Friday, 15 June 2018

#తప్పకుండా_చదవండి...
ఎప్పుడూ కుట్ర రాజకీయాలేనా. చరిత్రలో మంచిపేరు సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడూ రాదా ? ఎంతసేపు నేను, నా కుటుంబం,నా కులం అనే యావేనా? సంక్షోభం లో కూడా సంపాదించాలి అనే స్వార్ధమేనా ?
ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు ఏముంది గర్వకారణం మీ చరిత్ర లో ? ప్రతి పనిలోనూ దుర్మార్గమే! స్వార్ధమే ! మోసమే!
ఆనాడు లక్ష్మీ పార్వతి ని బూచి గా చూపెట్టి అధికారం చేజిక్కించుకుని ఎన్టీఆర్ తో నే ఔరంగ్ జీబ్ అనిపించుకున్నారు.
ఈ నాడు బీజేపీ ని బూచి గా చూపించి అధికారం నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నో ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అన్న నోటి తోనే ఏమి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు.
ఏ రోజు అయినా ఒకే మాట మీద నిలబడ్డారా ?
ఈ మత తత్వ బీజేపీ పార్టీ తో ఇక పై ఎప్పుడూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అని మసీదు లో చెప్పేరు.
నరేంద్రమోదీ హవా చూసి అదే బీజేపీ తో అంట కాగేరు.
మోడీ ని జైల్లో పెట్టిస్తా అన్న నోటి తోనే మోడీ కి వంగి వంగి సలాం లు కొట్టేరు.
పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ కోసం నీతి ఆయోగ్ ద్వారా కేంద్రాన్ని మేము దగ్గరుండి తొందరం గా కట్టుకుంటాం అని అడిగి తీసుకున్నారు. అడుగు అడుగునా అవినీతి మయం చేసేరు. 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను రాత్రి కి రాత్రి 56 వేల కోట్లు పెంచేసిన ఘన కీర్తి మీది.
కేంద్ర పధకాలు అన్ని మీ పేరు తో మార్చి స్వంత డబ్బా కొట్టుకున్నారు. కనీసం ప్రధాని ఫోటో కూడా ఎక్కడా పెట్టకుండా రాష్ట్ర పధకాలు గా పైరసీ ప్రకటనలు ఇచ్చేరు.
హోదాలో ఏముంది ప్యాకేజీ లోనే అంతా ఉంది అన్నారు. తీరా కేంద్ర లెక్కలు డొక్కలు అడిగితే 'ఆంధ్రుల ఆత్మ గౌరవం ఆంధ్ర కు ప్రత్యేక హోదా' అని అధర్మ పోరాటం చేసేరు.
ఆ రెండు నాల్కల పోరాటం సభలో ప్రధాన్ని మీ పిచ్చి బామ్మర్ది పచ్చి బూతులు తిడుతుంటే ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.
విలాసవంతమైన మీ అరపూట నిరాహారదీక్ష లో మీరు పట్టు పరుపులు పై ఆశీనులు అయి ఉంటే మీ పచ్చ తమ్ముళ్ళు మీ కాళ్ళ మీద పడి మొక్కుతుంటే మీరు ఆంధ్ర సీఎం బాబు గారు కాకుండా ఆంధ్ర డేరా బాబా లాగా దర్శనం ఇచ్చేరు.
అవినీతి లో , ఆడపిల్లల ఎగుమతి లో ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానం లో నిల బెట్టేరు.
కట్టుబట్టలతో కరకట్ట కు వచ్చేను అని చెప్పి దేశం లోనే అత్యంత ధనిక సీఎం గా పేరు గడించేరు.
అమరావతిలో ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తాను అని చెప్పి చిరు జల్లుకే చిల్లులు పడే తాత్కాలిక భవనాలు కట్టేరు. రాజభవనం హైకోర్టు దేవతా వస్త్రాలు గా చూపిస్తున్నారు.
అప్పుడు నా ఇటుక నా అమరావతి అని , ఇప్పుడు నా ధాన్యం నా పట్టిసీమ అని, ఎంత సేపు ప్రజలు ను దోచుకోవడం దాచుకోవడం తప్పించి ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి మీరు ఇచ్చిన 600 హామీలు లో ఏదైనా అమలు చేసేరా ?
10 ఏళ్ళు కాల పరిమతి ఉన్నా ప్రత్యేక హోదా , రైల్ జోన్ , ఉక్కు కర్మాగారం కేవలం మూడు హామీలు తప్పించి మిగతా అన్ని మొదలు పెట్టిన కేంద్రాన్ని మాత్రం నిందిస్తారు.
మీ వైఫల్యం కేంద్రం పై నెట్టివేసి 2019 లో మళ్ళీ నెగ్గటానికి మరో కుట్ర కు తెర లేపుతారు.
రేప్ చేస్తే అదే ఆఖరు రోజు అన్న మీరు ఇప్పుడు ఆగని రేప్ లు ప్రేక్షకుడు లా చూస్తున్నారు. తీవ్రవాదానికి మతం లేదు అన్నారు మరి రేప్ కు ఉందా బాబు గారు ? మీ పచ్చ తమ్ముళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా ఆడకుతుర్లు మాన ప్రాణాల రోజూ చింపేస్తుంటే పోస్కో చట్టం ఎక్కడ దాచిపెట్టేరు ?
ఢిల్లీ వెళితే బీజేపీ ప్రభుత్వం మీకు NSG రక్షణ కల్పించింది. మరి అదే Z సెక్యురిటి ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు , ఈ దేశంలో 90 శాతం అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాల కి దశ దిశా నిర్దేశకుడు అమిత్ షా కుటుంబ సమేతంగా పుణ్య క్షేత్ర దర్శనం కు వస్తే మీ పచ్చ తమ్ముళ్ళు తో రాళ్లు వేయించేరు. ఇదేమి ధర్మ పోరాటం బాబు గారు ?
2019 లో మళ్ళీ ఓటుబ్యాంక్ ల కోసం గుళ్లు కూల గొట్టేరు , తిరుమల ని క్రైస్తవులకు అప్పచెప్పేరు. హజ్ హౌస్ లు నిర్మిస్తున్నారు.
ఎంత కాలం ఈ నయ వంచన ఎన్ని సార్లు ఈ కప్పదాట్లు. ఇదేనా మీ 40 ఇండస్ట్రీ ?
మైండ్ గేమ్ ఆడటం లోను ఈవెంట్ మేనేజ్మెంట్ లో మీరు సిద్ధహస్తులు.
కానీ కాలం ఖర్మం కలిసి రాక పోతే గజ ఈతగాడు కూడా మురుగు కాల్వలో పడి చనిపోతాడు.
120 ఏళ్ల కాంగ్రెస్ ను మట్టుబెట్టి కాంగ్రెస్ ముక్త్ భారత్ ను సాధించి 12000 అడుగుల ఎత్తులో హిమాలయాల లో ముక్తినాధ్ సన్నిధి పూజలు చేసి తిరిగి వచ్చిన అజేయుడు, అమేయశక్తి సంపన్నుడు , దైవంశ శంభూతుడు , ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ తన సేనాని అమిత్ షా పై జరిగిన రాళ్ళ దాడికి , అది తన పై అవమానం గా భావించి అగ్రహోగ్రుడై అగ్నిహోత్రుడై మీ అవినీతి ని దహించి వేస్తుంటే ....
మీ టీడీపీ గతి తప్పి మతి చెడి కకావికలు అవుతుంటే...
ఒక్కరూ రారు మిమ్ము రక్షింప మీరు ఎంత వేడుకున్న...
నా పలుకులు అలకింపు మీ అంతం తధ్యం...

No comments: