Wednesday, 8 August 2018

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

6వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు:

🔶ఈ నాలుగు సంవత్సరాల కాలం లో జలవనరులు , నీటిపారుదల శాఖలో జరిగిన వేలాదికోట్ల రూపాయల కుంభకోణం పై సిబిఐ విచారణకు సిధ్ధంగా వున్నారా?

🔶విద్యుత్తు ఉత్పత్తిలో బ్రహ్మాండమైనప్రగతిని సాధించామని కోతలుకోస్తున్నారు, ఈ నాలుగు సంవత్సరాలలోపు మీ అదనపు విద్యుత్తు కొనుగోళ్ల పై చేసిన ఖర్చు, వసూలుచేసిన కమిషన్లపై సిబిఐ విచారణకు సిద్ధమా?

🔶రాష్ట్రం అష్టకష్టాలలో ఉంది  అంటూంటారు.మీ దుబారా అంతా రాష్ట్రం మీద రుద్దటానికి  సిగ్గు వేయటం లేదా? సుమారు ఏడాది పాటు స్టార్ హొటల్లలో ఉండి 30 కోట్లు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడానికి సిగ్గు లేదా? ప్రజలసొమ్మును ఇలా దుర్వినియోగం చేయవచ్చా?

🔶మీఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో, రిజర్వేషన్లు మరియు వారి మొత్తం రిజర్వేషన్లను 33 1/3% కు పెంచుతామని హామీయిచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేయలేదా?ఇది మోసం, అన్యాయంకాదా? ఒక్కనిమిషమైనా ముఖ్యమంత్రిగా కొనసాగే మొరాలిటీ మీకుందా?

🔶తెల్లారిలేస్తే నేను నిప్పు అనేమీకు మీమీదవున్న 18 స్టేలకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా ?? మరి మీరు నిప్పుఐతే స్టేలు వెకేట్ కావాలి కదా? ఇంకా స్టేలు ఇన్నాళ్ళు ఎందుకు వున్నాయి? స్టేలతోనే పరిపాలనను కొనసాగిస్తారా?

పూర్తిగా అవినితీలో కూరుకుని అనేక అరాచకాలు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎండగడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ఈ ప్రశ్నలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా ??

No comments: