సాయం చేస్తూ న్యాయంగా బ్రతకడం ఎంత కష్టమో జీవితం లో ఒక్కరోజు ఒక్కసారి బ్రతికి చూస్తే తెలుస్తుంది........ మన దగ్గరున్న వంద రూపాయలలో పది రూపాయలు సాయం చెయ్యాలంటే వెయ్యిసార్లు ఆలోచిస్తాం... కాణి సంపాదన లేకపోయినా కాలర్ ఎగరేసుకుని తిరుగుతుంటాం.... కోట్లు సంపాదించి కూడా కొంచెం కూడా గర్వం లేని నిన్ను చూసి సభ్య సమాజం సిగ్గు తెచ్చుకోవాలి....
సాయం చెయ్యడం లో కర్ణుడిని మించిపోయావ్.... మానవత్వానికి మారు పేరు నువ్వు అయ్యావ్... కూడపెట్టిన సొమ్మంతా కష్టంలో ఉన్నవాళ్ళకి ఇచ్చేస్తున్నావ్....నీ అభిమానులు నీ భక్తులు అవ్వడానికి నీ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం "మంచితనం" ... ఎన్ని జన్మలెత్తినా నీ దరిదాపులకు కూడా మేము చేరుకోలేం.. ... డబ్బు హోదా .... ఇవేమీ సంతృప్తిని ఇవ్వవు... ఎదుటి వారి కడుపు నింపితే వచ్చే ఆత్మసంతృప్తి ఇంకా దేనిలోను లేదని నీ మానవత్వం చెప్తుంది... నువ్వు దేవుడివి స్వామి.
💐💐💐💐
No comments:
Post a Comment