శివా ! అనంతమైన కాలంలో
మా వ్యధలను వెతలను
నీ గొంతులో గరళంగా పట్టి ఉంచావు
నీ మౌనం వెనుక నీ కరుణ గానం నేను వినలేదు
నీ హిమ గిరి కన్నా నీ దయ ఇంకా చల్లనిది
నీ ఢమరుక ధ్వని వెనుక
నా అహంకారాల గోల వినపడకుండా చేశావు
నా దుశ్చర్యలపై నీ ఆనంద తాండవ మర్ధన గమనించలేదు
నీ రెండు కళ్లనే చూశాను కానీ నీ ముక్కన్ను నుండి
నా కోసం జాలు వారే కన్నీటి చుక్కను చూడలేదు తండ్రి !
నా కోసం నీవు ఒక్కడివే ఉన్నావనే ధైర్యం
చాలు శివా ! నీ దయ

No comments:
Post a Comment