Sunday, 26 November 2017


భక్తులకు తీర్థమిస్తున్నారు. ఒక
ఇల్లాలు తన కుమార్తెను, అయిదేండ్ల
పిల్లను వెంటబెట్టుకుని తీర్థం
పుచ్చుకోవడానికి వచ్చింది.
స్త్రీలందరూ ఒక ప్రక్కగా,
పురుషులొక ప్రక్కగా నిలబడి, తీర్థం
పుక్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ
సందడిలో ఆ పిల్ల మెళ్ళో ఉన్న బంగారు
గొలుసు కాస్తా, ఏ పుణ్యాత్మురాలో
తస్కరించి దాచేసింది.
గొలుసు పోగొట్టుకున్న పిల్ల
ఏడవసాగింది. అమ్మలక్కలంతా ‘అయ్యో
గొలుసు పోయిందా!’ అంటూ పిల్లనూ,
తల్లినీ ఊదారుస్తున్నారు.
తక్కిన స్త్రీలందరితో పాటు ఆ పిల్ల తల్లి
కూడా తీర్థం పుచ్చుకునేందుకు
వరుసలో నిలబడింది. స్వామిని
సమీపించింది. తక్కిన వారందరికీ
తీర్థమిచ్చి, ఆమెను మాత్రం వరుసలో
నుండి తప్పుకుని, ప్రక్కగా
నిలబడమన్నారు స్వామి.
స్వామి అలా ఎందుకు అన్నారో ఎవరూ
ఊహించలేకపోయారు. ఇంతలో ఒక
ముసలావిడ తీర్థం తీసుకోవడానికి స్వామి
దగ్గరకు వచ్చి చెయ్యి చాపింది.
ఆమెను ఉద్దేశించి స్వామి,
‘ఇచ్చేసెయ్యి’ అన్నారు.
“నా దగ్గరేముంది ఇవ్వడానికి?” అన్నదా
ముసలమ్మ.
”ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు
మూటకట్టుకుంటావు?” అన్నారు
స్వామి.
ఆ మాటలు విని కొందరు ఆడవారు చీరె
విదిలించమన్నారు. పరిశీలించగా చీరె
మడతల్లో దాచిన బంగారం గొలుసు
బయటపడ్డది. దాన్ని తీసి స్వామి వద్ద
పెట్టారు.
గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలిని స్వామి
దగ్గరకు పిలిచారు. తీర్థం ఇచ్చారు.
ఇలా అన్నారు -
”అదిగో నీ గొలుసు తీసుకో. ఇక నుంచి
మాత్రం చెయ్యవద్దన్న పని
చెయ్యకు” అన్నారు స్వామి.
”ఇకమీదట ఎప్పుడూ అట్లా చెయ్యను
స్వామీ” అంటూ చెంపలు వేసుకుని ఆ
గృహిణి, పమిట కొంగుతో కన్నులు
తుడుచుకుంది.
ఏమిటా ఇల్లాలు చేసిన తప్పు
ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమాస్తా
ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి
టైము తప్పకుండా వెళ్ళాలి. తనకు
అన్నం వడ్డించి తరువాత పూజకు
వెళ్ళమని భార్యతో చెప్పాడు.
కాని, పూజకు ముందుగా పోవాలని
తొందరపడి, ఆదరాబాదరాగా అన్నం వండి,
అక్కడ పడేసి, పిల్లను తీసుకుని గబా గబా
బయలుడేరి వచ్చింది ఇల్లాలు.
“తీర్థం మీద నీకెంత శ్రద్ధ ఉన్నా నీ
ధర్మాన్ని నీవు వదలి పెట్టకు, నీ భక్తి
కంటే అది అధికమైంది” అని ఆమెకు
బోధపడింది.
ఎంతటి స్వల్ప విషయంలో నైనా తమ
కర్తవ్య నిర్వహణలో స్త్రీలూ,
పురుషులూ అప్రమత్తులుగా
ఉండడం అవసరమని బోధిస్తారు స్వామి.
--- నీలంరాజు వెంకటశేషయ్య గారి
"నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో.
LikeSho

No comments: