దేహమున్నవరకు మోహ సాగరమందు మునుఁగు
చుందురు శుద్ధ మూడజనులు,సలలితైశ్వర్యముల్
శాస్వతంబనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు,
సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు
గోరుకొనరు,జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలఁ జూచి నిందఁ
జేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి
పెద్ధలజూచి నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!భూషణ
వికాస!శ్రీ ధర్మపురి నివాస!దుష్ట సంహార!నరసింహ!
దురితదూర!!!
ఈ మూఢ జనులు దేహమున్నంత వరకు
మోహసాగరంలో మునుఁగుతుంటారు!ఐశ్వర్యములు
శాస్వతమనుకుని భ్రమకు లోనవుతున్నారు!సర్వకాలము
మాయా సంసార బద్ధులై గురుని కరుణను కోరుకొనరు.
జ్ఞానము భక్తి లేక పెద్దలను నిందిస్తారు.నీరజాక్ష!
ప్రాణమున్నంత కాలము అరిషడ్వర్గములకు లోబడి
నిన్ను మరచిన వారిని ,యోగులను నిందించే మమ్ములను
క్షమింపుము తండ్రీ ధర్మపుర నారశింహా!!!
No comments:
Post a Comment