గూగుల్ మెచ్చింది :
రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో కొలువిచ్చిన దిగ్గజ సంస్థ
కృత్రిమ మేధపై సాగిస్తున్న ప్రాజెక్టుకు స్నేహారెడ్డి ఎంపిక
దేశవ్యాప్తంగా ఐదుగురికి దక్కిన అరుదైన అవకాశం
మనకు ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతికేస్తుంటాం. అలాంటి సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం దేశవ్యాప్తంగా అన్వేషించింది. చివరకు అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాలిచ్చింది. ఇంతటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఐదుగురిలో మన తెలుగమ్మాయి కూడా ఉన్నారు. ఆమే.. వికారాబాద్‌కు చెందిన కుడుగుంట స్నేహారెడ్డి.
గూగుల్ మెచ్చిన తెలుగమ్మాయి
మనకు ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతికేస్తుంటాం. అలాంటి సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం దేశవ్యాప్తంగా అన్వేషించింది. కృత్రిమ మేధ అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేక ముఖాముఖీలు నిర్వహించింది. చివరకు అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాలిచ్చింది. ఇంతటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఐదుగురిలో మన తెలుగమ్మాయి కూడా ఉన్నారు. ఆమే.. వికారాబాద్‌కు చెందిన కుడుగుంట స్నేహారెడ్డి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్‌లో ఇటీవలే బీటెక్(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. చదువుతోపాటు భిన్న అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని సైతం అందుకోవడం విశేషం.
ప్రతిభ చూపి.. మెప్పించారు
స్నేహారెడ్డి చిన్ననాటి నుంచే చదువుతోపాటు క్రీడలు, ఇతర కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవారు. ఇంటర్‌లో 98.4 శాతంతో ఉత్తీర్ణత పొందిన ఆమె 2014లో జేఈఈ(మెయిన్స్)లో అఖిల భారత స్థాయిలో 15వ ర్యాంకు, జేఈఈ(అడ్వాన్సుడ్)లో 677వ ర్యాంకు సాధించారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశారు. కృత్రిమ మేధలో భాగమైన ‘నేచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్’ ప్రాజెక్టులో పనిచేసేందుకు గూగుల్ సంస్థ మెరికల్లాంటి యువత కోసం అన్వేషణ ప్రారంభించిందని తెలుసుకున్న స్నేహ.. ఆన్‌లైన్‌లో సాగిన తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేశారు. చివరి పరీక్ష కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉండగా... మరో ముఖ్యమైన పరీక్ష ఉండటంతో హాజరు కాలేకపోయారు. కానీ, ఆమె ప్రతిభను గుర్తించి చివరి రౌండ్‌నూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన గూగుల్ ప్రతినిధులు ఉద్యోగం ఇచ్చారు.
‘‘ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులను పరిశోధనల దిశగా బాగా ప్రోత్సహించడం కలిసొచ్చింది. బీటెక్ చదువుతున్నప్పుడే అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసే అవకాశమూ దక్కింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇతర సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినా పరిశోధనలు చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే గూగుల్‌ను ఎంపిక చేసుకున్నా’’ అని స్నేహారెడ్డి పేర్కొంది.
అమ్మాయిలకు ప్రోత్సహిస్తే అన్నిరంగాల్లో అత్యున్నత శిఖరాలను అవలీలగా అధిరోహిస్తారని స్నేహ తండ్రి సుధాకర్‌రెడ్డి చెప్పారు.
song as intervention
No comments:
Post a Comment