వీరు డొక్కా సీతమ్మ గారు. గోదావరి జిల్లా లో వుండేవారు. తమ ఇంటికి ఎంతమంది వచ్చినా వారికి కడుపు నిండుగా భోజనం పెట్టె వారుట..
ఆ రోజుల్లో బ్రిటిష్ రాణి గారు ఈవిడ గారి గుంరించి విని తన పట్టాభిషేకం సమయానికి సీతమ్మ గారిని తీసుకు వెళ్లాలని అలోచించారు. కానీ సీతమ్మ గారు సముద్రం దాటి వెళ్ళరు కనుక, గోదావరి జిల్లా కలెక్టర్ ను సీతమ్మ గారి గ్రామానికి పంపి, ఆమె ఫోటో లండన్ పంప మని కలెక్టర్ ని ఆదేశించారు.
కలెక్టర్ గారు సీతమ్మ గారి వద్దకు వెళ్లి ఆమె ఫోటో కోసం అడిగితే వల్ల కాదన్నారు ఆమె. అప్పుడు కలెక్టర్ గారు ఆవిడ కాళ్ళ వెళ్ళా పడి, అమ్మా మీరు నాకు ఫోటో ఇవ్వకపోతే నా వుద్యోగం ఊడుతుందని చెప్పటంతో సీతమ్మ గారు ఫోటో తీయించుకున్నారు.
ఆ విధంగా సీతమ్మ గారి ఫోటో బ్రిటిష్ రాణి వద్దకు లండన్ చేరింది. రాణి తన పట్టాభిషేకం రోజు సీతమ్మ గారి ఫోటో ప్రక్కనే ఉంచుకుని పట్టాభిషేకం చేయించుకున్నారుట.
అంతటి పేరున్న అన్నపూర్ణ మాత ను తలచుకోవటం ఆమె ఫోటో చూడగలగటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. మిత్రులు చాలా అంది యీ ఫోటో చూసిఉండరు. అందరూ తిలకించి ఆమె ఆశీర్వాదం పొందుదాం..!!💐
No comments:
Post a Comment