Monday, 6 August 2018

బ్రాహ్మనోత్తములకు వందనములు. పెద్దలకి శాస్త్రజ్ఞులకి అందరికి పాదాభివందనములు. మీతో గ్రూపు ద్వారా కేవలం కొన్ని ఆలోచనలని చర్చించదలచినాము, క్షమించి కొంత సమయం ఇవ్వ ప్రార్ధన.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం,
న్యాయేన మార్గేణ మహిం మహీశాం,
గో బ్రాహ్మణభ్య శ్శుభమస్తు నిత్యం,
లోకా సమస్తా సుఖినో భవంతు.
అంటే, పరిపాలకులు, ప్రజలను, న్యాయమార్గంలో పరిపాలించాలనీ, రాజుకి తద్వారా ప్రజకెల్లపుడు శుభం జరగాలనీ, గో బ్రహ్మణులకెప్పుడూ శుభం జరగాలనీ, ప్రపంచంలో వున్న సర్వ ప్రాణులూ సుఖముగా వుండాలని, మనం ఏకార్యాన్ని నిర్వహించినా చివరగా చెప్పేది ఈ మంత్రం. దీనితో పాటుగా
కాలే వర్షతు పర్జన్య
పృధివీ సస్యశాలినీ,
దేశోహం క్షోభరహితం,
బ్రాహ్మణా సంతు నిర్భయా!
అని కూడా చెబుతాము. దీని అర్ధం సకాలంలో వర్షాలు పడాలని, భూమి అంతా సస్య శ్యామలంగా పాడి, పంటలతో వర్ధిల్లాలని, దేశప్రజలంతా సంక్షోభాలు లేకుండా వుండాలని, బ్రాహ్మణులు నిర్భయంగా బతకాలనీ దీని అర్ధం
ఎన్నో బ్రాహ్మణ సంఘాలు/పరిషత్తులు/సమాఖ్యలు/ట్రస్టులు నిర్విరామంగా బ్రాహ్మణ అభివృద్దికి సహకరిస్తూనే ఉన్నాయి. ఇంకా సహకరిస్తాయని కూడా ఆశిస్తున్నాము. ఒక సామాజికవర్గం (ప్రస్తుత కాలంలో వర్ణం/కులం) ఎప్పుడయితే ఎదో ఒకవైపు నుండి బలం పుంజుకుంటుందో అప్పుడు యువత (ఉద్యోగ, విద్య రంగాల వారు ముఖ్యంగా) అడుగులు అటు పడిపోతాయి. ఎదో ఒక వైపు ఆదాయ మార్గములు సహాయములు అందుతాయి. కానీ దేశంలో ప్రస్తుతం బ్రాహ్మణులకి ప్రభుత్వ ఉదోగాల పై ద్రుష్టి పెట్టె అవకాశం చాలా తక్కువగా ఉన్నది. ఇక ప్రైవేటు రంగం కొంత ఊరటనిస్తున్నది. ఇక మంచి విద్యకి కొంత ఇబ్బంది లేకపోలేదు. ఎందరో వేద పండితులు పేదవారిగా లేకపోలేదు. పేదరికం మూలాన పెద్దగా చదివించలేక పోతున్నారు వారి పిల్లలని. అలాగే అనారోగ్యం కలిగితే పెద్ద వైద్యానికి నోచుకోని వారు లేకపోలేదు.
వీటికి పరిష్కారాలు ఇదివరకే జరిగినా మళ్ళి కాసేపు ఇంకొన్ని విధాలుగా మనమే వెతుక్కునే పనిలో పడదాం రండి.
ఇంతకంటే ముందుగా మనం డేటాబేసును క్రియేట్ చేసుకోవడం అవసరం. మనకు వేలైనంతవరకు అన్ని ట్రస్టులని, సంఘాలని, ప్రతి బ్రాహ్మణ కుటుంబాన్ని అందు పొందు పరచుదాం.
