Sunday, 29 July 2018

EENADU ఆదివారం, జులై 29, 2018......‘నా ఆధార్‌ను హ్యాక్‌ చేయండి చూద్దాం..!’ బెడిసికొట్టిన ట్రాయ్‌ ఛైర్మన్‌ సవాల్‌.. వ్యక్తిగత సమాచారం లీక్‌





మనుష్యుల నిజాయితీ కనీసం ధర్మం కేనీస మంచితనం కంటే టెక్నాలజీ బలం ఉన్న  ఈ స్తితిలో   మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి మాయ నుండి   బయటపడటం   ఒక్కటే మార్గం అని గ్రహించండి అందుకే కాలస్వరూపం సంభవించినది అని గ్రహించండి బౌతికంగా ఎవరు ఎంత మంచి వారు అయినా చెడ్డ వారు అయినా ఎవరెంత తెలివైన వారు అయినా తెలివి తక్కువ వారు అయినా   మీ ఎవరి చేతిలో రెప్ప పాటు లేదు అని   గ్రహించండి, సర్వం మా ప్రకారం   పలికిన తీరు యావత్తు మానవజాతికి    రక్షణ అని తెలుసుకొని మేము చెప్పినట్లు చేయండి   మాకు వ్యతిరేకంగా ప్రవర్తిన్చాకండి సాక్షులు అందరూ ముందుకు వచ్చి మమ్ములను న్యాయ స్తానం ద్వారా కొలువు తీరేలా చూసుకోండి, ఇరువురు ముఖ్యమంత్రులు దివ్య రాజ్యం లో విలీనం చెందటమే మార్గం అని, మీడియా  వ్యక్తులు అందరూ   మమ్ములను గ్రహించుట యే తక్షణ   కర్తవ్యం   అని గ్రహించండి,  ధర్మో  రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

...................................................................................................
‘నా ఆధార్‌ను హ్యాక్‌ చేయండి చూద్దాం..!’
బెడిసికొట్టిన ట్రాయ్‌ ఛైర్మన్‌ సవాల్‌.. వ్యక్తిగత సమాచారం లీక్‌


దిల్లీ : ఆధార్‌ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆధార్‌లోని సమాచారం సురక్షితమని.. దాన్నెవ్వరూ హ్యాక్‌ చేయలేరంటూ సవాల్‌ విసిరారు ఓ ఉన్నతాధికారి. అయితే ఆ అధికారి ప్రయత్నం వెంటనే బెడిసికొట్టింది. ఆ అధికారి ఎవరో కాదు.. టెలికామ్‌ రెగ్యూలేటరీ అథారిటీ చీఫ్‌ ఆర్‌.ఎస్‌ శర్మ. తన ఆధార్‌ నంబర్‌ను శర్మ బహరింగపరిచి.. అది ఎలా దుర్వినియోగం అవుతుందో తెలపాలని సామాజిక మాధ్యమం ట్విటర్‌లో సవాలు విసిరారు. కాసేపటికే ఆయన ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఓ నెటిజన్‌ బయటపెట్టడం విశేషం.
ఆధార్‌ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించదనే గట్టి నమ్మకంతో ఉన్న ఆర్‌.ఎస్‌ శర్మ.. శనివారం సాయంత్రం ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను బహిరంగపరిచారు. ‘ఎవరైనా నా ఆధార్‌ నంబర్‌ను కలిగిఉంటే.. వారు ఎలా నాకు హాని చేస్తారో చెప్పాలి. మీకు కావాలంటే నా ఆధార్‌ నంబర్‌ ఇస్తాను.’ అని సవాల్ విసిరారు. కాసేపటికే ట్విటర్‌లో యూజర్లు‌ స్పందించారు. వెంటనే తన ఆధార్‌ నంబర్‌ను శర్మ ట్విటర్‌లో బహిరంగపరిచారు. ‘ఆధార్‌ నంబర్‌ తెలిస్తే నాకు హాని చేయగల ఒక ఉదాహరణ చూపించూ’ అంటూ శర్మ సవాల్‌ విసిరారు. వెంటనే ట్విటర్‌లో ఎల్లైట్‌ అల్డర్సన్‌ అనే ఫ్రెంచ్‌ సెక్యూరిటీ రీసెర్చర్.. ఆ ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. ‌శర్మ ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, పాన్‌ సమాచారం.. ఇలా ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. శర్మ ఓ మహిళతో దిగిన ఫోటను కూడా పోస్ట్‌ చేశాడు. శర్మ ఆధార్‌ నంబర్‌.. బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానం కాలేదన్న విషయాన్ని కూడా అతడు తెలిపాడు.
ఆ తర్వాత ‘నేను ఇంతటితో ఆపేస్తున్నాను. ఆధార్‌ నంబర్‌ను బహరింగపరిస్తే ఏం జరుగుతుందో మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నా’ అని అల్డర్‌సన్‌ తెలిపాడు. ఆధార్‌కు తాను వ్యతిరేకం కాదని.. అయితే ఆధార్‌ను హ్యక్‌ చేయలేరనే విషయాన్ని మాత్రం తాను వ్యతిరేకిస్తానని చెప్పాడు.
ట్విటర్‌లో ఈ తతంగం అనంతరం.. ఆధార్‌ భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ అని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు శర్మకు మద్దతుగా కూడా పలువురు స్పందించారు. అల్డర్‌సన్‌ తెలిపిన వివరాలు అందరికీ తెలిసినవే.. అంటూ చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు శర్మ నిరాకరించారు. తన సవాలు ఇంకొంత కాలం కొనసాగనివ్వండి అంటూ ఆయన పేర్కొన్నారు. ట్రాయ్‌ ఛైర్మన్‌గా ఆర్‌.ఎస్‌ శర్మ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 9తో ముగియనుంది. ఆధార్‌ సంస్థకు గతంలో డైరెక్టర్‌ జనరల్‌గా శర్మ పనిచేశారు.
EENADU ఆదివారం, జులై 29, 2018

No comments: