Sunday, 19 November 2017

🔹 మున్నూరుకాపు కులం ఎలా ఆవిర్భవించింది అసలు మున్నూరుకాపు అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం..
🔹 మున్నూరుకాపు రెండు పదాల కలయిక - మున్నూరు అంటే 300 అని అర్ధం మరియు కాపు అంటే భూమిని కాపాడేవాడు ( Protector of the Land ) అని అర్ధం.
🔹 ఈ రెండు పదాల అర్ధాలు కలిపితే మున్నూరుకాపు చరిత్ర క్షున్నంగా తెలుస్తుంది. మున్నూరుకాపు అనేది కాపు కులానికి ఉపకులం ( Subcast )
🔹 ఇది దక్షిణ భారతదేశములోనే మొదటి వ్యవసాయ ఆధారిత కులం. మున్నూరుకాపు తెలంగాణలోనే అతిపెద్ద కులం, ఇది తెలంగాణ రాజకీయాలను శాశించగలదు.
🔹 తెలంగాణ జనాభాలో 24% ఉంది అంటే 100 మందిలో 24 మంది అన్నమాట. మిగతావారితో పోలిస్తే మున్నూరుకాపులు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవారే..
🔹 ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం..
🔹 అది కాకతీయ రాజుల పరిపాలన చివరి సమయం ముస్లిం సామంత రాజులు కాకతీయ సామ్రాజ్యం పైన నిరంతరం శత్రుదాడులు జరుపుతున్నారు.
🔹 కాకతీయ రాజులకి ముస్లిం సామంత రాజుల పద్ధతులు మరియు వారు అనుసరించే యుద్ధనీతి కొత్తది. అప్పటి వరకు వారు అలాంటివారితో యుద్ధం చేసిందిలేదు, చేసేదేమిలేక తంజావూరు ( ప్రస్తుత తమిళనాడు ) పాలకుల సహాయం కోరారు.
🔹 తంజావూరు పాలకులు అప్పటికే యుద్ధంలో విజయం సాధించివున్నారు కాకతీయులు అడగగానే వారు అప్పటికే యుద్ధంలో మంచి వ్యూహాత్మకత ప్రదర్శించిన 300 మంది సైనికులను హైదరాబాద్ రాష్ట్రము పంపారు. ( ప్రస్తుత వరంగల్ హైదరాబాద్ రాష్టంలో భాగము )
🔹 అలా వచ్చిన 300 మందిని సంస్థానం అని పిలిచేవారు. ఆ 300 మంది వారి కుటుంబాలతో కలసిరావడం జరిగింది. అలా వచ్చిన 300 మంది యుద్దములో కాకతీయ పాలకులకి సహాయం చేయడం జరిగింది.
🔹 యుద్ధంలో ముస్లిం సామంత రాజులను ఎదురించి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడారు.
🔹 యుద్ధం అనంతరం వారు వరంగల్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో జీవించసాగారు, అలా వారి సంస్థానాలు వరంగల్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో వ్యాప్తి చెందడం జరిగింది.
🔹 అలా కాకతీయ సామ్రాజ్యం ముగిసిన తర్వాత వారి సంస్థానాలు రెట్టింపై వారు వరంగల్ లో ఒక బలమైన శక్తిగా ఎదిగారు.
🔹 ఈ సమయంలోనే వారిని మున్నూరుకాపు అని పిలవడం జరిగింది ఎందుకంటే వారు 300 మంది వచ్చి వారికోసం కాపుకాసి శత్రువుల నుండి వారిని వారి భూమిని కాపాడారు కాబట్టి ఈ కులాన్ని మున్నూరుకాపు కులం అని పిలవడం జరిగింది.
🔹 మున్నూరుకాపులు 1947 వరకు ముందువరుసలో ఉండి స్వతంత్ర పోరాటాన్ని నడిపించారు.
🔹 నిజాం పరిపాలకులకి వ్యతిరేకంగా పోరాడారు.
🔹 మున్నూరుకాపులు హిందూవాదులు, వారిని పల్లెటూర్లలో పటేలా అని పిలవడం జరుగుతుంది.
👊 జై మున్నూరుకాపు.. 👊 జై జై మున్నూరుకాపు..
No automatic alt text available.



No comments: