maayabazar.in
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...చక్కని పాట
చూడండి నచ్చితే తప్పకుండాషేర్ చెయ్యండ
చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, వాణీ జయరాం
పల్లవి:
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
చరణం 1:
పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓహో హో హో ..నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను
చేరనా. చేరనా.. చేరనా...
చరణం 2:
విరిసిన కుసుమము నీవై కురిపించేవు
జాబిలి నేనై నిన్ను పెనవేసేను
ఓహో హో హో మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి
ఆడనా.. పాడనా.. ఆడనా...
చరణం 3:
కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి
ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ. ఉండనీ.. ఉండనీ..
Song from the divine trance both male and female versions are out of me
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది కామునికే మైకం కమ్మే యాగం జరిగినది గోపలునికే పాఠం చెప్పి యోగం దక్కింది
No comments:
Post a Comment