ప్రపంచానికి తెలియని శ్రీదేవి కన్నీటి జీవితాన్ని ,కష్టాలను రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు..అందిరికి కన్నీళ్లు పెట్టించాడు..శ్రీదేవి మరణించిన వార్త తెలియగానే ఆమె అభిమానులకు ,సినీ ప్రేక్షకులకు మొదట గుర్తు వచ్చింది రామ్ గోపాల్ వర్మ..చాల మంది వర్మ రియాక్షన్ కోసం ఎదురు చూసారు,చూస్తున్నారు..ఎందుకంటే రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి పైన ఉన్న అభిమానం ,ప్రేమ అటువంటిది మరి..అలాంటి వర్మ శ్రీదేవిని ఉద్దేశించి ఆమె అభిమానులకు ఒక్క అభిమానిగా ఒక్క ప్రేమ లేఖ రాసాడు..ఎన్నో విషయాలను కుండా బద్దలు కొట్టాడు..
ఆయన రాసిన ఉత్తరం చదివి ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నాము ,రామ్ గోపాల్ వర్మకి కూడా మనసు ఉంది ,ఈ ప్రపంచంలో శ్రీదేవి ని నీకన్నా ఎవరు ప్రేమించలేరు అంటూ ఆయనని ప్రశంసలతో సినీ అభిమానులు ముంచెత్తుతున్నారు..ఆయన అంటే గిట్టనివారు కూడా వర్మ ఈజ్ గ్రేట్ అంటున్నారు..గుండెల్ని తాకేలా రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి అభిమానుల కోసం రాసిన ప్రేమ లేఖ మీకోసం
“నేను రాసే ఈ ఉత్తరం లో కొంతమంది పేర్లను ప్రస్తావించ రావడంతో ఇది రాయాలా వద్ద అనే విషయం పై విపరీతమైన అంతర్యుద్ధం జరిగింది..కానీ శ్రీదేవి అందరికంటే ఎక్కువగా అభిమానుల సొంతం అని నేను భావిస్తున్న..కాబట్టి శ్రీదేవి అభిమానులకు ఆమె జీవితం లో చోటు చేసుకున్న నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది..శ్రీదేవి అభిమానుల కోసం నా ప్రేమ లేఖ….శ్రీదేవి ఎప్పటికి ఒక్క అందమైన ,ఆకర్షనీయమైన మహిళా అని కోట్ల మంది ఎలా అనుకుంటున్నారో ,నేను కూడా అలాగే భావించాను..మనకందరికీ తెలుసు ఆమె దేశంలోనే అతి పెద్ద సూపర్ స్టార్..
20 సంవత్సరాల పాటు హీరోయిన్ గా వెండితెరను శాసించింది..ఇది ఆమె జీవిత కధలో ఒక్క భాగం మాత్రమే..శ్రీదేవి మరణించింది అనే వార్త తెలియగానే నేను షాక్ అయ్యాను మరియి బాధపడ్డాను..కానీ వెంటనే నాకు మరోసారి స్ఫురించింది ఏమిటి అంటే ఈ ప్రపంచం లో పుట్టుక మరియు చావు అనేటిది ఎంతో ఊహాతీతంగా ,కర్కశంగా ,అంతుచిక్కనిదిగా ఉంటాయో శ్రీదేవి జీవితం తో మరొక్కసారి రుజువు అయింది.
ఆమె మరణం తర్వాత మీలో చాల మంది ఆమె మరణం గురించి ,ఆమె అందం ,అభినయం గురించి,ఆమె చావు ఎలా ప్రభావితం చేస్తోంది అనే విషయం పై వివిధ విధాలుగా చర్చించుకుంటున్నారు..అంతకు ఇంచి చెప్పాల్సిన విషయాలు న దగ్గర చాలానే ఉన్నాయ్..నేను ఆమెతో పని చేసింది రెండు సినిమాలే కావొచ్చు,కానీ ఆమెను అతి దగ్గర నుండి చూసే అదృష్టం దొరికింది..ఆమె సెలబ్రిటీ జీవితం ,వృత్తి పరంగా ,వ్యక్తిగతం పరంగా ఎంత విభిన్నంగా ఉంటుంది ,కానీ బయట ప్రపంచం వీటిని ఎలా అర్థం చేసుకొని ,అన్వయించుకొంటోంది అని తెలియ చేయడానికి శ్రీదేవి జీవితం ఒక్క ఉదాహరణ..
మంచి భర్త,ఇద్దరు అందమైన కూతుర్లు ,ఆనందకరమైన కుటుంబం,ఇదే శ్రీదేవి జీవితం..ఇంతకు మించి ఎవరు మాత్రం ఏమి కోరుకుంటారు ??శ్రీదేవి ఎంత అనందం గ ఉంటుందో అని అందరూ అనుకుంటూ ఉంటారు..కానీ అసలు ప్రశ్న ఏమిటి అంటే శ్రీదేవి నిజంగా ఆనందంగా ఉందా??ఆనందకరమైన జీవితం గడిపిందా ??తన తండ్రి చనిపొయ్యేవారుకూ శ్రీదేవి ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వతంత్ర జీవితాన్ని గడుపుతూ ఆనందంగా బ్రతికింది..కానీ ఆ తర్వాత వాళ అమ్మ అతి జాగ్రత్త వల్ల పంజరంలో పక్షిలా మారిపోయింది
ఆ కాలం లో టాక్స్ కి బయపడి చాల మంది నటులకు బ్లాక్ మనీ రూపంలోనే పారితోషికం ఇచ్చే వాళ్లు..శ్రీదేవి తండ్రి ఈ డబ్బు అంత స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకి ఇచ్చాడు..ఎప్పుడైతే ఆయన మరణించారో ఆయన డబ్బులు తిరిగి చెల్లించకుండా ముఖం చాటేశారు..దీనికి తోడు శ్రీదేవి అమ్మ అమాయకురాలు కావడం తో ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయారు..బోనికపూర్ శ్రీదేవి జీవితంలోకి వచ్చేసరికి శ్రీదేవి దగ్గర అసలు డబ్బు లేదు..
ఆ సమయం లో బోణి కపూర్ దగ్గర కూడా డబ్బు లేకపోవడం గమనార్హం.. కేవలం శ్రీదేవి ఏడిస్తే తన బుజాని మాత్రమే ఆసరాగా ఇవ్వగలిగే స్థితిలో అప్పుడు బోణి కపూర్ ఉన్నాడు..అమెరికాలో జరిగిన ఒక్క తప్పుడు సర్జరీ వల్ల శ్రీదేవి తల్లి మతి భ్రమించింది..దీనికి తోడు శ్రీదేవి చెల్లి శ్రీలత ,ఆమె దగ్గర బంధువుతో లేచిపోయి వివాహం చేసుకుంది..శ్రీదేవి తల్లి మరణించే ముందు..ఆస్తులంటిని శ్రీదేవి పేరు పై రాసింది..కానీ శ్రీలత తన తల్లిని,శ్రీదేవి మోసగించి ఆస్తులని కొట్టిసింది అని కోర్టుకి ఎక్కింది..
ఈ ప్రపంచం లో కోట్ల మంది కోరుకునే యువతి ఆ సమయంలో చివరికి ఒంటరిగా మిగిలింది..చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఉన్న శ్రీదేవికి బోనీ కపూర్ ఆసరాగా కనిపించాడు..బోణి కపూర్ తల్లి శ్రీదేవిని కాపురాలని కూల్చే వ్యక్తిగా కనిపించింది..బోణి కపూర్ మొదటి భార్య మోనా కి శ్రీదేవి మోసం చేసింది అనే ఉద్దేశం తో ఒక్క ఫైవ్ స్టార్ హోటెల్లోనే అందరి ముందు కడుపులో కొట్టింది బోణి కపూర్ తల్లి..ఇంగ్లీష్ – వింగ్లిష్ సినిమా విడుదల అయ్యేవరకు కూడా ఆమె ఒక్క సంతోషం లేని జీవితం ని గడిపింది.
వ్యక్తిగత జీవితంలో విపరీతమైన ఒడిదుడుకులు ,భవిష్యత్తు గురించి బెంగ, వ్యక్తిగత జీవితం లో చోటు చేసుకుంటున్న ఊహించని మలుపులు ఈ సూపర్ స్టార్ శ్రీదేవి మెదడుని విపరీతంగా ప్రభావితం చేసాయి..దీనితో ఆమెకి శాంతి కరువు అయింది..చిన్నపాటి నుండి బాలనటిగా జీవితం ప్రారంభించడం వల్ల ఆమె జీవితం ఇప్పుడు సాధారణంగా గడపలేదు..బయట ఆమె ప్రవర్తన కంటే,లోపల ఉన్న ఆమె వ్యక్తిత్వం ఆమెను ఎంతగానో కృంగతీసేది..
దీనితో ఆమెను ఆమె ఎల్లపుడు తరుచు చూసుకునేది..ఆమెను ఒక్క అందగత్తెగా ఎంతో మంది ప్రజలు చెప్తారు..ఆమె కూడా తన అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది..వయసు పెరుగుతున్న కూడా ఆనందంగా ఉండాలని భావించి విపరీతమైన కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది..దాని ప్రభావం మాకందరికి కనపడ్డాయి…ఆమె లోపల ఏమి జరుగుతుంది అనే విషయం ఎవరికీ కనపడకుండా ఉండేదానికి తన చుట్టూ ఎవరికీ కనపడని గోడ కట్టుకుంది..తన అభద్రతా బావాలు ఎవరికైనా తెలిసిపోతుంది ఏమో అని విపరీతంగా భయపడేది..ఇదంతా ఆమె తప్పు కాదు..ఎందుకంటే చిన్నప్పటి నుండి స్వతంత్రంగా ఎలా బ్రతకాలి ఎన్ అవకాశం ఆమెకి రాలేదు..
ఆమె కెమెరా ముందే కాదు కెమెరా వెనుక కూడా నటించేది..శ్రీదేవి ఇప్పుడు వేరేవాళ్ళ ఆలోచనల కోసం మాత్రమే బ్రతికింది కానీ..తన ఆశలు,ఆలోచనలు కోసం ఎప్పుడూ బ్రతకలేకపోయిది..శ్రీదేవిని చూస్తే ఒక్క స్త్రీ శరీరంలో ఒక్క చిన్నపిల్ల ఏమైనా చిక్కుకుందా అనిపిస్తోంది..జీవితంలో ఆమె ఎదురుకున్న చేదు అనుభవాలు ,ఆమె జీవితాన్ని మార్చేశాయి..నేను మాములుగా ఎవరికి “REST IN PEACE ” అని చెప్పను కానీ శ్రీదేవి విషయంలో “REST IN PEACE ” అని చెపుదాం అనే అనుకుంటున్నాను
ఆమె జీవితంలో చనిపోయిన తర్వాత మొట్టమొదటి సారి ప్రశాంతంగా ఉండే అవకాశం దక్కింది..నా వ్యక్తిగత అనుభవం తో చెప్తున్నాను..ఆమె కెమెరా ముందు ఒక్క నటిగా నటించినప్పుడే,ఎంతో ప్రశాంతంగా ఉండేది..ఇంకా ఎప్పటికి శ్రీదేవి ప్రశాంతంగానే ఉంటుంది..ఎందుకంటే ఎప్పుడూ ఆమె అన్ని భాదలు ,బాధ్యతలకు దూరం అయిపోయింది..నిన్ను ఇంత క్షోభ పెట్టిన ప్రపంచం ఎప్పటికి శాంతంగా ఉండదు..అభిమానులం అయినా మేము,మీ కుటుంబ సభ్యులు నిన్ను చిన్నపాటి నుండి బాధపెట్టాము..కానీ నువ్వు ఎప్పటికి మాకు ఆనందాన్ని,సంతోషాన్ని ఇచ్చావు..నువ్వు ఇప్పుడు కల్లలు ఆనందంతో స్వేచ్ఛగా ఎగిరిరె ఒక్క పక్షిలా ఆ స్వర్గంలో ఎగురుతావు అని నమ్ముతున్నాను..
నేను పునర్జన్మల్ని నమ్మను ,కానీ ఇప్పుడు నమ్మాలి అనిపిస్తుంది…ఇప్పుడు నమ్మాలి అనిపిస్తుంది..మళ్ళీ నువ్వు ఇంకో జన్మలో వచ్చి మమల్ని మైమరపిస్తావు కదా!! ఈసారి అయినా మేము కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి,నువ్వు ఇంత అపురూపమైన దానివో తెలియచేసి..నీకు ఇంత అర్హత ఉందొ తెలిసేలా ప్రవర్తిస్తాం..ఇంకొక్క అవకాశం ఇవ్వు శ్రీదేవి..మేము నిజంగా నిన్ను ప్రేమిస్తున్నం ఇలా శ్రీదేవి గురించి రాస్తూనే ఉండగలను..కానీ నా కన్నీళ్లు ఆపుకోలేను..ఇట్లు రామ్ గోపాల్ వర్మ ” అంటూ శ్రీదేవి గురించి ప్రేమ లేఖ రాసారు రామ్ గోపాల్ వర్మ
No comments:
Post a Comment