స్వయంగా కేంద్రం నిర్ధారించిన ఈ సమాచారం ద్వారా దేశంలో ప్రజలకు చాలా రహస్యంగా ఉంచుతామని చెప్పిన ఆధార్ తో రక్షణ లేదని తేలిపోయింది ఇక మిగిలింది ఐరిస్ & ఫింగర్ ప్రింట్స్ . వీటిని కూడా ఎప్పుడో అమ్మేసుకుని ఉంటారని ప్రైవేట్ సెక్టార్ కి చెందిన మన టెలికాం కంపెనీలు మనం ప్రభుత్వానికి మాత్రమే మనం ఇచ్చిన అత్యంత రహస్యం, సురక్షితం అని చెప్తున్న ఫింగర్ ప్రింట్స్ ద్వారా సిమ్స్ ను స్పాట్ యాక్టివేషన్ చేయడం వంటివి చూస్త్తుంటే అర్ధం అవుతుంది.
ఆధార్ తో పాటు మన వేలిముద్రలు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ వేలిముద్రలను సేకరించి ఎదైనా హత్య , దొంగతనం లాంటివి జరిగిన ప్రదేశంలో పడేట్లు చేసి ఇరికించడం పెద్ద కష్టమేం కాదు. అప్పుడు పరిస్ధితి ఏంటి ?
కొద్దిరోజుల్లో ఏటీఎం కార్డులను తీసేసి ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఏటీఎం ల నుండి మనీ విత్ డ్రా , ట్రాన్సఫర్ వంటి చేస్తామని ప్రభుత్వం అంటుంది. మరి అప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ కు నకిలీ చేసి ఎవరైనా మన అకౌంట్ ని ఆపరేట్ చేయలేరా ? అసలు ఈ ప్రభుత్వంతో మనకి సెక్యూరిటీ కల్పించగలదా? ప్రస్తుతం ఆస్తుల వివరాలు ఆర్ధిక లావాదేవీలన్నీ ఆధార్ తోనే అనుసంధానం చేస్తామంటున్నారు. మరి మన ఆధార్ కార్డ్, వేలిముద్రలు వంటివి ప్రైవేటు వ్యక్తులకు చిక్కితే మనం ఎంతవరకూ సురక్షితంగా ఉన్నట్లు...? ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
No comments:
Post a Comment