Good night friends....
ఒక 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది..కానీ వాళ్ళ నాన్న మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు.ఒక రోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయితో ఒరేయ్ బాబు నీకు కొత్త అమ్మ , చనిపోయిన పాత అమ్మ మద్య ఏం తేడా అనిపించిందిరా అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు. నాన్న కొత్త అమ్మ నిజం.. పాత అమ్మ అబద్ధం అన్నాడు.
అది విన్న తండ్రి అవాక్కయి..అదేంటి బాబు అలా అంటున్నావ్ అంటే అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు.నేను ఎపుడైనా అల్లరి చేస్తే అప్పుడు మా అమ్మ అనేది నువ్ ఇలాగె అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టాను అని..అయిన నేను అల్లరి చేసేవాడిని..కానీ ఆ అమ్మ నన్ను లాక్కొని వెళ్లి తన దగ్గర కూర్చోబెట్టుకొని అన్నం తినిపించేది..
కాని ఇప్పుడు ఉన్న కొత్త అమ్మ కూడా అల్లరి చేసావంటే నీకుఅన్నం పెట్టను అంది ..కానీ ఈ కొత్త అమ్మ 3 రోజుల నుండి నాకు నిజంగానే అన్నం పెట్టడం లేదు నాన్న..అందుకే ఆ పాత అమ్మ అబద్ధం .. ఈ కొత్త అమ్మ నిజం.ఇది విన్న ఆ తండ్రి నోట్లో నుండి మాటరాలేదు.....!
ఎన్ని డబ్బులు ఇచ్చిన అమ్మ ప్రేమ దొరకదు..!!!
ఎన్ని డబ్బులు ఇచ్చిన అమ్మ ప్రేమ దొరకదు..!!!
No comments:
Post a Comment