Monday, 27 November 2017

హైదరాబాద్ మెట్రో చంద్రబాబు గారి ఆలోచనతో ఆమోదించబడ్డ ప్రాజెక్టు, డా.వైయస్ఆర్ గారు కార్యరూపం లోకి తీసుకురాగా రోశయ్యగారు, కిరణ్ కుమార్ రెడ్డిగార్ల నేతృత్వంలో ప్రభుత్వాలు ముందుకు తీసువెళ్లిన ప్రాజెక్టు. అనేకమంది అధికారులు, నిపుణులు, కార్మికులు కష్టపడిన ప్రాజెక్టు. అలాగే సుల్తాన్ బజార్, అసెంబ్లీ పాతభవనం వల్ల తెలంగాణ సంస్కృతి దెబ్బతింటుందనే విధంగా ఆపుచేయించబడి, కెసిఆర్ గారి వల్ల ఆలస్యమై ఖర్చు తడిసి మోపిడైన ప్రాజెక్టు. ఆఖరిగా వారి ప్రభుత్వమే పూర్తి చేయించిన ప్రాజెక్టు.
ఒక్కసారి పాతవారిని గుర్తుచేసుకునే యత్నం చేయలేదు సరికదా కప్పిపెట్టే యత్నం సరికాదు. ఆ విషయం కొందరు పెద్దలకు చెప్పాను. చూద్దాం రేపు గుర్తుకు తెచ్చుకుంటారో లేదో.
హైదరాబాదు మెట్రో ప్రపంచంలోనే అత్యుత్తమమైన విధంగా సేవలందించాలని కోరుకుంటూ... కార్యరూపంలోకి తీసుకురావడాని కృషి చేసిన అందరినీ అభినందిస్తూ.-చలసాని

No comments: