Sunday, 11 February 2018




2014 లో రెవిన్యూ లోటు కేంద్రం తీర్చలేదు,16000 కోట్లు మేము లెక్కేస్తే కేవలం 3800 కోట్లు మాత్రమే ఇచ్చారు.
వాస్తవం: రెవిన్యూ లోటు ప్రాతిపదిక విభజన బిల్ ప్రవేశపెట్టిన సమయానికి ఉన్న ఆదాయ వ్యవహారం గా చూడాలని విభజన చట్టం చెబుతోంది.విభజన చేసిన UPA ప్రభుత్వం 2014 లో వోట్ అన్ అకౌంట్ ప్రవేశపెట్టిన సమయానికి ఆదాయంలో ఉన్న భేదాన్ని ఆధారంగా చేసుకుని దీనిని లెక్కించడం జరుగుతుంది.అదే ప్రాతిపదిక న లెక్కించిన 3920 కోట్ల లోటులో కేంద్రం 3800 చెల్లించింది అని తెదేపా నే చెప్తోంది.
2014 మే లో ఎన్నికలు అయ్యాకా,2014-15 బడ్జెట్ ప్రవేశపెట్టిన తెదేపా దాదాపు 7000 కోట్ల రుణ మాఫీ(ఇది కూడా ఒక సంవత్సరంలో జరగలేదు,దశలు దశలుగా దాదాపు 3 సంవత్సరాల్లో చేసింది),అప్పుడు మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రము గా ఆవిర్భవించిన తెలంగాణ కి పోటీగా ఆంధ్రాలో ఉద్యోగులకు పెంచిన 42 శాతం ఫిట్మెంట్ బకాయిలు దాదాపు 5000 కోట్లు కలిపి మొత్తం 16000 కోట్లు అని లెక్క కడుతొంది,అది ఇవ్వలేదు కాబట్టి బీజేపీ మీద నెపం నెడదాము అని ప్రయత్నిస్తోంది.
చంద్రబాబు ని ప్రజలు గెలిపించిన ప్రాతిపదిక అనుభవం తో కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి స్వయం సమృద్ధి,ఆర్ధిక క్రమ శిక్షణ తీసుకొచ్చి సంపద సృష్టిస్తారు అని..అంతేగాని అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రం పై రాజకీయ ప్రయోజనాల కోసం,పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి తో పోటీ పడడం కోసం,ఈగోల కోసం మరింత కష్టాల్లోకి నెడతారు అని కాదు.
2014-15 కి 2013-14 బడ్జెట్ తో పోలిస్తే దామాషా ప్రకారం 85000 కోట్ల బడ్జెట్ ఉండాలి కానీ కేవలం అంకెల గారడి కోసం 140000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించి..మద్యం అమ్మకాలు పెంచి సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మభ్యపెడతారు అనికాదు.

No comments: