అసలు గుర్మీత్ సింగ్ బాబా ఎవరు..?
By BhaaratToday | Publish Date: Aug 30 2017 7:42AM | Updated Date: Aug 30 2017 7:48AM
గుర్మీత్ సింగ్…ఇప్పుడు ఈ మహానుభావుడి పేరు పాపులర్ అయిపోయింది. ఈయనగారి చరిత్ర రోజు టీవీల్లో, పేపర్లో తెరకెక్కుతున్నాయి. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి. ఇంతకు గుర్మీత్ సింగ్ ఎవరు? గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి భూస్వామి. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. గుర్మీత్ ను 7 సంవతర్సాల వయసులో పంజాబ్ లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమంలో చేరాడు. 1990లో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆశ్రమ బాధ్యతలు స్వీకరించాడు. ఆయన భార్య హర్జీత్ కౌర్.. వీరికి ముగ్గురు సంతానం. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. గుర్మీత్ పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదయ్యాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25, 2017న తీర్పునిచ్చింది. ఈ సామి లీలలు ఎంత చెప్పినా టైం గడవదు. తన శిష్యుల్లో దాదాపు 90% మంది పై హత్యాచారానికి పాల్పిడినట్లు బాబా బాడీగార్డు తెలిపినట్లు సమాచారం. హత్యలు చేసి నదిలో పడేయడం, ఆశ్రమంలో కాల్చేయడం అక్కడ మామూలే. 700 ఎకరాల సువిశాలమైన డేరా హెడ్ క్వార్టర్స్ లో పితాజీ గుఫాను నిర్మించుకుని అక్కడే ఆయన రాస లీలు కొనసాగించేవాడట. మగవాళ్లకు అనుమతి ఉండదు.. కేవలం మహిళా భక్తులు మాత్రం రొటేషన్ పద్ధతిలో ఆయన రహస్య మందిరంలోకి వెళ్లేవారట. వీరు 200 మందికి పైగా ఉండేవారని, ఆ తర్వాత వారి జాడే తెలియకుండా పోయిందట.
పితాజీ మాఫీ... అంటే అసలు అర్థం పితాజీ నిన్ను క్షమించాడు అని. కాని.. మనోడు కొంచెం తేడా కదా.. పితాజీ మాపీ అంటే కొత్త అర్ధాన్ని అక్కడి వాళ్లకు అలవాటు చేశాడు. మనోడి ఆశ్రమంలో మాత్రం పితాజీ మాఫీ అంటే క్షమించడం అనే అర్థం కాదు. మరేంటి? అనుకుంటున్నారా….దాని అర్థం రేప్ చేయడం. మహిళలను అత్యాచారం చేసేటప్పుడు తాను దేవుడి అవతారమని.. తాను దైవాంశసంభూతిడినంటూ గుర్మీత్ వాళ్లకు చెబుతాడట. ఆయన ఆశ్రమంలో కొత్తగా వచ్చిన మహిళా భక్తురాలిని పాత భక్తురాళ్లు అడిగే ప్రశ్న పితాజీ మాఫీ అయ్యిందా అని... అంటే అక్కడ మనోడి మాఫీ ఎంతగా పాపులరో అర్థం చేసుకోవచ్చు.
ఏ భూమిపైన ఈ బాబా కన్ను పడితే చాలు అంతే సంగతి….దాన్ని తన సొంతం చేసుకునేందు ఎంతకైనా తెగించేవాడట. 20 లక్షల భూమికి మనోడు ఇచ్చేది ఎంతో తెలుసా…? 1 నుంచి 2 లక్షల రూపాయలేనట. భూమి విషయంలో ఎవరైన అడ్డు తగిలితే వారిని హత్య చేయడమే బాబా పని. ఇక్కడ ఇంకో విషయం...మనోడికి ముందు చూపు చాలా ఎక్కువేనండోయ్...బాబా కేసు తీర్పు విషయంలో తేడా వస్తే మాత్రం హింసను ప్రేరేపించమని, అల్లర్లతో రెచ్చిపొమ్మని తన అనుచరులను పురమాయించి, అల్లర్లు చేయడానికి రోజుకు రూ.1000 ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఈ సామీజీ. ఇలాంటి చరిత్ర కలిగిన ఈ మహానుభావుడు చివరకి 20 సంవత్సరాలు జైలు కూడు తీనాల్సి వచ్చింది. మరీ అసలైన బాబా జైలులో ఊచలు లెక్కిస్తుంటే మరీ ఆయన డేరా ఆశ్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

No comments:
Post a Comment