కళ్ళను మన వేలితోనే పొడిచే బాధ్యత అన్ని దేశాలు మన మీద కంకణం కట్టుకున్నాయి .

వీర నరసింహ రాజు

" వక్రీకరించు, హీనపరచు, ఓడించు " - ఇది నేటి నవీన వలసవాదుల సూత్రం . ఇపుడు మన కళ్ళను మన వేలితోనే పొడిచే బాధ్యత అన్ని దేశాలు మన మీద కంకణం కట్టుకున్నాయి . ముందుగా మన సంస్కృతిని , చరిత్రను వక్రీకరించడం ప్రారంభించారు . మన చరిత్రను కేవలం ౫౦౦౦ ఏళ్లే అని వక్రీకరించి అదే నిజం అనేట్టు మనలందరినీ నమ్మించేసారు . వేదాలు అపౌరుషేయాలు . అవి అనాదిగా మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి . వాటని వక్రీకరించి తమ అల్పజ్ఞానముతో వీరి సంస్కృతీ సంప్రదాయాలు ఇది, అంత హీనం అంటూ హీన పరిచారు . ౫౦౦౦ సంవత్సరాలకు పూర్వమే మన దేశములో సరస్వతీ నాగరికత విశేషంగా వర్ధిల్లింది . దాని వయస్సు కొన్ని లక్షల సంవత్సరాలు . ఇపుడు సరస్వతీ నది కనుమరుగై అంతర్వాహిని అయి ౫౦౦౦ ఏళ్లకు పైనే అయింది . వీటన్నిటికీ ప్రబల సాక్ష్యం ఆ నదీ పరీవాహక ప్రాంతములో మనకు నేడు లభ్యం అవుతున్న విశేషాలు గమనిస్తే మనం ఎంత గొప్ప చరిత్రకు , సంస్కృతీ వైభవానికి వారసులమో తెలుస్తుంది .
ఇవన్నీ మన వేదాలలోనే ఉన్నాయి . ఇవేమీ తెలియకుండా , పాశ్చాత్త్య చరిత్ర కారులు మన దేశ చరిత్రను కుదించేశారు . ఇంకా మన సంస్కృతీ వైభవాన్ని అంతమొందించడానికి వారు చేస్తున్నప్రయత్నాలు వందల ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి .
ఇంతవరకు ఈ సూత్రములో మొదటి రెండింటిలో మన భారతీయుల అలసత్వం ,అనైక్యత , ఈర్ష్యా ద్వేషాల మూలాన విజయం వారినే వరించింది . ఇంకా మిగిలి ఉన్నది భారతీయులను పూర్తిగా సంస్కృతీ భ్రష్టులను చేయడం . విదేశీ దాడులు , దురాక్రమణలు , వలస పాలనలో వందల ఏళ్ళు మగ్గిన భారతీయ సంస్కృతీ వైభవం నెలకు కొట్టిన బంతికి మళ్లే ఎప్పటికప్పుడు మళ్ళీ పునర్వైభవం పొందినది . కానీ నేడు సెక్యులరిజం పేరిట స్వార్థ పరులైన మన పాలకుల చేతిలోనే మన సంస్కృతీ , చారిత్రిక హననం జరుగుతోంది . హిందూ ధార్మిక సంస్థలైన తిరుమల తిరుపతి దేవస్థానము వంటి వాటికీ నిధులు హైందవులే అత్యధిక శాతం ౯౯ .౯౯ శాతం అనాదిగా సమకూరుస్తున్నారు . ఆ నిధులను భారతీయ సంస్కృతిలో భాగం అయిన సనాతన ధర్మ సంరక్షణకు వినియోగించడానికి ప్రభుత్వాలకు చాలా ఇబ్బందిగా ఉన్నది . మొన్న పీఠాధిపతుల సమక్షంలో హిందూ ధర్మ సంరక్షణ సంస్థను ఆర్భాటంగా ఏర్పాటు చేసి ఆ వెంటనే దానిని మెల్లగా మరుగున పడేట్టు చేశారు . ఇంకా నిధులను ప్రజలు స్వామి వారికి సమర్పిస్తే అవి సక్రమంగా మన ధర్మాన్ని కాపాడేందుకు వియోగించబడక పోగా వాటి దుర్వినియోగం జరుగుతోంది .
దైవ ధనాపహరణం మహాపాపంగా మన హైందవంలో బలీయమైన నమ్మకం . దేవాలయాలలో ఏ వస్తువులను దొంగిలించరాదని మనకు శాస్త్రం చెబుతుంది . కానీ గత రెండున్నర్ర దశాబ్ధములు గా పాలకులు , అధికారుల అండతో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు . దీనికి తగ్గట్టే విదేశీ నిధులతో మత ప్రచార సంస్థలు యథేచ్ఛగా డబ్బు ఆశ చూపించి ప్రజలను మత మార్పిళ్లు చేస్తున్నారు . వీటిలో వేటి మీదా ప్రభుత్వాలకు పట్టదు . వాటి మీద కనీస చర్యలు తీసుకోక పోగా వాటిని ప్రోత్సహించే దిశగా మౌనం వహిస్తున్నారు . ప్రతి సనాతన భారతీయుడు దీనిని గమనించాలి . ఇంకా మిగిలి ఉన్నది ఒకే దశ - కేవలం మనలను ఓడించి సంస్కృతీ ధర్మ భ్రష్టులను చేయడమే . సదాచార సంప్రదాయజ్ఞులు అయిన పీఠాధిపతులు దీని మీద దృష్టి సారించి . ప్రజలను అప్రమత్తులను చేయాలి . ప్రజలు వీటిని ఏమరుపాటుకు గురి అవక గుర్తించి మన సంస్కృతీ వైభవాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేయాలి . మన సంస్కృతీ ఆచార సంప్రదాయాలు ఏవి ఎందుకు చేస్తారు అన్నది మొట్ట మొదటిగా మనం తెలుసుకోవాలి . సంస్కృతీ హననం చేయబోయే వారికి గట్టి బుద్ధి చెప్పాలి .

No comments: