Thursday, 25 May 2017

#బీజేపీ అధ్యక్షుడు #అమిత్_షా గారి మాటలు ఎలా వున్నాయ్ అంటే, సంతకు వెళ్లి కాలీ సంచి ఊపుకుంటూ వస్తూ, నలుగురూ అడిగితే సంచిలో సొరచేప వుంది అని చెప్పినట్టు వుంది.
ఏటి ఈ విచిత్రమూ? మీరు అక్షరాల ఒక #లక్షా_డెబ్బయ్_వేల కోట్లు (1750000000000) రూపాయలు మా రాష్ట్రం కోసం ఖర్చు పెట్టారా? మాట్లాడితే అర్థంపర్థం ఏడాలి, #ప్రత్యేకహోదా కన్నా గొప్ప స్థాయిలో నిధులు ఇచ్చామని సిగ్గులేకుండా చెప్తున్నారు, అదేదో హోదానే ఇవ్వొచ్చుగా..... నిజంగా అంతగొప్ప స్థాయిలో నిధులు ఇచ్చి వుంటే, మా అనంతపురంలో ఇంకా కరువు ఎందుకు వుంది? మా ఉత్తరాంధ్రలో ఇంకా నిరక్షరాస్యత ఎందుకు వుంది? పోని ఇవ్వన్నీ కాదండి. మీరు ఇచ్చిన నిధులు వేటికి ఖర్చు చేసారో లెక్కలు చూపించండి, మీ దగ్గర లేకపోతే మీ మిత్రపక్షమైన #టీడీపీ వారిని చూపించమనండి. అంతేకానీ చేతావాత కానీ పిచ్చి వాగుడు వాగొద్దు.
నువ్వు ఇక్కడనుండి సమర శంఖం పూరించడం కాదు కదా, పది పైసల ఈల కూడా వేయలేవు. మీరు ఎంత గింజుకున్నా ఉత్తరాది అహంకారం ఇక్కడ కొనసాగే పరిస్థితులు మీకు కల్పియము. అయినా పొత్తులు కోసం వెంపర్లాడుతున్నారు అంటేనే అర్ధం అవుతుంది, మీకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమో లేక రాష్ట్రంలో అధికారం ముఖ్యమో అని.
జులై వరకూ దేనికి? రేపే మోడీని రమ్మనండి, వారికి కూడా ఇదే చెప్పి పంపిస్తాం

No comments: