చంద్రబాబు అమెరికా పర్యటన గుట్టు రట్టు చేస్తున్న నెటిజనులు…
మరో కారణం కూడా మీడియానే. చంద్రబాబుకు తెలియకుండానే ఆయన అనుకూల మీడియా చంద్రబాబు ప్రతిష్టను భ్రష్టుపట్టిస్తున్నది. ఒకప్పుడు ఆంధ్రుల ప్రభను దేదీప్యమానంగా వెలిగించి ఇటీవల చంద్రబాబు ఆస్థాన భజనమండలి లో చేరిపోయిన పత్రిక ఒకటి గత ఏడాది రాసిన కొన్ని బొగ్గుతునకలు ఇవి:
“చంద్రబాబు కేబుల్ కారులో ప్రయాణించారు. వెంటనే అధికారులను పిలిచి అమరావతిలో ఇలాంటి కేబుల్ కార్లను నెలకొల్పడానికి ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఇక త్వరలో అమరావతిలో కేబుల్ కార్లు రానున్నాయి. ”
“చంద్రబాబు బులెట్ ట్రైన్ లో ప్రయాణించారు. ఆ వేగానికి ఆశ్చర్యపోయారు. వెంటనే అధికారులతో సమావేశమై అమరావతిలో బులెట్ ట్రైన్స్ తిప్పడానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా అక్కడికక్కడే ఆదేశించారు. ఇక త్వరలో అమరావతి లో బులెట్ ట్రైన్స్ తిరగనున్నాయి. అమరావతి నుంచి అనంతపురానికి ఈ ట్రైన్స్ లో మూడు గంటల్లో చేరుకోవచ్చు…”
ఆలా సాగింది ఆ పైత్యం. అదొక్కటి మాత్రమే కాదు. మిగిలిన అన్నిపత్రికలు తెలుగుదేశం పార్టీకి తోకల్లా మారిపోయాయి. విదేశీ పర్యటనల్లో చంద్రబాబు ఎదో ఒకటి మాట్లాడగానే అది ఆ క్షణం నుంచే అమలైపోయినట్లు ఈ భజన మీడియా గంగవెర్రులెత్తి పోవడం, చివరకు వాటిలో ఒక్కటి కూడా అమలు కాకపోవడం, అసలు చంద్రబాబే గత పర్యటనల్లో తానూ ఏమిచెప్పారో మర్చిపోతారు. ఎందుకంటే అవి అన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఆయనకు బాగా తెలుసు. అలాగే విదేశీ కంపెనీలు భారతదేశం లో పెట్టుబడులు పెట్టాలంటే దానికి కేంద్రప్రభుత్వం లోని అనేక శాఖలు రకరకాల అనుమతులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ దాటుకుని ఆంధ్రప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రం లో భారీ పెట్టుబడులు పెట్టడం అంటే అది అసాధ్యమైన విషయం అని చంద్రబాబు కు కూడా తెలుసు. అయినా సరే, ఆయన గప్పాలు చెప్పుకోకుండా ఉండరు.. ఈ భజన మీడియా చంద్రభజనలు చెయ్యకుండా ఉండవు.
ఇదిగో పైన చెప్పబడిన కారణాల వల్లనే చంద్రబాబు విదేశీ పర్యటనలు అభాసుపాలు అవుతున్నాయి. నెటిజనులకు పంచభక్ష్య పరమాన్నాలు అందించినంత వినోదాన్ని ఇస్తున్నాయి. విగ్రహపుష్టి, నైవేద్యం నష్టి అనే సామెతను తలుపుకు తెస్తున్నాయి.
No comments:
Post a Comment