ప్రతిజిల్లా కేంద్రములో అన్ని జిల్లాల డేటాబేసుని భద్రక్పరచుకుందాం. ప్రతి డేటాబేసును ప్రతి జిల్లాతో లింక్ చేసి నడుపుదాం. ఎందుకనగా,ఎక్కడో హైద్రాబాదులో ఉన్న ట్రస్ట్ విశాఖపట్నం లో వారికి సహాయపడలంటే మధ్యలో ఎంతోమంది సహాయం అవసరం ఉండవచ్చు. సమస్య నిజమా కాదా తెలుసుకోవాలి, పెదా ధనిక తెలుసుకోవాలి, విచారణ చేయాలి, ఎటువంటి సమస్యకి ఎటువంటి ట్రస్ట్ ఉపయోగపడుతుంది తెలుసుకోవాలి. ఇలాంటి సమస్య కోసం డేటబేస్ చాలా త్వరగా పని అయ్యేలాచేస్తుంది.
అలాగే డేటాబేసులని, సైట్స్ ని అనుసంధానం చేస్తూ వారి సమస్యలన్నీ రిజిష్టర్ చేసుకోగలిగేలా ప్రయత్నించాలి.
ఇక సమస్యలకు వద్దాం...
1. విద్య :
విద్యదానం అతి గొప్పది. కేవలం విద్య ఉంటె చాలు దేశ/విదేశాల్లో ఎక్కడయినా మనిషి ధనార్జన చేయగలడు. కుటుంబాన్ని పోషించగలడు. మరీ ధనవంతుడు అయిన సాటి కులస్తులకి సాటి మనుషులకి సాయపడగలడు. కానీ పేద బ్రాహ్మణులు చదివించలేక పోతున్న పరిస్థితిలో ఉన్నారు. దీనికి బ్రాహ్మణ సమూహాలు ట్రస్ట్లు సహాయం చేయవచ్చును. మన ట్రస్టుల నుండి కొంత ధన సహాయం చదువుకునే బ్రాహ్మణ విద్యార్ధులని ఎంపిక చేసి వారి పేరున చెక్ రూపంలో రిలీజ్ చేయవచ్చును(కేవలం కుటుంబ ఆదాయం 1,00,000 రూపాయలు అయితే లేదా అంతకంటే తక్కువ సంవత్సర ఆదాయంగా ఉన్న కుటుంబాలకి మాత్రమే). రేపటి రోజున అదే బాటలో వారూ పయనిస్తారు ఎక్కువ మందికి విద్యాదానం చేయగలరు. ఇదివేదం మరియు ఇతర చదువుల వారందరికి వర్తింప చేయ వచ్చును.
2. ఉద్యోగం:
మనందరికీ కన్సల్టన్సి(consultancy) లగురించి బాగానే తెలుసు. ఐతే ఉదొగ్యం ఇవ్వడంలో కొంత విషయ సేకరణ అవసరం. అసలు చదువుకున్న వారికీ మరియు చదువు రాని వారికీ ఇరువురికి ఉద్యోగం చూపగలగాలి. జిల్లాకి ఒక రెండు, బాగా ఎదిగిన ప్రాంతానికి ఒక కన్సల్టన్సి ఏర్పరచి అందులో బ్రహ్మనులనే నియమించి ఎవైన కంపనీలతో, ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకుని వారికీ తగిన ఉద్యోగాలని వారికీ ఇప్పించే ప్రయత్నాలు చేయవచ్చును. విదేశీ ఉద్యోగాలకి NRI సహాయంతో ఉద్యోగ సహాయం కుడా చేయవచ్చును. విదేశీ చదువుకు కూడా మన బ్రాహ్మణ consultancyల సహకారం అవసరం.
3. ఆరోగ్యం:
ఎంతోమంది పేదబ్రాహ్మణులు వైద్యానికి డబ్బు అందక మరణిస్తున్నారు. వారికీ ట్రుస్టల ద్వారా ఆ పేషంటు యొక్క ఆర్ధిక స్థితిని బట్టి ధన సహాయం లేదా పూర్తీ సహాయం (ఆపరేషన్లు మరియు మెడిసిన్ బిల్, చెవి మిషన్, వికలాంగులకి కావలసిన మిషన్లు, కంటి అద్దాలు, పెట్టుడు కాళ్ళు, చేతులు వంటివి, రక్తదానం , కొత్త బ్లడ్ బ్యాంక్ ఏర్పటు) చేయవచ్చును.
4. వ్యాపారం:
ట్రస్ట్ల ద్వారా కొంత ధనం మరియు ప్రభుత్వ సహాయంతో కొంత ధనం సేకరించి చిన్న పరిశ్రమ లేదా వ్యాపారం (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు) వంటివి నెలకొల్పి వాటిని పూర్తిగా యాజమాన్య పరంగా కాకుండా వర్కు చేసేవారి పరం చేసి నడుపుట.
5. గోశాలలు:
గోవుల పోషణ పాలు నెయ్యి కొంత భాగం ఆలయాలకు పంపడం, మరియు గోమయం, గోపంచకం వంటివాటితో హెర్బల్ శాఖముల మరియు బియ్యం వంటివి పండించడం. వట్టిపోయిన గోవులకి తీసుకోని ఆ గోవుల్ని పోషించడం.
6. పంటలు:
కొన్ని భూములని ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేసి అందులో అగ్రికల్చర్ విద్య వచ్చిన బ్రాహ్మణులని సుపెర్వైసింగ్ లోనియమించి చదువు రాని ఆదాయ మార్గం లేని పేద బ్రహ్మణులని(సీడింగ్, కూకీస్, బయో డీజిల్, తృణ ధాన్య, సుఘంధ ద్రవ్య భూమిని పట్టి) నియమించి అగ్రికల్చర్ వ్రుత్తి చూపడం.
7. కళలు:
ఇది ఒక విధముగా అంతరించిపోతున్న సంగీత, నాట్య, చిత్రలేఖన, సాహిత్య, కరాటే, కత్తి యుద్ధం(గురుకులముల మాదిరిగా), గుఱ్ఱపు స్వారీ, కోలాటం, ప్రాచీన విద్యలు, యోగ వంటివి ఎన్నో జిల్లకి ఒక బ్రాంచి తెరచి అందు నిష్ణాతులైన వారికీ తగు పారితోషికం ఇస్తూ ఎక్కువమంది బ్రాహ్మణులకి విద్యలు నేర్పుట.
8. ఆడవారితో కొన్ని ఇంటియందు చేయగలిగే, మరియు ప్రచారం చేయగలిగే వ్రుత్తి లేదా వాలంటరీ గా సేవ చేయించుట.
9. పేద బ్రహ్మణులని పిలచి ఎక్కడైనా యజ్న యాగాదులు జరుపుటలో, ధార్మిక కార్యక్రమములు (365 రోజుల పని) పాలుపంచుకొనేలా చేసి వారిని పోషించుట.
10. పుత్రులు లేక 60 సవత్సరముల వయసు దాటినా పేద బ్రహ్మనులని వృద్దాప్య భ్రుతి ఇచ్చి పోషించుట.
11. జిల్లాకి, అభివుద్దిచెందిన ప్రాంతాల్లో ధార్మిక భవనములు, కర్మల సత్రములు కట్టించుట పోషణ చేయుట. అంత్యేష్టికి సంబంధించిన క్రతువుని చేపట్టుట.
12. చిన్న ఆలయాలు ఎండోమెంట్ కాకపోవడం మంచిదే (దళిత బాధ లేకుండా).
13. ఎన్నో గీతా శిభిరాలు, ధ్యాన శిభిరాలు ఏర్పాటు జిల్లా కేంద్రాలుగా ఏర్పరచుట. (బ్రాహ్మణ బంధువులకి ఉచిత పుస్తక పంపిణీ).
14. ఎన్నో సామూహిక సంస్కారములు ఉచితంగా పేద బ్రహ్మణుల కొరకు నిర్వహించుట. సామూహిక ఉపనయనముల వంటివి.
విటన్నింటికి పెద్దలనుండి సహాయం అవసరమే. దీనికి పోషణకే కాదు, సహాయము, రక్షణ కొరకు సమాజం లో పేరున్న పెద్దలు రాజకీయ/సినీరంగ/సాహిత్య రంగ/పీఠధిపతులు/స్వామీజీల సహాయములు ఎంతగానో అవసరము. ముఖ్యముగా అన్ని జిల్లాల, ప్రాంతాల, బ్రాహ్మణ పరిషత్తులు, సమాఖ్యలు, ఆలయాలు, ట్రుస్టలు, జిల్లా వైదిక సంఘ అధ్యక్షులు, జిల్లా అర్చక సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు అందరు ప్రతి పనిపై సహకరిస్తుంటే(అన్ని కలిసి లింకవుతు) తెలంగాణా ఆంద్ర రాష్ట్రాల్లో బ్రాహ్మణాభివృద్ధి వేగంగా ఉంటుంది. ఇవన్నిఇదివరకె జరుగుతున్నాయి. కేవలం తెలుపుటకే/ గురుతు చేసుకునుటకే తప్ప అన్యధా భావించవద్దని మనవి. తప్పులున్న పెద్దలు మన్నించగలరని ప్రార్ధన. ధన్యవాదములు. ఇంతవరకు గొప్పగా భావితరాల కొరకు కృషి చేసిన బ్రాహ్మణ పెద్దల శ్రమ శ్లాఘనీయం.
// కృతజ్ఞతలతో మరియు సమయం వృధా
చేయడానికి యత్నించినందుకు క్షమించమని వెడుతూ\\
గంగరాజు శ్రీశైలజ
sailaja Shanmukhi
Narayanabhatla Chaitanya Digvijay Srinivas Gurunatha Prasad Vempati Hariprasad Pidaparty Hari Priya
Komarraju Murali Kamakshi Mallampalli
Murali Mohan Phani Vutukuru Pulikanti Venkateshwar Rao Ananthasen Rao Kiran Sharma Sirisha Sanagavarapu Siri Valli Polise Varanasi Vadithala Vasudeva Rao
Angara Venkata Sivakumar
Appala Shyam Praneeth Sharma
ఓరుగంటి శ్రీలక్ష్మి నరసింహ శర్మ Padma Telang Padmasri Nc దేశ్ ముఖ్ ఆశిష్ కుమార్ Praveen Vuppala Vikram Sharma Dhoolipala Vedavathi Suguru Varalakshmigopal Sai Sharma Kodam Akhil Sharma Psr Krishna
మురళీధర్ వట్టిపల్లి Vaddi Sasidhar చివుకుల బాలసుబ్రహ్మణ్యశాస్త్రి Anilkumar Joshi
Tnsp Sarma Akhila Jithendra
Vijay Kumar Srirambatla Balakesavulu Siddhanthi Pothuri Nagaraju Sharma C Dvasudeva Sharma Ravi Kumar Gurajapu
Vijay Krishna Sampath Sharma Rk Siri Hyndavi M Vijay Krishna Jayalakshmi Yallapragada
ములుగు విశ్వనాథ శర్మ
జాజి శర్మ Nandu Anu Vishweshwar Sarma Namilikonda Srirama Bln Murthy
బ్రాహ్మణ అభ్యుదయ సహకార సంఘం లో చేరాలని అనుకునే వారు కింద లింక్ ని ప్రెస్ చేయండి.మీరు సభ్యులు అయిన తరువాత మీ బ్రాహ్మణ మిత్రులు ని కూడా సభ్యులుగా చేయవచ్చు. మీరు మీ గోత్రం ప్రవర వివరించాలని మన
బ్రాహ్మణ సోదరుల కి మనవి. బ్రాహ్మణ అభ్యుదయ సహకార సంఘం లో చేరాలని అనుకునే వారు కింద లింక్ ని ప్రెస్ చేయండి చాలు మీరు సభ్యులు అవుతారు ఇది నా ప్రార్థన ఈ గ్రూప్ బ్రాహ్మణ సోదరుల కి మాత్రమే.https://www.facebook.com/groups/1625029904249935

No comments: