నా పేరు వైదేహి........నేను అందరి అమ్మయిలలాగానే బాగా చదువుకుని మంచి కంపెనీలో software job సంపాదించుకున్నాను......దేవుడి దయవలన నాకు మంచి భర్త.....మంచి కుటుంబం లబించింది.ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని.....పెళ్ళైన సంవత్సరానికి నాకు ఒక పాప పుట్టింది....
మెటర్నిటీ లీవు తరువాత నేను మళ్ళీ ఆఫీసుకు వెళ్ళసాగాను. మా అత్త, మామ సహకారంతో బిడ్డను వారికి దగ్గరే ఉంచి వెళ్ళేదాన్ని. మాది శాఖాహార కుటుంబం మాది.... చాలా హుషారుగా ఉండేదాన్ని......
4 సంవత్సరాల తరువాత నా మెడ దగ్గర చిన్న గడ్డలాగా ఉన్నది గమనించాను....అది ఏమై ఉంటుందో అని గూగుల్ మొత్తం వెతికాను.....ఏ కారణాల వలన అలా వొస్తుంది అని.............కొద్దిరోజులతరువాత బాగా జ్వరం రాసాగింది. ఇక ఆలస్యం చేయకూడదు అని మా ప్యామిలీ డాక్టరు దగ్గరికి వెళ్ళాను. నా గురించి నా శరీరతత్వం గురించి బాగా తెలిసిన డాక్టరు నిర్లక్ష్యం చేయకుండా అన్నీ టెస్టులు చేయించుకొమ్మని అపోలో హాస్పిటలుకు వెళ్ళమని చెప్పారు...... అన్నీ టెస్టులు చేసాక నాకు cancer second stage లో ఉందని చెప్పారు...నా భర్త, అత్త మామలు అమ్మ అందరూ విపరీతంగా ఏడ్చారు.........అప్పుడు డాక్టరుగారు వారిని ఓదార్చి నాకు మంచిగా ధైర్యాన్ని ఇవ్వండి అదే సగం జబ్బును తగ్గిస్తుందని చెప్పారు............నిజంగా ఆ మాయదారి జబ్బుకు చికిత్స చాలా కష్టమే..........కీమోథేరపీ చేసి నందువలన నాకు జుట్టంతా పోయి అందవికారంగా తయారయ్యాను. అద్దంలో చూసుకుని నేనే చాలా భయపడ్డాను......ఎవరు ఇంటికి చచ్చినా వాళ్ళకు నా మొహాన్ని చూపించేదాన్ని కాదు. ఆ సమయంలో నాకు గుండు చేయించారు.......నా భర్త నాకు దేవుడిచ్చిన వరం......నేను బాధపడకూడదని తను కూడా గుండు చేయించుకుని నాలో చాలా ధైర్యాన్ని పెంచారు, నా అత్తమామలు నిజంగా నన్ను ఓ బిడ్డలానే చూసుకున్నారు..... ఇవన్నీ ఎందుకు చెపుతున్నాను అంటే ప్రతి ఒక్కరికీ బాధలనేవి ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో బాధ...........కానీ వాటికి కృంగి పోకుండా ధైర్యంగా ఎదురుకోవాలి.......దానికి మన చుట్టూ ఉన్నవారి చల్లని మాటలు........ఆప్యాయతలు బాగా దోహదం చేస్తాయి..... ఆ జబ్బు ఉందని తెలియగానే భయపడి ఇంకా కృంగిపోకుండా ఉండాలంటే కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది..........
ఇప్పుడు నాకు జబ్బు దాదాపు నయమైంది........కానీ నాకు నా భర్త , అత్త మామలు అమ్మ చేసిన సేవలు నా జబ్బు నయంకావడానికి ఓ కారణం అనే చెపుతాను....... దయచేసి ఏవైనా జబ్బులు వస్తే కోడలైనా,కూతురైనా ఎవరైనా సరే మీరు వారికి ధైర్యాన్ని అందించండి. అవే సగం జబ్బు తగ్గడానికి దోహదం చేస్తాయి.........నా కుటుంబ సభ్యులు అందించిన సహకారంతో మరో 2 నెలల్లో సీతాకోక చిలుకలాగా మీ ముందుకు వస్తాను. ఇలాంటి ఆత్మవిశ్వాసాన్ని మీరందరూ మీవారిమీద చూపండి......మా కుటుంబ సభ్యులకు డాక్టర్లకు నా హృదయపూర్వకమైన పాదాభివందనాలతో............మీ వైదేహి.......... ఇది చదివిన ప్రతి ఒక్కరూ మనలో ఎంతో మంది అనేక జబ్బులతో బాపపడతున్నారు. మీ ఇంట్లోవారే మొదటి చికిత్సగా మారాలి........
No comments:
Post a Comment