Friday, 29 December 2017

పాడవోయి భరతీయుడా ఆడిపాడవోయి విజయగీతిక పాడవోయి భరతీయుడా ఆడిపాడవోయి విజయగీతిక నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం నేడే నవోదయం నీదే ఆనందం ||పాడవోయి భరతీయుడా|| స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి సంబరపడగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి సంబరపడగానే సరిపోదోయి సాదించిన దానికి సంత్రుప్తిని పొంది అదే విజయమనుకొంటే పొరపాటోయి ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారుల ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారుల ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుధ్యోగమింకొకవైపు ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుధ్యోగమింకొకవైపు అవినీతి బంధుప్రీతి చికటిబజారు అలుముకొన్న ఈ దేశం ఎటుదిగజారు కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి పదవీవ్యామొహాలు కులమతభేదాలు భాషాద్వేషాలు చెలరేగునేడు పదవీవ్యామొహాలు కులమతభేదాలు భాషాద్వేషాలు చెలరేగునేడు ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే తనసౌఖ్యం తనభాగ్యం చూసుకొనెవాడే స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం సమసమాజనిర్మానమే నీద్యేయం నీద్యేయం సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం ఏకధీక్షతో గమ్యం చేరిననాడే లోకానికి మనభారతదేశం అందిచునదే శుభసందేశం లోకానికి మనభారతదేశం అందిచునదే శుభసందేశం

No comments: