Thursday, 4 May 2017

ఎక్కడికి పోవాలి : ఈ భూమి ఉండేది వందేళ్లేనా!

earth
ఈ భూమి ఉండేది వందేళ్లేనా.. ఆ తర్వాత నివాసయోగ్యానికి పనికిరాదా.. అంతం అయిపోతుందా.. మనిషి మనుగడే ఉండదా.. రాబోయే 100 సంవత్సరాల్లో మరోగ్రహంపై మానవుడి జీవితం ప్రారంభం కావాలా.. అదే జరగకపోతే మానవుడు మాయం అవుతాడా.. ఇదే విషయాలపై పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కఠోర విషయాలు వెల్లడించారు. రాబోయే వందేళ్లేలో కొత్త గ్రహంపై జీవనం ప్రారంభించకపోతే… ఈ భూమిపైనా మనిషి అంతం అయిపోతాడని చెబుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు మొదటి కారణం అంటున్నారు. గ్రహశకలాల తాకిడి.. అధిక జనాభాతో భూమికి అతి పెద్ద ముప్పు రానుందని చెబుతున్నారు. త్వరగా భూమిపై నుంచి షిఫ్ట్ అయితేనే బాగుంటుందని గట్టిగా చెబుతున్నారు.
బీబీసీ రూపొందించిన ‘టుమారోస్ ఎర్త్’ అనే డాక్యుమెంటరీలో కూడా మానవ జీవనం విధానంపై వివరణాత్మకంగా వివరించారు స్టీఫెన్ హాకిన్. దీనికోసం ఆయన తన మాజీ శిష్యుడు క్రిస్టోఫర్ గాల్ ఫార్డ్ తో కలిసి.. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. మానవత్వమే మనిషిని కాపాడాలన్నారు. వేరే గ్రహాన్ని చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ షోలో భాగంగా.. ప్రపంచంలో ఏది గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ అని ప్రజల నుంచి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు ‘ది టెలిగ్రాఫ్ ‘ కథనం ప్రచురించింది.

No comments: