Saturday, 28 April 2018

Bhanumathi Gangula 

ABN ఆర్కే కి ఆరు ప్రశ్నలు....
~~~~~~~~~~~~~~~~~
1. పాత్రికేయులకు కూడా పరిమితులు ఉంటాయని, రాజ్యాంగానికి వారేమీ అతీతులు కాదని, ఒకరి వ్యక్తిగత హక్కుల్ని హరించే హక్కు వారికేమీ లేదనే విషయం మీకు తెలుసా లేదా?
2. కొంతమంది పాత్రికేయులు (మీతోసహా) మేధావులుగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చేసి మాట్లాడడం ఒకరకమైన భావదారిద్య్రం కాదంటారా?
3. ఏ ప్రశ్న ఎవరిని, ఎప్పుడు, ఎలా అడగాలో కూడా చేతకాకపోవడాన్ని ఏవిధమైన జర్నలిజం అంటారో కాస్త సెలవిస్తారా? ( ఉదా: మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం)
4. కేంద్రాన్ని ఎన్నో రకాలుగా నిలదీస్తున్న మీ పత్రిక, ఛానెల్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను కాగ్ బయటపెడితే ఒక ఆర్టికల్ వ్రాయడం కానీ, ఒక డిబేట్ పెట్టడం కానీ ఎందుకు చేయలేకపోయరో కాస్త చెప్పగలరా?
5. ప్రత్యేక తరగతి హోదాకి బదులుగా చంద్రబాబు గారి ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు అది తప్పుడు నిర్ణయమని తెలిసినా ప్రభుతాన్ని ఎందుకు నిలదీయలేకపోయారు? ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీ ప్రసార మాధ్యాలకు లేదా?
6. ప్రత్యేక తరగతి హోదాలో పారిశ్రామిక రాయితీలు భాగం కాదని మూర్ఖంగా వాదించడమే కాకుండా, అనేకసార్లు హోదాపై మాటమార్చిన విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చి మీ పత్రిక, మీ ఛానెల్ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించాయో చెప్పగలరా?

No comments: