Thursday, 30 March 2017

ఆక్వా పరిశ్రమలో ప్రమాదం.. ఐదుగురు మృతి
మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూలో విషాదం చోటుచేసుకుంది. ఆక్వా ప్రాసెసింగ్‌ పరిశ్రమలో విష వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతిచెందారు. ఈరోజు ఉదయం పరిశ్రమలోని రసాయనాల ట్యాంకును శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ఐదుగురు కార్మికులు విష వాయువుల ప్రభావానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. మృతులను బొడ్డు రాంబాబు(మెట్టురేవు), ఎన్‌.ఏడుకొండలు(నల్లవారితోట), ప్రవీణ్‌(కాళీపట్నం), ఈగ ఏడుకొండలు(సీతారాంపురం), తోట శ్రీనివాసరావు(కట్టుకాలువ)గా గుర్తించారు. ఐదుగురు యువకులకు మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments: