ప్రభుత్వం చేసే హత్యలు
@@@
నగరం నడిబొడ్డున పది అంతస్తుల మహా నిర్మాణం జరుగుతుంది. ఒక దుర్ముహూర్తంలో ఆ నిర్మాణం పేకమేడలా కుప్పకూలుతుంది. యమధర్మరాజు ఆహ్వానం అందినవారు దానికింద కొందరు ఉంటారు. వారు వైతరణి దాటుతారు.
వెంటనే కలెక్టర్, డీజీపీ, మునిసిపల్ కమీషనర్, మరికొందరు అధికారులు, మంత్రులు అక్కడికి బిలబిలమంటూ చేరుతారు. ఆ భవనానికి అసలు అనుమతులు లేవని మునిసిపల్ కమీషనర్, కలెక్టర్ ప్రకటిస్తారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కాకుల్లా రొదచేస్తారు. బిల్డర్ ఎక్కడున్నా పట్టుకుంటామని, అరెస్ట్ చేస్తామని మంత్రివర్యులు భీషణప్రతిజ్ఞ చెస్తారు. టీవీలు కాకిగోల చేస్తాయి. అంతే... రెండురోజుల తరువాత అంతా గప్చిప్.
ఆ భవనం నగరం మధ్యన జరుగుతుంటే ఒక్క ప్రభుత్వ అధికారి కూడా దానికి అనుమతులు ఉన్నాయా? లేవా అని పరిశీలించరు. భవనం అంటే ఒకరోజులో, రెండు రోజుల్లో కట్టేవి కావు. నాలుగైదేళ్ళ సమయం పడుతుంది. ఈ నాలుగేళ్లపాటు ఒక్కడు కూడా అటు చూడలేదు అంటే మనం నమ్మేయ్యాల్సిందే. ఎన్ని లక్షలు లంచం తీసుకుని ఆ భవనం వైపు కన్నెయ్యకుండా ఉంటారు?
నాలుగు ఎకరాల్లో నగరం లోని ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో లిఫ్ట్ లో ఇరుక్కుని ఇద్దరు చిన్నపిల్లలు మరణిస్తారు. అధికారులు, కార్పొరేటర్లు, మంత్రులు, పరిగెత్తుతారు. అప్పుడు తేలేది ఏమిటంటే... అసలు ఆ స్కూలుకు అనుమతులే లేవు అని! ఆ స్కూల్ అప్పటికి పాతికేళ్లుగా నడుస్తుంటుంది. ప్రభుత్వ ఉన్నత అధికారులు కూడా తమ పిల్లలను లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించి చదివిస్తుంటారు. ఆ మరణాయలయానికి అనుమతులు లేవు అని అప్పటివరకూ ఆ అధికారులకు కూడా తెలియదు మరి. నమ్మాలి. నమ్మి తీరాలి.
కృష్ణా హారతి, గోదావరి హారతి, గంగా హారతి అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా కార్యక్రమం నిర్వహిస్తుంది. వేలాదిమంది వెర్రిజనం ఆ హారతిని చూడకపోతే నేరుగా నరకానికి వెళ్తామని, చూస్తే స్వర్గానికి వెళ్తామని భ్రమసిపడి పడవల్లో పరుగులు తీస్తారు. నిన్న విజయవాడలో ఫెర్రీ ఘాట్ నుంచి పడవలో వెళ్తూ పదహారుమంది అసువులు వీడారు. తాము కొనుక్కున్నది లాంచీ టికెట్ కాదని, పరలోకయాత్రకు టికెట్ అని ఆ అభాగ్యులకు తెలియదు.
అప్పుడు అధికారులు, మంత్రులు, రాజకీయనాయకులు పరిగెత్తుతారు. అప్పుడు తేలేది ఏమిటంటే అసలు ఆ పడవలకు అనుమతులు లేవు, పడవనడిపేవాడికి లైసెన్స్ లేదు, పడవ ఎక్కేవారికి లైఫ్ జాకెట్స్ లేవు అని!
ఫెర్రీ ఘాట్ ప్రపంచానికి దూరంగా లేదు. విజయవాడకు కూతవేటు దూరంలోనే ఉన్నది. ఆ పడవలకు లైసెన్స్ లేదు అని, అదో కొత్తవిషయంగా ప్రకటిస్తారు. అంటే అప్పటివరకూ వారికి తెలియదు అంటే మనం నమ్మకపోతే అభివృద్ధికి అడ్డుపడే ద్రోహులమే. కలెక్టర్ ఏమి చేస్తున్నాడు? పర్యాటకశాఖ అధికారులు, మంత్రి ఏమి చేస్తున్నారు? ఇరవై మంది ఎక్కాల్సిన పడవలో నలభై మంది ఎక్కితే గమనించి, వారించే పర్యాటకశాఖ అధికారి ఒక్కడు కూడా లేడా? పడవ నడిపే వారు పరారయ్యారని, వాళ్ళు ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని, మంత్రిగారు చెబుతారు. జగన్ ను తిట్టిపొయ్యడమే తప్ప ఏనాడైనా సదరు మంత్రిగారు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ వ్యవస్థను పరిశీలించారా? మీరైతే అదే పడవలో పదికిలోమీటర్లు ప్రయాణిస్తారా?
పొద్దున్న ఎదో ఒక ఛానెల్లో ఒక మూర్ఖుడు వాదిస్తున్నాడు. పడవ ఎక్కేటప్పుడు నడిపే వాడికి లైసెన్స్ ఉన్నదో లేదో చూడకుండా పడవ ఎక్కిన ప్రయాణీకులదే తప్పు, చంద్రబాబు తప్పు లేదు, ప్రభుత్వం తప్పు అంతకంటే లేదని సెలవిచ్చాడు అతను. అవును కదా.. ఇకనుంచి ఎవరైనా బస్సు ఎక్కితే, డ్రైవర్ కు లైసెన్స్ ఉన్నదా లేదా అని మనం అడగాలి. రైలు ఎక్కేటప్పుడు డ్రైవర్ లైసెన్స్ ను చెక్ చెయ్యాలి. విమానం ఎక్కేముందు పైలెట్ లైసెన్స్ చూసి ఎక్కాలి.
మరీ దారుణం ఏమిటంటే... పడవ ప్రమాదం లో మరణించినవారి కుటుంబాలకు చంద్రన్న బీమా ఉంటె పది లక్షలు, చంద్రన్న బీమా లేని వారికి ఎనిమిది లక్షలు పరిహారం ఇస్తామని ఉపముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు., భేష్...బలే మంత్రి. మృతుల పట్ల కూడా ఈ వివక్ష ఉన్నది అన్నమాట. చనిపోయిన తరువాత చంద్రన్న బీమా ఏమిటి? రాజప్ప బీమా ఏమిటి? ప్రాణాలు అన్నీ ఒకటి కావా? ఎంత అమానుషమైన ప్రకటన.. ఒక ఉపముఖ్యమంత్రి నోటినుంచి!!
ప్రకృతివశాత్తూ ప్రమాదాలు సంభవిస్తే ఎవ్వరినీ నిందించలేము. కానీ, మానవతప్పిదాలకు శిక్షలు లేకపోతె ప్రభుత్వమే ఈ హత్యలు చేసినట్లు భావించాలి. చంద్రబాబు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, అమాయక ప్రాణాల మీద గౌరవం ఉన్నా, పర్యాటకశాఖామంత్రిని తక్షణమే ఆ పదవినుంచి డిస్మిస్ చెయ్యాలి
కృష్ణా నే రాసిచ్చారు.. భవానీ ద్వీపం సమీపంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు లోకేష్ సన్నిహితుడు ప్రతిపాదన.. నదీ పరిరక్షణ చట్టంకు విరుద్ధంగా అనుమతి ఇవ్వలేమన్న జలవనరుల శాఖ.. వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని స్పష్టీకరణ.. బ్యారేజీ ధ్వంసమైతే భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన.. అవేవీ పట్టని సీఎం చంద్రబాబు, లోకేష్.. ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ
అడిగినంత కమీషన్ ఇచ్చేవారుంటే.. ఊరూ, వాడ, భూములను అడ్డదిడ్డంగా కట్టబెట్టేస్తున్న సర్కారు ప్రభువులు.. తాజాగా విజయవాడ సమీపంలో ఏకంగా కృష్ణా నదినే రాసిచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితుడైన సూరపనేని సుభాకర్‌రావు అనే వ్యాపారికి భవానీద్వీపం సమీపంలోని కృష్ణా నదీ గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ (తేలియాడే ఆహారశాల) ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఛాంపియన్స్ యాచెట్ క్లబ్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) అయిన సూరపనేని సుభాకర్‌రావు విదేశాల్లో లండన్, దేశంలో గోవా, బెంగుళూరుల్లో వ్యాపారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేశాక ఇతని కళ్లు కృష్ణా నదిపై పడ్డాయి.
లోకేశ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో మరపడవలు(బోట్లు) తిప్పుకోవడానికి అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు జల క్రీడలు, జల విహారం, రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. మంత్రి లోకేశ్ దన్నుతో ఇప్పటికే భవానీ ద్వీపంలో కొంత భాగాన్ని, ప్రకాశం బ్యారేజీకి ఎగువన పర్యాటక శాఖకు చెందిన సీతానగరం వద్ద జట్టి(బోట్లు నిలిపే ప్లాట్‌పామ్)ను కబ్జా చేసిన సుభాకర్‌రావు.. నదీ గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతివ్వాలని లోకేశ్ సూచనల మేరకు భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ సీఈవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు భవానీ ఐలాండ్ కార్పొరేషన్ సీఈవో జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. నదీ పరిరక్షణ చట్టం–1884, పర్యావరణ చట్టాలను ఎత్తిచూపుతూ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేది లేదని జలవనరుల శాఖ తొలుత తేల్చి చెప్పింది. దాంతో ఈ వ్యవహారాన్ని సుభాకర్‌రావు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జలవనరుల శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు.
అనుమతి లేకుండానే నదీ గర్భం కబ్జా
కృష్ణా నదికి 10 నుంచి 18 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని.. నదీ ప్రవాహానికి అంతరాయం కల్పించేలా నిర్మాణాలు చేపడితే.. వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని జలవనరుల శాఖ అధికారులు లోకేశ్‌కు తెగేసి చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ఒక్కో గేటు బరువు 44 టన్నులుంటుందని.. మరపడవ 70 టన్నులకు పైగా బరువు ఉంటుందని.. వరదలు వస్తే మరపడవల తాకిడికి గేట్లు నిలవలేవని చెప్పారు. వరద ఉద్ధృతికి ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిలబడలేదని.. అది ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడితే బ్యారేజీ ధ్వంసమవుతుందని తేల్చి చెప్పారు. దీని వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తుతుందని.. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లుతుందని వివరించారు. 2009 అక్టోబర్ ఆఖరులో కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓగేరు వద్ద కుడి కరకట్ట తెగి భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని కూడా గుర్తు చేశారు.

నదుల్లో వెయ్యి టన్నుల కన్నా అధిక బరువుతో కూడిన పడవలు, నిర్మాణాలు చేపట్టలాంటే జాతీయ అంతర్గత జలరవాణా అనుమతి అవసరమని స్పష్టం చేశారు. కానీ.. ఇవేవీ మంత్రి లోకేశ్ పట్టించుకోకుండా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కూడా లోకేశ్ ప్రతిపాదనను బలపరుస్తూ తమపై ఒత్తిడి తెచ్చారని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ జీవో జారీ చేశారు. జలవనరుల శాఖ అనుమతి ఇచ్చే లోపే ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు వీలుగా నదీ గర్భాన్ని సుభాకర్‌రావు ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. జలవనరుల శాఖ అనుమతి ఇవ్వకుండానే ప్రకాశం బ్యారేజీ సమీప ప్రాంతంలో ఇప్పటికే మరపడవలను యథేచ్ఛగా తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి చెందిన మరపడవలోనే ఇటీవల సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో నదీ విహారం చేశారు.
రెండేళ్లకు అనుమతి.. ఆ తర్వాత పొడిగింపు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఒత్తిడి తట్టుకోలేక జలవనరుల శాఖ అధికారులు భవానీద్వీపం సమీపంలోని కృష్ణా నదీ గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికంగా రెండేళ్లపాటూ అనుమతి ఇవ్వాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌కు ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఓ సారి అనుమతిని రెన్యువల్ (పొడిగింపు) చేసుకునే వెసులుబాటు కల్పించారు. సుభాకర్‌రావు లండన్‌లో ఇదే రకమైన వ్యాపారం చేసి.. పన్నులు ఎగ్గొట్టడంతో అక్కడి ప్రభుత్వం ఆయన్ను డిఫాల్టర్‌గా ప్రకటించినట్లు పర్యాటక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు. గోవాలోనూ ఇదే రీతిలో సుభాకర్‌రావు వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలోనూ అదే తరహా వ్యాపారం అంటే.. నదీ గర్భంలో విందులూ వినోదాలకు తెరతీశారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదని జలవనరుల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నా, అధికార దన్నుతో వాటిని తుంగలో తొక్కడం ఖాయమని అధికారవర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అప్పుడు జేసి బస్సు ప్రమాద సమయంలో జగన్ కలెక్టర్ ని అరిచాడని ఆ ఇష్యూని సైడ్ చేశారు..
ఇప్పుడు పడవ ప్రమాదాన్ని నంది అవార్డ్ ల ప్రకటనతో ఈ ఇష్యూని సైడ్ చేశారు......
*ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు పవిత్ర సంగమం చూడడానికి వచ్చి... ఆ సంగమంలోనె సమాధి అయ్యారు......
పెద్దాయన తన పెద్దకూతుర్ని , భార్యని పొగొట్టుకున్నాడు... మరో 7 కుటుంబాల వారి బంధువులని పోగొట్టుకున్నారు....వీరి కన్నీటి వరదకు బాధ్యులు ఎవరు....????
కృష్ణానదిలో సమాధి అయినా జీవితాలకి బాధ్యులు ఎవరు....???
ప్రైవేటు బోటులకు యాదేచ్చగా పర్మిషన్లు ఇచ్చి లైఫ్ జాకెట్లు లేకుండా 20 మంది ఎక్కాల్సిన పడవలో 38 మందిని ఎక్కించి నిండు ప్రాణాలు తీసేసిన టూరిజం శాఖని శిక్షించేదెవరు....???
కార్తిక వనసమారాధన పేరుతో విచ్చలవిడిగా భవాని ఐలాండ్ ని కబ్జా చేసిన ప్రైవేట్ వాటర్ స్పోర్ట్స్ కంపెనీలపై చర్యలు ఏవి...????
.
.
.#note :.........
ప్రభుత్వం చెప్పదు...ఇవి ప్రశ్నలే తప్ప బదులు దొరకవు......
వెతకవద్దు.....
.
.
.#note :.........
ప్రభుత్వం చెప్పదు...ఇవి ప్రశ్నలే తప్ప బదులు దొరకవు......
వెతకవద్దు.....
ఆ #బోటు సిబ్బంది కూడా ఈత రాదంట.....
ఒకడు కొట్టుకుపోయాడు...
ఒకడు బ్రతికిపోయాడు....
ఒకడు కొట్టుకుపోయాడు...
ఒకడు బ్రతికిపోయాడు....
ఆ 38 మందిలో ఒక్కరైనా బోట్ ఎక్కేటప్పుడు
#లైఫ్_జాకెట్లు ఏవని నిలదీసి ఉంటే ఒక్కప్రాణం కూడా పోయేదికాదు....
.
..
.
.
.
#Note :
...
11 ప్రాణాలు తీసేసినా jc ట్రావెల్స్ ని ,
రవాణాశాఖ అధికారులని ఏం చేయలేకపోయాం....
22 ప్రాణాలు తీసేసిన ప్రైవేట్ బోట్స్ నిర్వాహకులని , టూరిజంశాఖ అధికారులని ఏం చేయగలం.....

మన అధికారుల నిర్లక్ష్యంతో పోయే ప్రాణాలు ఎలాగో పోతూనే ఉంటాయి...
..
No comments:
Post a Comment