Monday, 30 July 2018

Sri Bhavanalu

Image may contain: 1 person

చావలి సునీల్ కుమార్..
మీలో ఎంతమందికి తెలుసు ఈ పేరు, అసలు ఎవరో అయినా తెలుసా...
అదే మన మీడియాది దౌర్భాగ్యం...

ఒక పేద రైతు కూలి కుటుంబం లో పుట్టిన ఈ యువకుడు అంతర్జాతీయ త్రో బాల్ ఛాంపియన్..
కానీ మనదగ్గర సరిఅయిన గుర్తింపు కూడా దక్కలేదు..


కనీసం క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు అందించే క్రీడా మంత్రిత్వ శాఖలు ఏమి చేస్తున్నాయో కూడా తెలియదు..
2011లొనే శ్రీలంక లో భారతదేశం తరపున ఆడాల్సిన యువకుడు కేవలం పాస్పోర్ట్ లేకపోవడం వల్ల అక్కడ ఆడలేకపోయాడు...
ఇప్పుడు ఛాంపియన్ గా తిరిగివచ్చిన యువకునికి కనీసం స్వాగతం పలకడానికి కూడా ప్రభుత్వ తరపున కానీ మీడియా తరపున కానీ ఎవ్వరు లేకపోవడం నిజంగా శోచనీయం.

ఇద్దరు స్నేహితులు అతన్ని స్వాగతించారు ఎయిర్పోర్ట్ లో అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

అయ్యా ప్రభుత్వ అధికారులు, నాయకులు కేవలం క్రికెట్,టెన్నిస్, హాకీ మాత్రమే క్రీడలు కావు సార్లు.. కొద్దిగా ప్రోత్సాహం అందించండి మిగిలిన వాటికి కూడా...

అప్పుడే కదా ఒలింపిక్స్ లో భారత పతాకం గర్వంగా ఎగిరేది...

శుభాకాంక్షలు ఛాంపియన్ గారు.

No comments: