మన నిజమైన శత్రువు ఎవరో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు
ప్రతీ మనిషిలోను ఏదో ఒక లోపం ఉంటుంది. దానిని పరిస్థితులకు అనుగుణంగా అదుపులో పెట్టుకోవాలి. మన ప్రవర్తనను బట్టే మనకి శత్రువులైనా, మిత్రులైనా ఏర్పడతారు.
అంటే… మన మిత్రుడు, శత్రువు ఇద్దరూ మనలోనే ఉన్నారు.
కోపం, లోభం, అసూయ, స్వార్ధం, కామం, అహంకారం ఇవన్నీ మన శత్రువులే. ఎందుకంటే… వీటివలనే ఎదుటివారు మనకి శత్రువులు అవుతారు.
గీతలో… శ్రీకృష్ణ పరమాత్ముడు మన నిజమైన శత్రువు ఎవరో చెప్పారు. అదేమిటంటే…
గీతలో… శ్రీకృష్ణ పరమాత్ముడు మన నిజమైన శత్రువు ఎవరో చెప్పారు. అదేమిటంటే…
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్॥
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్॥
రజో గుణం వలన ఉత్పన్నం అయ్యే కామక్రోధాలని తృప్తి పరచడం అసాధ్యం. రజో గుణం వలన ఇంద్రియాల మీద నిగ్రహం ఉండదు. ఇంద్రియాలు పరిపరివిధాలా పరుగులెత్తినప్పుడు కోరికలకు అంతు ఉండదు. ఇదే కామం అంటే! ఈ కామం తీరనప్పుడు క్రోధం ఏర్పడుతుంది. పోనీ… ఒకవేళ కోరిక తీరినా మరో కోరిక సిద్ధంగా ఉంటుంది. ఫలితం! మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పతాడు. ఈ జీవితపు నిజమైన విలువను గ్రహించలేకపోతాడు. ఈ గుణాలే నిన్ను పాపం వైపుగా నడిపించే శత్రువులని తెలుసుకో. కాబట్టి దీనంతటికీ మూలం అయిన రజోగుణాన్నీ… తత్ఫలితంగా ఏర్పడే కామ, క్రోధాలనూ శత్రువులుగా గ్రహించమంటున్నాడు శ్రీకృష్ణపరమాత్ముడు.
నిజమే ఏ పురాణాలు చదివినా, చరిత్ర తిరగేసినా కామంతో కళ్ళు మూసుకుపోవడం వలన, ఎన్నో అనర్ధాలు, అశుభాలు జరిగాయి. మనలోనే ఉన్న కామం సృష్టిని నడిపిస్తున్న గొప్ప గుణమే… ఎందుకంటే అదే లేకపోతే సృష్టి ఆగిపోతుంది. కాని అది మితిమీరితే… మానవత్వాన్ని కోల్పోయి, పశు తత్వాన్ని తెచ్చుకుని మనల్ని మనం నాశనం చేసుకుంటూ… ఎదుటివారిని కూడా నాశనం చేసే చెడ్డ గుణం అవుతుంది. అందుకని శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పినట్టు మనలో ఉన్న శత్రువుని అదుపులో పెట్టుకోకపోతే మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే.
జై శ్రీమన్నారాయణ!!
No comments:
Post a Comment