Copied Tyr Sudharshan
పద్మావతి రాజస్థాన్ లో విడుదల చేయకూడదని రాజపుత్ వారసులు వత్తిడి తెస్తున్నారు. జైపూర్ చివరి పాలకుడి మనుమరాలు శ్రీమతి దివ్యా కుమారి మాట్లాడుతూ చిత్తోడ్ ఘడ్ జోహార్ ఘట్టం అన్ని రాజవంశాలకు గర్వకారణమని కానీ ఆ విషయాన్ని మరచి రాణీ పద్మిని అల్లావుద్దీన్ ఖిల్జీపై మనసుపడ్డట్టు చిత్రీకరించారని అది దేశ చరిత్రను తూలనాడడమేనని అన్నారు.
పద్మావతి రాజస్థాన్ లో విడుదల చేయకూడదని రాజపుత్ వారసులు వత్తిడి తెస్తున్నారు. జైపూర్ చివరి పాలకుడి మనుమరాలు శ్రీమతి దివ్యా కుమారి మాట్లాడుతూ చిత్తోడ్ ఘడ్ జోహార్ ఘట్టం అన్ని రాజవంశాలకు గర్వకారణమని కానీ ఆ విషయాన్ని మరచి రాణీ పద్మిని అల్లావుద్దీన్ ఖిల్జీపై మనసుపడ్డట్టు చిత్రీకరించారని అది దేశ చరిత్రను తూలనాడడమేనని అన్నారు.
ఉదయపూర్ మేవార్ రాజవంశానికి చెందిన శ్రీ విశ్వరాజ్ సింగ్ ఈ విషయం పై ప్రధానికి లేఖ వ్రాస్తూ ఈ చిత్రం మేవార్ వంశానికి తలమానికంగా భావించే రాణీ పద్మినీని అవమానించే విధంగా ఉందని ఆరోపించారు. ఇది ప్రజల మనోభావలను దెబ్బతీసేవిధంగా ఉందని, రాజపుత్రుల చరిత్రను తూలనాడుతున్నట్లు చిత్రం నిర్మించారని ఆరోపించారు. రాణీ పద్మిని మేవార్ రాజవంశానికి చెందిన మహారాణి కానీ చిత్రనిర్మాణం విషయమై నిజానిజాలు తెలుసుకోవడానికి ఎవ్వరూ తమను కలవలేదని, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని సూఫీ కవి రాసిన కవితల ఆధారంగా చిత్రనిర్మాణం జరిగిందని ఆరోపించారు.
పద్మావతి విడుదల అడ్డుకోబోమని రాష్ట్ర హోంమంత్రి గులాబ్ చంద్ ఖాటారియా స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలోని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు పద్మావతీ చిత్రం ఇప్పటి స్వరూపంలో ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఏది ఏమైనా దేశప్రజల మనోభావాలను దెబ్బతీసే విషయంపై ప్రభుత్వం స్పందించాలి. చిత్రంలో చూపించిన విషయం ఒకవేళ నిజమైనా, ప్రజల నమ్మకంవైపు మొగ్గడమా లేక నిజాన్ని నిష్కరశంగా చెప్పడమా అన్న విషయం మీద నిర్మాత,దర్శకులు నిర్ణయం తీసుకుంటారు కానీ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శానేటిక్ వెర్సెస్ ను మన దేశంలో నిషేధించడం వెనుక ఉన్న కారణం అదే.
సంజయ్ లీలా భాన్సాలీ తాను ఈ చిత్ర నిర్మాణంపై 200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెపుతున్నారు. ఆయన తీసింది డాక్యుమెంటరీ కాదు, కమర్షియల్ చిత్రం, "పద్మావతి" గొప్ప కళాఖండం అంతకన్నా కాదు, బాజీరావ్ మస్థానీ, బాహుబలి లాంటి చిత్రాలు గొప్ప విజయాన్ని సాధించిన నేపథ్యంలో అదే బాణీలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో భాన్సాలీ మీద సానుకూల దృక్పధం చూపించాల్సిన అవసరం దేశ ప్రజలకు లేదు. ఇక, అభ్యంతరకరమైన సీన్లు తొలగించి విడుదల చేసే వెలుసుబాటు భాన్సాలీకి ఉండనే ఉంది.
No comments:
Post a Comment