‘చంద్ర’జాలం…ఒక్క పూట విందు ఖర్చు..18 లక్షలు
‘వాళ్లందరూ జడ్జిలు. ఇతర ప్రముఖులు. వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ రాత్రి విందు ఇచ్చారు. అందులో వింత ఏమీ లేదు. కానీ ఆ విందుకు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా?. అక్షరాలా 18.29 లక్షల రూపాయలు. ఒక్క విందు కోసం 13, 38,720 రూపాయలు ఖర్చు పెట్టగా…ఆ 19 మంది ప్రముఖులు కూర్చునే ప్లేస్..డెకరేషన్ కోసం 4,90,705 రూపాయలు ఖర్చు పెట్టారు.’ .ఆ డెకరేషన్ లో ఏమున్నాయి అంటే సోఫాల ఏర్పాటు, డయాస్, పూలతో అలంకరణ, మైక్ లు తదితర అంశాలు. ఏమి తిన్నా కూడా ఓ ఇరవైమంది భోజనం ఖర్చు 13 లక్షల రూపాయలు అవుతుందా?. అసలే ఏపీ సర్కారు లోటు బడ్జెట్ తో ఉందని..పైసా పైసా కూడబెట్టుకుని పనిచేస్తున్నామని..చెప్పే సర్కారు కేవలం ఇరవై మందికి విందు ఇచ్చేందుకు సర్కారు సొమ్మును ఏకంగా 18 లక్షల రూపాయలు ఖర్చు చేయటం విచిత్రం.
రాష్ట్రానికి వచ్చిన అతిధులకు విందు ఇవ్వటాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ అందుకు పెట్టిన ఖర్చే అసలు విషయం. విషయం ఏమిటంటే ప్రభుత్వంలోని పెద్దలు తమ వరకూ వచ్చేసరికి ప్రత్యేక విమానాలు దగ్గర నుంచి ఎక్కడా స్టార్ సౌకర్యాలు లోటు లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఏదైనా ప్రజా సౌకర్యాలు..సమస్యలు ప్రస్తావిస్తే మాత్రం నిధులెక్కడ అని ప్రశ్నిస్తుంటారు. ఏ అంశం ఎవరు లేవనెత్తినా లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతున్నామని చెబుతారు. ప్రభుత్వ పెద్దలు చేసే దుబారా వ్యయాన్ని అరికడితే అది మరింత బాగా చేయవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
No comments:
Post a Comment