Tuesday, 6 June 2017

కమలములు విచ్చె కమలాకరుడొచ్చి మెచ్చ

బ్రహ్మశ్రీచాగంటికోటేశ్వరరావుగారు---గ్రూపు---ప్రియమిత్రులందరికీశుభోదయవందనములు .

సరిగ్గా రెండు సంవత్సరము క్రితము మా అన్నయ్యగారు శ్రీ దేవరకొండ
సుబ్రహ్మణ్యం గారు శ్రీ రామ చంద్ర ప్రభువు సుప్రభాతము రచించి
నాకు పంపారు.

మీరు కూడా చదవండి.

అందుకోండి ఆలూరుకృష్ణప్రసాదు .

శ్రీ రామచంద్ర సుప్రభాతం

కౌశల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నర శార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం
రాత్రంత నీ దర్శనమునకై భక్తుడు హనుమ కాచె
ఆత్రాన వేచె లేచి కనువిందు చేయవయ్యా
బ్రహ్మర్షి కౌశికుడు వేకువన నిను మేలుకొలప
కలునరేకులవంటి కనులు తెరచితివి
కలవ రేకులు విచ్చె కనవయ్య కనులకింపుగను
కమలాకరు రాకకై వేచి యున్నాఇ
కమలములు విచ్చె కమలాకరుడొచ్చి మెచ్చ
శ్రీ రామచంద్ర ప్రభో తవ సుప్రభాతం
కలువరేకులవంటి నీ కనులు తెరువ
కనెడు భాగ్యము మాకు కలిగించవయ్యా
నీ భక్తులెల్లరు నీ ముంగిట వేచి యున్నారు
కనులు తెరిచి కరుణించు కరుణాలవాలా
మీ వంశకర్త రవి మూర్తిని నీవు కనగ
మేలుకో శ్రీరామ మాత సీతా సమేతా
ఆపన్నులు ఆత్రాన నిను చూడ వేచి యున్నారు
ఆపదలు బాపమని నిను వేడుచున్నారు
మేలుకొని నీ భక్తీలకు మేలుగొలుపవయ్యి
ఆర్తత్రాణ పరాయణా ఆది నారాయణా
భక్తులను దయజూడు భద్రాద్రి రామా
ఆర్తులను కాపాడు అయోధ్య రామా
కృతతో మము వీక్షించి రక్షించి పాలించవయ్యా
ధన్యోస్మి ధన్యోస్మి అని మేము తరిఇంతుమయ్యా*

రచన:Devarakonda Subrahmanyam.

చిత్రంలోని అంశాలు: 3 మంది వ్యక్తులు, వ్యక్తులు నిలబడి ఉన్నారు

No comments: