Thursday, 22 November 2018

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి KCR తో...ఇంటర్వ్యూ..
ప్రశ్న : దళితుడిని...ముఖ్యమంత్రి ఎందుకు
చెయ్యలేదు...?
జవాబు : 3 ఎకరాలు ఇద్దామని
ప్రశ్న : మరి ఎందుకు ఇవ్వలేదు..?
జవాబు : డబుల్ బెడ్ రూమ్ ఇద్దామని
ప్రశ్న : అది కూడా ఇవ్వలేదు కదా...?
జవాబు : ఇంటికో ఉద్యోగం ఇస్తే..వాళ్ళే
కట్టుకుంటారని ఇవ్వలేదు..
ప్రశ్న : మరి ఉద్యోగాలు కూడా లేవుకదా..?
జవాబు : KG to PG ఇచ్చి...వారికి ట్రైనింగ్ ఇచ్చాక
ఇస్తాం...
ప్రశ్న : ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు...?
జవాబు : బంగారు తెలంగాణా అవగానే...
ప్రశ్న : ఎపుడు అవుతుంది....?
జవాబు : ప్రాజక్ట్ లు... పూర్తవగానే...
ప్రశ్న : ప్రాజక్ట్ లు...ఎప్పుడు పూర్తవుతాయి..?
జవాబు : చంద్రబాబు..కుట్ర చేస్తున్నాడు
ప్రశ్న : మరి...మీరేం చేస్తున్నారు...?
జవాబు : మిషన్ భగీరధ ద్వారా..ఇంటింటికీ నల్లా
ఇస్తున్నాం...
ప్రశ్న : ఎక్కడా రావటం లేదు కదా....?
జవాబు : మిషన్ కాకతీయ...పూర్తవగానే చెరువులు
నిండి...నీరు పుష్కలంగా అందుబాటులోకి
వచ్చాక...
ప్రశ్న : మిషన్ కాకతీయ ఎందుకు పూర్తి చేయలేక
పోయారు..?
జవాబు : అక్రమ కట్టడాలు తొలగించాలి....
ప్రశ్న : అక్రమ కట్టడాలు తొలగించలేదు కదా...?
జవాబు : ఆంద్రోళ్ళు గోలపెడతారని....
ప్రశ్న : వాళ్ళని తెగ తిడుతున్నారు కదా...?
జవాబు : లే..నేనెందుకు తిడతా...నాకేమన్నా
పిచ్చా....వాళ్ళ కాళ్ళలో...ముల్లు
గుర్చుకుంటే పంటితో తీస్తా.....
ప్రశ్న : మరి...వాళ్ళే తెలంగాణా ద్రోహులు
అంటారుగా...?
జవాబు : ఉద్యమం సమయంలో...లక్ష అంటాం..
ప్రశ్న : లక్ష అంటే గుర్తొచ్చింది....రామోజీ పిల్మ్
సిటీని..లక్ష నాగళ్ళతో
దున్నుతామన్నారుగా..?
జవాబు : అన్ని ట్రాక్టర్లు దొరకలా...ఎన్ని ఉన్నాయో
లెక్క వేద్దామని...కొంగరకలాన్ లో మీటింగ్
కి ట్రాక్టర్ ర్యాలీ పెట్టించా....లచ్చ రాలేదు...
ప్రశ్న : మరి తరువాత మీ ప్రోగ్రాం....?
జవాబు : ట్రాక్టర్లు లేకపోతే ఏమయింది...ఇంటింటికీ
బర్రెలు, గొర్రలు ఇచ్చాం....వాటిని అక్కడకి
తోలి రా.పిల్మ్.సిటీని స్వాదీనం
చేసుకుంటాం.
ప్రశ్న : బర్రెలు, గొర్రెలు...ఇవ్వటంలో ఆంతర్యం..?
జవాబు : ఇంకా అర్దం కాలేదా.....హ....హ... 😛😛😛😛మధు

No comments: