ఎలాంటి దయనీయ స్థితి లో ఉంది సమాజం.. దైవ సమానులు, 69వ పీఠాధిపతి, పరమాచార్యుల వారి ప్రియ శిష్యులు, కంచి ఆచార్యుల వారు, శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు శివైక్యం చెందారు అన్న విషయం గురించి ఉత్సాహం చూపించని జాతీయ మీడియా ఒక నటి అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారం కోసం ఇంతటి అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది.. నిజంగా సిగ్గుచేటు.. మానవాళి కోసం, విశ్వ శాంతి కోసం ఆచార్యుల వారు చేసిన విశేష కృషి అనంతం.. కంచి కామకోఠి ఆస్పత్రులు, నేత్ర వైద్యశాలలు, నామమాత్రంగా రుసుము తీసుకునే విద్యాసంస్థలు, ఆయన చేసిన మహా మంచి పనులకు లెక్క కట్టటం కూడా కష్ట సాధ్యమైన పని అంటే అతిశయోక్తి కాదు.. సాధారణ మనుషులు, నటీనటులు ఆయనకు పాదాభివందనం చేయటం కోసం వేచి ఉంటారు. అలాంటి ఒక ఉత్తమోత్తములకు, శిఖరాగ్రం అయినటువంటి మహా మనీషి కి మీడియా ఇస్తున్న గౌరవం చూసి సిగ్గు పడాల్సి వస్తోంది..
ఆయనకు ఎవరు ఎంతటి మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన విలువ మాత్రం ఎపుడూ అలానే నిలిచి ఉంటుంది.. అది ఆచంద్రతారార్కం.. అలాంటి ఒక గురుతుల్యులకు, భగవత్సమానులకు అంజలి ఘటిస్తూ కన్నీటి వీడ్కోలు..
జయజయ శంకర హరహర శంకర
జయజయ శంకర హరహర శంకర
జయజయ శంకర హరహర శంకర
జయజయ శంకర పాలయమామ్
జయజయ శంకర హరహర శంకర
జయజయ శంకర హరహర శంకర
జయజయ శంకర పాలయమామ్
No comments:
Post a Comment