Tuesday, 4 July 2017


Bunny Reddy


నాపేరు సల్మా. నాకు 19 వ ఏట #కెప్టేన్ షాఫీక్ ఘొరి తొ పెళ్ళయింది. నాకు కాపురానికి వెళ్ళిన మొదట్లొ చాలా కష్టంగా ఉండేది, ఏందుకంటే నా భర్త ఏప్పుడూ టూర్లలొనే ఉండేవాడు. ఇంట్లొ నేనొక్క దానినే ఉండాల్సి వచ్చేది. నా పరిస్తితిని గమనించిన నా భర్త ప్రతిసారి టూరుకు వెళ్ళే ముందు, వచ్చిన తరువాత నన్ను కూర్చొబెట్టి ఆర్మీ లొ పరిస్తితులు ఏలా ఉంటాయొ, ఒక ఆర్మీ అధికారి భార్య ఏలా ఉండాలొ చెప్పేవాడు, నన్ను నేను ఏలా Strong చేసుకొవాలొ చెప్పేవాడు. అప్పట్లొ Cell Phones ఉండేవి కాదు, ఏప్పుడైనా Land Line నుండి పొన్ చేసేవాడు. అది కూడా చాలా తక్కువ సమయమే మాట్లాడటానికి వీలుండేది. అందుకని నా భర్త రొజుకొక లెటరు వ్రాస్తుండే వారు. అందులొ నాకు ధైర్యం చెప్పే మాటలే ఏక్కువ ఉండేవి. నేను రొజంగా ఆ లెటరు పదే పదే చదువుతూ కాలం గడిపే దాన్ని. తరువాత 1999లొ నా భర్తకు (కెప్టేన్ షాఫీక్ ఘొరి) శ్రీనగర్ కు ట్రాన్సఫర్ అయ్యింది. అది అత్యంత కావండతొ అక్కడికి ఫ్యామిలీలను అనుమతించరు. కావండతొ నేను నా పిల్లలను తీసుకుని బెంగళూరు నా పుట్టింటికి వెళ్ళిపొయాను.


జూన్ 28, 2001 న నాకు నా భర్త నుండి పొన్ వచ్చింది, అప్పుడతను అడవిలొ ఉన్నడట. ఏంజరిగినా నాకు ధైర్యంగా ఉండమని పదే పదే చెప్పాడు, ఒకసారి పిల్లలతొ మాట్లాడతాను పొన్ యివ్వమన్నాడు. అయితే వాళ్ళు వేరే చొటా ఆడుకొవడానికి వెళ్ళడంతొ "అర్మీ బేస్ కు వెళ్ళాక పొను చేయ్యి పిల్లలతొ మాట్లాడిస్థాను" అని చెప్పాను. రెండ్ తరువాత జూన్ 1 వతారీకున కొందరు ఆర్మీ అధికారులు, వాళ్ల భార్యలతొ వచ్చి, నన్ను కూర్చొబెట్టి నా భర్త చనిపొయిన వార్త చెప్పారు. నాకళ్ళు తిరిగి పడిపొయాను. లేచిన తరువాత నా భర్త చెప్పిన మాటలు గుర్తుకువచ్చి నాకు నేను సర్దిచెప్పుకున్నాను. సరిగా ఆరొజే ఆయన వ్రాసిన చివరి లెటరు వచ్చింది.


ఆయన చనిపొయెటప్పటికి నా వయస్సు 29 సంవత్సరాలు. అందరు రెండవ పెళ్ళి చేసుకొమన్నారు. కాని నేను అంగీకరించలేదు. చనిపొయిన సైనికుల కుటుంబాల కొసం ఒక సంస్థను ప్రారంబించాను. ఆయన యునిఫా ను ఆర్మీ నాకు యిచ్చింది. దానిని ఇప్పటి వరకు ఉతకకుందా నా గదిలొ ఉంచాను, ఏందుకంటే దానికి ఆయన శరీరం నుండి వచ్చిన చెమట అంటుకుంది, ఆ వాసన పీలుస్తూ ఆయన ఉన్న భావనకు లొనవుతుంటాను. అప్పటి ఆయన పర్సు, అందులొ డబ్బు అలానే ఉన్నాయి. ఆయన వ్రాసిన లెటర్లు రొజుకొకటి చదువుకుంటుంటాను.





No comments: