Friday, 11 May 2018

ఆచార్య దేవోభవ...
"""""""""""""""""""""""""""""""
💡
1994 లో భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ అధికారిక పర్యటనలో మస్కట్ సందర్శించారు.
అక్కడ 3 అరుదైన సంఘటనలు జరిగాయి.
👉 (1). ఏ దేశపు అధ్యక్ష, ప్రధాన మంత్రులు వచ్చినా స్వాగతం పలకడానికి విమ్మనాశ్రయానికి రాని ఒమన్ రాజు ఆ రోజు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి విచ్చేశారు.
👉 (2).ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఒమన్ రాజు విమానం మెట్లు ఎక్కి సీట్ దగ్గరకు వెళ్లి శర్మ గారికి స్వాగతం పలికారు.
👉 (3). బయటకు వచ్చిన తర్వాత రాజు గారు డ్రైవర్ ని దిగిపోమని చెప్పి ఆయనే కార్ డ్రైవ్ చేసుకుంటూ శర్మ గారి విడిది వరకూ తీసుకెళ్ళారు.
తర్వాత విలేఖరులు అన్ని సార్లు ప్రోటోకాల్ ఎందుకు ఉల్లంఘించి ఆయనకు స్వాగతం పలికారు అని అడిగారు.
అప్పుడు రాజు గారు సమాధానమిస్తూ ఆయన *భారత రాష్ట్రపతి* అని నేను ఇవన్నీ చేయలేదు.
నేను భారత దేశంలో చదువుకున్నాను.
చాలా మంచి విషయాలు అక్కడ నేర్చుకున్నాను.
నేను పూణేలో చదువుకుంటున్నపుడు శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారు మా ప్రొఫెసర్ అని చెప్పారు.
ఇదీ... గురువుగా వుండడం వల్ల వచ్చే గౌరవం. మన సంస్కృతి నేర్పే పద్ధతి.

No comments: