డెలివరీ బాయ్ మల్టీ మిలియనీర్
ఒకనాటి డెలివరీ బాయ్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్ అయ్యాడు. ఆ స్థాయికి చేరడానికి ఆయనలో సహనం.. పట్టుదలే కారణం. ఇంతకీ ఎవరాయన.. అనుకుంటున్నారా… ఆయనే అంబూర్ అయ్యప్ప. వెల్లూరు జిల్లా అంబూరుకు చెందిన అయ్యప్ప.. చిరు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించాడు. అశోక్ లేల్యాండ్‌లో అప్రెంటిస్‌షిప్ గా పనిచేసి.. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లైట్ కొరియర్స్‌లో డెలివరీగా బాయ్‌గా జాయిన్ అయ్యాడు. అలా అతను బెంగుళూరులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. నాలుగేళ్లపాటు ఉద్యోగం చేసిన అయ్యప్ప దక్షిణ బెంగళూరుకు వచ్చే లాజిస్టిక్స్‌ను పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నాడు. ఆ సయంలోనే ఓ కోర్సు నేర్చుకోవడానికి.. పని మానేశాడు. అదే అతని జీవితాన్ని మలుపుతిప్పింది. కోర్సు పూర్తైన తర్వాత మళ్లీ ఉద్యోగం కోసం ఫస్ట్ ఫ్లైట్ కు వస్తే.. ఖాళీలు లేవన్నారు. అప్పుడే … లాజిస్టిక్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ … సరైన సమయంలో అయ్యప్పను ఉద్యోగంలో చేర్చుకుంది. దాని వ్యవస్థాపకులైన సచిన బన్సల్, బిన్నీ బన్సల్‌తో అయ్యప్పకు జోడీ కుదిరింది. మరో విషయం ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్ తొలి ఉద్యోగి అయ్యప్ప కావడం విశేషం.
తొలి ఉద్యోగిగా అయ్యప్ప జీతం.. రూ.8 వేలు. ఇప్పుడది 6 లక్షల రూపాయలు. అసోసియేట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినా ఎక్కడా హంగు ఆర్భాటాలకు పోడు. ఇప్పటికీ పాత స్కూటర్ పైనే ఆఫీసుకు వెళుతుంటాడు. అయ్యప్ప పనితీరు మెచ్చిన బన్సల్ సోదరులు.. కంపెనీ షేర్లు కూడా ఇచ్చారు. ఆ షేర్లు అయ్యప్పను … కోటీశ్వరుడిని చేశాయి. పదేళ్ల కిందట ఏ ప్రాంతంలో ఉన్నాడో ఇప్పుడూ అక్కడే ఉంటున్నాడు. తల్లి, భార్య, నానమ్మలతో కలిసి.. నివసిస్తున్నాడు. అయ్యప్ప అంటే బన్సల్ సోదరులకు ఎనలేని అభిమానం అంతేకాదు.. ఆయన ఇచ్చే సూచనలు.. సలహాలను అంతే స్థాయిలో విలువిస్తారు. కంప్యూటర్ లేకుండానే.. గడగడా లెక్కలు చెప్పేయగల సామర్థ్యం ఆయన సొంతం. పనిలోని అంకితభావమే… ఆయన్ను ఇప్పుడు మల్టీ మిలియనీర్ ను చేసింది.
No comments:
Post a Comment