Thursday, 16 November 2017

మారిపోవురా కాలము-మారుట దానికి సహజమురా:
ఇది పూర్వ కాలము నాటి ఓ తత్త్వం అయుండవచ్చు.. కానీ షావుకారు చిత్ర పాటల రచయితగా టైటిల్స్ లో సముద్రాల వారి పేరు వుంది.. వారుఈ తత్వాన్ని సంగ్రహించి కొన్ని మార్పులు చేసి ఉండవచ్చు. అద్భుతమైన తత్త్వం కాలం తీరు గూర్చి ఎంత బాగా చెప్పబడిందో?
మారిపోవురా కాలము
మారుట దానికి సహజమురా...
మారిపోవురా కాలం! మారిపోవురా!!
ఉదయాస్తములు పగలూ రేయీ
వెలుగు చీకటీ ఎండా వానా
నెలలు ఋతువులు వత్సరములుగా
చక్రములోని ఆకుల తీరున
దొరలిపోవురా కాలము
దొరలుట దానికి సహజమురా...
దొరలిపోవురా! కాలము
మ్రోడులు చివురించునురా!
పూవులు పిందెలు నించునురా!
బోసిచెన్నభువి పులకరించురా.!
బంగరు పంటల తాండవించురా!
మారిపోవురా కాలము
మారుట దానికి సహజమురా
మారిపోవురా కాలం! మారిపోవురా!

No comments: