Saturday, 30 December 2017

ఎంతమంది చెడగొట్టాలని చూసినా సరే మనదేశం లోని భిన్నత్వంలో లో ఏకత్వాన్నీ ఇంచు కూడా కదపలేరు.
శ్రీవారికి ముస్లీం భక్తుడి కానుక
- తాజా కూరగాయల రవాణాకు 30 లక్షలతో ఆధునిక లారీ సమర్పణ - గతంలోనూ తిరుమల వైద్యశాలకు పరికరాల వితరణ
తిరుమల, 30 డిసెంబర్ (2015):
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా చెన్నైకి చెందిన ఓ ముస్లిం భక్తుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి కూరగాయల రథాన్ని సమర్పించారు. చెన్నై, బెంగళూరు తదితర దూర ప్రాంతాల నుంచి తిరుమల అన్నదానానికి కూరగాయలు తెస్తుంటారు. భక్తులు సైతం కూరగాయలను వితరణగా ఇస్తుంటారు. వాటిని అంతదూరం నుంచి తాజాగానే తిరుమలకు చేర్చటానికి ఏ.సి లారీ అవసరం అవుతోంది.
ఆ అవసరాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న అబ్దుల్ గనీ అశోక్ లైల్యాండ్ లారీని రూ.30లక్షల వ్యయం చేసి ప్రత్యేకంగా డిజైన్ చేయించి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయ అధికారులకు అందించారు. అబ్దుల్ గనీ అందించిన లారీకి శ్రీవారి ఆలయం ముందు సాధారణంగా ప్రతి కొత్త వాహనాన్ని విరాళంగా ఇచ్చినపుడు చేసే విధంగానే అర్చకులు పూజలు చేశారు.
అనంతరం ఆలయ అధికారులు ఆ వాహనాన్ని టీటీడీ ట్రాన్స్ పోర్టు అధికారులకు అదించారు. ట్రాన్స్ పోర్టు అధికారులు వితరణను తమ రికార్డుల్లో నమోదు చేసుకుని, ఆ వాహానాన్ని అన్నదానం అధికారులకు అందించారు. ఈ సందర్భంగా దాత అబ్దుల్‌ గనీని... టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, రవాణా విభాగం అధికారి శేషారెడ్డి, అన్నదానం విభాగం అధికారి వేణుగోపాల్ తదితరులు సత్కరించారు. అబ్దుల్‌ గనీ గతంలో తిరుమల అశ్వనీ వైద్యశాలకు వైద్య పరికరాలు కూడా వితరణగా అందజేశారు.
.............................
ఓం నమో వేంకటేశాయ
మీ బాలు గాడు.

No comments: