Friday, 17 November 2017

L Vsn Kumar
 · 
WhatsApp sharing
మంత్రాలు ఎందుకు మనకు అర్ధం కాదు – నాస్తికులే కాదు ఆస్తికులు కూడా అడిగే ప్రశ్న
చాలా మంది, పరాయి మతాల వాళ్ళు, నాస్తికులు వీరే కాక మన ధర్మంలోని వారు కూడా తరచుగా అడిగే ప్రశ్న. ఆ బ్రాహ్మణులేదో మామూలు అర్ధం కాని మంత్రాలు సాగతీస్తూ ఏదో చదివేస్తూ క్రతువులు చేస్తుంటారు. తద్వారా వారి ఆధిపత్యం చూపించుకుంటూ వుంటారు ,అంతే కాదు వీటి ద్వారా మిగతా వారిని అణగదొక్కేస్తున్నారు అంటూ ఎందరో కమ్యునిస్టులు, మతమార్పిడి బురిడీ గాళ్ళు జనాలందరిలోను అనవసరపు అనుమానపు బీజాలు నాటారు. అన్యాయంగా మన మతం మీద విషం జల్లుతున్నారు. దీనిని మనం సమర్ధవంతంగా తిప్పి కొట్టాలంటే మనం సప్రామాణికంగా ఈ విషయం కొంత తార్కికంగా చర్చించుకుందాం
మనకు ఏమైనా ఒంట్లో కొద్ది నలతగా ఉందనుకుందాం. ఒక వైద్యుని సంప్రదిస్తే అతడు మన రోగానికి కారణం నిర్ధారించి కొన్ని మందులు ఇస్తారు.
మనం మారు మాట్లాడకుండా ఆ చీటీ తీసుకు వెళ్లి ఒక మందుల షాప్ లో ఆ మందులు తీసుకుని వేసుకుంటాం. రోగం తగ్గి తిరిగి స్వస్థత చేకూరుతుంది.
అంతే కానీ ఈ డాక్టర్ తన ఉద్యోగాన్ని జాగ్రత్తగా ఉంచుకోడం కోసం మనకు ఆ combination చెప్పట్లేదు అని ఎవరైనా గోల చేస్తారా?
పోనీ అలాగే ఆ ప్రిస్క్రిప్షన్ ఉందనుకుందాం. అప్పుడు ఇలా వుంటుంది
ACL Amoxicillin 250 mg, Cloxacillin 250 mg, Lactobacillus sporogenes 60million. – dosage 4 (2 days)
Fml-T:Fluorometholone 0.1, %, tobramycin 0.3 %, benzalkonium chloride 0.005 % -dosage 6
అన్నారనుకోండి. ఇటువంటి ప్రిస్క్రిప్షన్ అర్ధం చేసుకోవడానికి సరైన మెడికల్ షాప్ వుండాలి.
కానీ ఎవరూ ఇలా అడగరు. డాక్టర్ గారిచ్చినది మారు మాట్లాడకుండా ఆ మందుల మీద నమ్మకంతో ఆయన చెప్పినన్ని రోజులు వాడతాం. స్వస్థత పొందుతాం. అంతే తప్ప ఇటువంటి పిచ్చి వాదనలు చెయ్యము. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం తీసుకుంటాం. అలాగే మన స్కూటర్ కానీ కార్ కానీ పాడయిపోతే వాటిని బాగు చేసుకోవడం తెలిసిన వారు బహు అరుదు. ఆ మెకానిక్ దగ్గరకు వెళ్లి బాగు చేయించుకుంటాం.
“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” – ఏ మంత్రం దేనికి వాడాలో కొన్ని ఏళ్ళు సుశిక్షితులైనపండితులు మనకు బ్రహ్మలగా వచ్చి మనకోసం దేవతలను ఆహ్వానించి మనకు అనుకూలంగా వారిని తృప్తిపరిచే మంత్రాలు చదువుతారు. ఇంతకు ముందు టపాలో చెప్పుకున్నట్టు ప్రతీ మంత్రానికి ఒక నిర్దుష్టమైన స్వరం, దాత్త, అనుదాత స్వరాలతో సరిగ్గా పలకాలి. దానికి ఎంతో శ్రమ, శ్రద్ధ, ప్రయాస అవసరం. ఆ మంత్రం దేవభాష సంస్కృతంలో ఎప్పుడో మన ఋషులు దర్శించి మనకు అందించారు. వాటిని ఎంతో శ్రద్ధతో నేర్చుకుని మనకోసం మన తరపున పూజలు చేస్తారు అయ్యవార్లు. దాని అర్ధం మనకు అర్ధం కాకపోయినా ఫరవాలేదు, ఆ మంత్రరాశి చెయ్యవలసిన సుకార్యం చేస్తుంది. కావలసినదల్లా చేసే క్రతువు మీద, చేయించే పండితుని మీదా నమ్మకం. ఒక డాక్టర్ మీద నమ్మకంతో మనం ఎలా మందు వేసుకుని తరిస్తామో, అలాగే ఆ మంత్రం చదివే పురోహితుని మీద అతడు ఉచ్చరించే మంత్రం మీద గురి వుండాలి. అప్పుడు తప్పక మనకు లబ్ది చేకూరుతుంది.
మరి మేము చదువుకోకూడదా అవి అంటే, గురు ముఖం ద్వారా మంత్రం గ్రహించని వారు చదవగలిగిన, చదవవలసిన స్తోత్రాలు ఎన్నో మనకు ఋషులు, గురువులు అనుగ్రహించి వున్నారు. వాటిని చదివి మనం తరించవచ్చును. కానీ కొన్ని కొన్ని క్రతువులలో, వ్రాతాలలో, ప్రత్యేక పూజలలో మంత్రాల తంత్రాల ద్వారా చెయ్యవలసిన హోమాది తపాలలో ఆ మంత్రాన్ని క్షుణ్ణంగా చదివి నేర్చుకున్న వారి ద్వారా మంత్రమే చేయించుకోవాలి. గుఱ్ఱం చెయ్యవలసిన పనిని గుర్రమే చెయ్యాలి. ( ఇక మిగిలినది పూరించను )
మరొక గమనిక: నేను నీ మీద నీళ్ళు చల్లుతాను. నువ్వు పాపివి. పరలోకమునున్న ప్రభువా ఈ జీవుడిని నీ దయ ప్రసరిమ్పుడి. ఇటువంటి పనికి మాలిన మాటల వల్ల ఇంటి పక్కనున్న కుక్క కూడా కదలదు.
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

No comments: